
రాణించిన రికీ భుయ్
రికీ భుయ్ (183 బంతుల్లో 91 బ్యాటింగ్; 12 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ మహ్మద్ కైఫ్ (235 బంతుల్లో 66 బ్యాటింగ్; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలతో
సాక్షి, విజయనగరం: రికీ భుయ్ (183 బంతుల్లో 91 బ్యాటింగ్; 12 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ మహ్మద్ కైఫ్ (235 బంతుల్లో 66 బ్యాటింగ్; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలతో రాణించడంతో పటిష్టమైన ముంబైతో గురువారం మొదలైన రంజీ ట్రోఫీ గ్రూప్-బి మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు నిలకడగా ఆడుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 80 ఓవర్లలో 2 వికెట్లకు 170 పరుగులు చేసింది. ఓపెనర్లు భరత్ (1), ప్రశాంత్ (7) విఫలమైనా... కైఫ్, భుయ్‌లు నెమ్మదిగా ఆడుతూ మూడో వికెట్‌కు అజేయంగా 152 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. శార్దూల్ ఠాకూర్, సంధూ చెరో వికెట్ తీశారు.
హైదరాబాద్ 246/5
గోవా: కెప్టెన్ విహారి (165 బంతుల్లో 82; 11 ఫోర్లు), అక్షత్ రెడ్డి (118 బంతుల్లో 61; 10 ఫోర్లు)లు రాణించడంతో గోవాతో మొదలైన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో హైదరాబాద్ నిలకడగా ఆడుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 69 ఓవర్లలో 5 వికెట్లకు 246 పరుగులు చేసింది. అనిరుధ్ (24 బ్యాటింగ్), ఆకాశ్ బండారీ (15 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. వర్షం వల్ల మ్యాచ్‌కు అంతరాయం కలగడంతో 21 ఓవర్ల ముందుగానే ఆటను ముగించారు. రితూ రాజ్ సింగ్ 2 వికెట్లు తీశాడు.
వీరూ జోరు
మహారాష్ట్రతో జరుగుతున్న గ్రూప్ - ఎ రంజీ మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ (129 బంతుల్లో 92; 15 ఫోర్లు) జోరు చూపెట్టాడు. హిమాన్షు రాణా (236 బంతుల్లో 138 బ్యాటింగ్; 20 ఫోర్లు)తో కలిసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఈ ఇద్దరి జోరుతో హరియాణా తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 6 వికెట్లకు 303 పరుగులు చేసింది. జయంత్ యాదవ్ (22 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో వీరూ, రాణాలు మూడో వికెట్‌కు 124 పరుగులు జోడించారు. సమద్ ఫల్హా 3 వికెట్లు తీశాడు.
ళీళీ మరోవైపు రాజస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ గంభీర్ (24) విఫలమయ్యాడు. మిగతా బ్యాట్స్‌మెన్ కూడా నిరాశపర్చడంతో ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 47 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. రాజస్తాన్ బౌలర్లు దీపక్ చాహర్ (5/60), అనికేత్ చౌదరి (3/26)లు ప్రత్యర్థి జట్టును కట్టడి చేశారు. తర్వాత రాజస్తాన్ 34 ఓవర్లలో 3 వికెట్లకు 74 పరుగులు చేసింది. ప్రణయ్ శర్మ (42) రాణించాడు.
ళీళీ జాతీయ జట్టులో చోటు కోల్పోయిన సౌరాష్ర్ట బ్యాట్స్‌మన్ రవీంద్ర జడేజా (91) త్రిపురతో జరుగుతున్న మ్యాచ్‌లో సత్తా చూపెట్టాడు. షెల్డన్ జాక్సన్ (82 బ్యాటింగ్) కూడా రాణించడంతో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 6 వికెట్లకు 270 పరుగులు చేసింది. అభిజిత్ దేవ్ 4 వికెట్లు తీశారు.ళీళీ బౌలర్ల పరాక్రమంతో సర్వీసెస్, జార్ఖండ్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఒకే రోజు 19 వికెట్లు నేలకూలాయి. దివేశ్ పథానియా (6/19), రూషన్ రాజ్ (3/14)ల దెబ్బకు జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 37.5 ఓవర్లలో 45 పరుగులకే కుప్పకూలింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సర్వీసెస్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగులు చేసింది.