ఆసియాకప్-2023కు టీమిండియా అన్ని విధాల సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్ కోసం రోహిత్ సారథ్యంలోని భారత జట్టు మంగళవారం శ్రీలంకకు పయనమైంది. అయితే జట్టుతో పాటు స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ శ్రీలంకకు వెళ్లలేదు. గాయం నుంచి కోలుకున్నప్పటికీ పూర్తి ఫిట్‌నెస్ అయితే ఇంకా సాధించలేదు.
దీంతో టోర్నీలో మొదటి రెండు మ్యాచ్‌లకు రాహుల్ దూరం కానున్నట్లు భారత హెడ్‌కోచ్ ద్రవిడ్ సృష్టం చేశాడు. ఈ నేపథ్యంలో రాహుల్‌ను ఉద్దేశించి భారత మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఆసియా కప్‌లో మిగితా మ్యాచ్‌లకు కూడా రాహుల్ అందుబాటులో ఉంటాడనే నమ్మకం లేదని కైఫ్ అభిప్రాయపడ్డాడు.
"ఆసియాకప్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు రాహుల్ అందుబాటులో ఉండడని మెనెజ్‌మెంట్ చెప్పుకొచ్చింది. అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని మనం అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ ఫిట్‌గా ఉన్న రాహుల్ మరో రెండు గేమ్ ల తర్వాత కోలుకుంటాడన్న గ్యారెంటీ లేదు. వన్డేల్లొ ఐదో స్ధానంలో రాహుల్ అద్భుత ఆటగాడు.
అటువంటి ప్లేయర్ దూరం కావడం భారత జట్టుకు కోలుకోలేని ఎదురుదెబ్బ. రాహుల్‌కు పెద్ద షాట్లు ఆడడమూ తెలుసు.. క్లిష్టపరిస్ధితుల్లో జట్టును అదుకోవడం తెలుసు. రాహుల్ స్ధానంలో కిషన్ వచ్చినప్పటికీ అతడి లోటును మాత్రం పూడ్చలేడు.
రాహుల్ వికెట్ కీపింగ్‌తో పాటు ఫినిషింగ్ టచ్ కూడా అందించగలడని" స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కైఫ్ పేర్కొన్నాడు. ఇక భారత్ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 2న కాండీ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది.
చదవండి: Asia Cup 2023: ‘ఆసియా’ సింహాల సమరానికి సై.. చరిత్ర టీమిండియాదే
Comments
Please login to add a commentAdd a comment