సాక్షి, హైదరాబాద్ : టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. సోషల్ మీడియా వేదికగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన కైఫ్‌ను నెటిజన్లు మతాన్నిప్రస్తావిస్తూ దూషణకు దిగుతున్నారు. సోమవారం కుటుంబ సభ్యులతో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న కైఫ్ ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్‌చేశాడు. ఈ ఫొటోకు కొంతమంది ‘నీవు నిజమైన భారతీయునివి’ అని సానుకూలంగా స్పందించంగా మరికొంత మంది ఘాటుగా వ్యక్తిగత దూషణకు దిగారు.
ఓ ముస్లింగా క్రిస్మమస్ శుభాకాంక్షలు తెలపడం షేమ్ అని కొందరంటే.. నీ మతమేంటో మరిచిపోయావా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరైతే నీ తాత హిందువు నుంచి ముస్లిం మతం ఎంచుకున్నాడా.., ఇలాంటివి పోస్ట్ చేసే ముందు నీ మతం ఏంటో తెలుసుకో అని ట్రోల్ చేస్తున్నారు.
కైఫ్ నెటిజన్ల ఆగ్రహానికి గురవ్వడం ఇది తొలిసారేం కాదు. గతంలో యోగా చేస్తూ సూర్యనమస్కారాలు పెట్టడం, కొడుకుతో చెస్ ఆడుతున్నఫొటోలతో విమర్శలకు గురయ్యాడు. వీటన్నిటికి స్ట్రాంగానే రిప్లే ఇచ్చిన కైఫ్ తాజా కామెంట్లకు ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.
Comments
Please login to add a commentAdd a comment