వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా కొన్ని ప్రయోగాలు చేసిన సంగతి తెలిసిందే. ఆఖరి రెండు మ్యాచ్‌లకు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లికి జట్టు మెనెజ్‌మెంట్ విశ్రాంతి ఇచ్చింది. వారి స్దానంలో యువ ఆటగాళ్లకు అవకాశం లభించింది. కొంతమెరకు టీమిండియా చేసిన ప్రయోగాలు ఫలించాయనే చెప్పుకోవాలి. ముఖ్యంగా సంజూ శాంసన్ వంటి ఆటగాడికి వరల్డ్‌కప్ ముందు తన సత్తా నిరూపించుకోవడానికి సువర్ణవకాశం దక్కింది.
రెండో వన్డేలో విఫలమైన సంజూ.. నిర్ణయాత్మక మూడో వన్డేలో మాత్రం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. నాలుగో స్ధానంలో బ్యాటింగ్ వచ్చి 41 బంతుల్లో 51 పరుగులతో భారత్ భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అతడిని భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలని పలువురు మాజీలు సూచిస్తున్నారు. ఈ జాబితాలో భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ చేరాడు. ఈ ఏడాది జరగనున్న వరల్డ్‌కప్ సంజూ శాంసన్ సిద్ధంగా ఉన్నాడని కైఫ్ అభిప్రాయపడ్డాడు.
సంజూ రెడీ..
"విండీస్‌తో ఆఖరి మ్యాచ్‌లో శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడి ఆట తీరు నన్ను ఎంతో గానే అకట్టుకుంది. సంజూకు నాలుగు లేదా ఐదో స్ధానంలో బ్యాటింగ్ చేసే సత్తా ఉంది. అతడు గతంలో కూడా ఇదే బ్యాటింగ్ పొజిషేన్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. కానీ మిడిలార్డర్‌లో కిషన్ లేదా అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్‌కు పంపాలనుకోవడం సరైన నిర్ణయం కాదు.
మిడిలార్డర్‌లో లెగ్ స్పిన్, లెఫ్ట్‌ఆర్మ్ స్పిన్‌కు బాగా ఆడే ఆటగాడు కావాలి. ఆ పని సంజూ చేయగలడు. సంజూ స్పిన్నర్ల బౌలింగ్‌లో సిక్సర్ల వర్షం కురిపించగలడు. కాబట్టి అతడిని కచ్చితంగా వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయాలి. సంజూ కూడా సిద్దంగా ఉన్నాడని అమృత్ మాథుర్ పుస్తకం 'పిచ్‌సైడ్' ఆవిష్కరణ కార్యక్రమంలో కైఫ్ పేర్కొన్నాడు. ఇక గురువారం నుంచి విండీస్‌తో మొదలు కానున్న టీ20 సిరీస్‌లో కూడా సత్తా చాటేందుకు సంజూ సిద్దమయ్యాడు.
చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో తొలి టీ20.. చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment