
డిసెంబర్ 1న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 3.
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఊడీ అలెన్ (హాలీవుడ్ దర్శకుడు), మొహమ్మద్ కైఫ్ (క్రికెటర్)
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 3. ఇది గురుసంఖ్య కాబట్టి వీరికి సహజంగానే విద్య, వినయం, వాక్చాతుర్యం అలవ డి, అందరితోటీ మంచివారిగా మన్ననలందుకుంటారు. ఈ సంవత్సరం విద్యార్థులు చదువులో మంచి పేరు తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా రాణిస్తారు. నిరుద్యోగులు పోటీపరీక్షలలో మంచి ర్యాంకులు తెచ్చుకోవడం వల్ల ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి. 30 సంవత్సరాలు దాటిన వారికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది. సంగీతం, నాట్యం వంటి లలిత కళలను నేర్చుకోవాలన్న కోరిక కలిగి, వాటిని అభ్యసించడం వల్ల సంఘగౌరవం లభిస్తుంది. సృజనాత్మక, మీడియా రంగాలలో ఉన్నవారు కొత్త కొత్త ఆలోచనలతో వారి వారి రంగాలలో కొత్త ఉరవడిని సృష్టించగలుగుతారు.
స్వయం ఉపాధిలో ఉన్న వారు రాణిస్తారు. వీరి పుట్టిన తేదీ 1. ఇది సూర్యునికి సంబంధించినది కాబట్టి వీరికి జన్మతః నాయకత్వ లక్షణాలు, ఏదయినా పనిని ముందుకు తీసుకె ళ్లే చొరవ, కష్టపడి పైకొచ్చే మనసత్తత్వం ఉంటాయి. వీరు కొత్తప్రాజెక్టులు మొదలు పెట్టడానికి ఇది మంచి తరుణం. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకొస్తుంది. ఐ.ఎ.ఎస్‌లు తదితర అధికారులకు ప్రమోషన్లు లభిస్తాయి.
లక్కీనంబర్లు: 1,3,4,6. లక్కీ కలర్స్: వయొలెట్, బ్లూ, ఎల్లో, రెడ్. లక్కీడేస్: ఆది, సోమ, బుధ, గురు, వారాలు
సూచనలు: దక్షిణామూర్తిని ఆరాధించడం, గురువులను, పండితులను సన్మానించడం, వేదపాఠశాలలకు, మిషనరీలకు, మదరసాలకు సాయం చేయడం, ఆదిత్య హృదయం పారాయణ చేయడం లేదా వినడం వృద్ధులకు, వికలాంగులకు అన్నదానం చేయడం మంచిది.
- డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్