Courtesy: IPL Twitter
ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ థీమా వక్య్తం చేశాడు. ఐపీఎల్-2022లో భాగంగా శనివారం కీలక పోరులో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలుపొందితే ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధిస్తుంది. ఒక వేళ ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓటమి చెందితే ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది.
"ఢిల్లీ క్యాపిటల్స్ సరైన ఫామ్‌లో కొనసాగుతోంది. వారు వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి మంచి ఊపులో ఉన్నారు. వారి నెట్ రన్ రేట్ చాలా బాగుంది. కాబట్టి ఇప్పుడు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే ముంబైని ఓడించాలి. ఢిల్లీ ఆటగాళ్లు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. మిచెల్ మార్ష్ మంచి రిథమ్‌లో ఉన్నాడు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు.
ఇక బౌలర్లు కూడా తమ పని తాము చేసుకుపోతున్నారు. రిషబ్ పంత్ కూడా కీలకమైన ఇన్నింగ్స్‌లను ఆడుతున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ కూడా చివరి మ్యాచ్‌లో పవర్‌ప్లేలో అధ్బుతంగా ఆడాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో ముంబైని ఢిల్లీ ఓడించడం ఖాయమని" స్పోర్ట్స్ కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహ్మద్ కైఫ్ పేర్కొన్నాడు.
చదవండి: Deepak Chahar: ప్రేయసిని పెళ్లాడనున్న టీమిండియా పేసర్.. శుభలేఖ వైరల్..!
Comments
Please login to add a commentAdd a comment