కెప్టెన్‌ ధావన్‌ అయితే బాగుండు! | Mohammad Kaif Says Shikhar Dhawan should lead SunRisers Hyderabad | Sakshi
Sakshi News home page

Published Wed, Mar 28 2018 8:11 PM | Last Updated on Wed, Mar 28 2018 8:11 PM

Mohammad Kaif Says Shikhar Dhawan should lead SunRisers Hyderabad - Sakshi

శిఖర్‌ ధావన్‌

సాక్షి, హైదరాబాద్‌ : ట్యాంపరింగ్‌ వివాదంతో ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌లు ఈ సీజన్‌ ఐపీఎల్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి స్థానాల్లో ప్రాంచైజీలు ఎవరిని తీసుకుంటాయా అనే విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ సీజన్‌ వేలంలో అన్‌సోల్డ్‌గా నిలిచిన ఇంగ్లండ్‌ టెస్ట్‌ కెప్టెన్‌ జోరూట్‌, టీ20 కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌, వెస్టిండీస్‌ ఆటగాడు లెండీ సిమ్మన్స్‌, దక్షిణాఫ్రికా ప్లేయర్‌ హషీమ్‌ ఆమ్లాలపై అందరి దృష్టి పడింది. ఇదే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ తన ట్విటర్‌లో క్వశ్చన్‌ పోల్‌ నిర్వహించాడు. 

ఇక అంతేగాకుండా సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా శిఖర్‌ ధావన్‌ రాణించగలడని ఈ మాజీ క్రికెటర్‌ అభిప్రాయపడ్డారు. కొన్ని సార్లు అతను ఇలంటి బాధ్యతలను కూడా తీసుకున్నాడని, అంతేగాకుండా ధావన్‌ కెప్టెన్‌ అయితే తొలి సారి భారత్‌ ఆటగాళ్ల సారథ్యంలో ఐపీఎల్‌ కొనసాగుతుందని కైఫ్‌ తన మనసులోని కోరికను బయటపెట్టాడు. సన్‌రైజర్స్‌ పగ్గాలు కన్నె విలియమ్స్‌న్‌కు దక్కే అవకాశాలున్నాయని పేర్కొన్నాడు.

ఆసీస్‌ పర్యటనలో భారతే ఫేవరేట్‌
స్మిత్‌, వార్నర్‌పై క్రికెట్‌ ఆస్ట్రేలియా నిషేదం విధించడంతో నవంబర్‌లో ఆస్ట్రేలియాలో జరిగే టెస్టె సిరీస్‌ టీమిండాయేనే హాట్‌ ఫేవరేట్‌ కానుందని కైఫ్‌ ట్వీట్‌ చేశాడు. ‘స్మిత్‌, వార్నర్‌పై క్రికెట్‌ ఆస్ట్రేలియా ఏడాది నిషేధంతో పాటు స్మిత్‌ను రెండేళ్ల పాటు కెప్టెన్సీ చేసే అవకాశం లేకుండా చేసింది. నవంబరులో టెస్టు సిరీస్‌ కోసం ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటించ నుంది. స్మిత్‌, వార్నర్‌ లేని ఈ సిరీస్‌లో టీమిండియానే హాట్‌ ఫేవరేట్‌. వచ్చే ఏడాది మేలో జరిగే ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా జట్టుకు ఎవరు నాయకత్వం వహిస్తారు. అరోన్‌ ఫించా? అని’ ట్వీట్‌లో కైఫ్‌ పేర్కొన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement