శ్రేయస్ అయ్యర్ (PC: BCCI)
Asia Cup, 2023 - Shreyas Iyer: టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను ఫిట్‌నెస్ సమస్యలు వెంటాడుతున్నాయి. వెన్నునొప్పి నుంచి కోలుకుని సుదీర్ఘకాలం తర్వాత ఇటీవలే అతడు పునరాగమనం చేసిన విషయం తెలిసిందే. సర్జరీ తర్వాత జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన ఈ మిడిలార్డర్ బ్యాటర్.. ఆసియా కప్-2023 జట్టుకు ఎంపికయ్యాడు.
రీఎంట్రీలో విఫలం
ఈ క్రమంలో పాకిస్తాన్‌తో గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్‌లో తుదిజట్టులో చోటు దక్కించుకున్న అయ్యర్.. కేవలం 14 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఇక నేపాల్‌తో మ్యాచ్‌లో ఓపెనర్లే టార్గెట్ పూర్తి చేయడంతో అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.
ఇషాన్ అనుకుంటే అయ్యర్ అవుట్
ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌తో సూపర్-4 మ్యాచ్‌కు మరో మిడిలార్డర్ బ్యాటర్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ అందుబాటులోకి రావడంతో.. ఎవరిపై వేటు పడుతుందనే చర్చలు జరిగాయి. మిడిలార్డర్‌లో కీలకమైన నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు కాబట్టి.. మరో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌ను తప్పిస్తారని అంతా భావించారు.
పాక్‌తో మ్యాచ్‌లో అదరగొట్టినప్పటికీ రాహుల్ కోసం ఇషాన్‌ను పక్కకుపెట్టి లైన్ క్లియర్ చేస్తారనే వార్తలు వినిపించగా.. పాక్‌తో మ్యాచ్‌కు ముందు ఆఖరి నిమిషంలో అయ్యర్ జట్టులో లేడని తెలిసింది. వెన్నునొప్పి వేధిస్తున్న కారణంగా అతడిని తుదిజట్టు నుంచి తప్పించినట్లు కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు.
అజేయ సెంచరీతో సత్తా చాటి
ఈ క్రమంలో రాహుల్ అద్భుత అజేయ సెంచరీ(111)తో కమ్‌బ్యాక్ ఇచ్చి సత్తా చాటాడు. ఇదిలా ఉంటే.. మంగళవారం నాటి శ్రీలంకతో మ్యాచ్‌లో అయ్యర్ అందుబాటులోకి వస్తాడనుకుంటే అదీ జరుగలేదు. వెన్నునొప్పి తగ్గినప్పటికీ పూర్తిస్థాయిలో అయ్యర్ కోలుకోలేదని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
బీసీసీఐ ప్రకటన
‘‘బీసీసీఐ వైద్యబృందం పర్యవేక్షణలో వారి సూచనలకు అనుగుణంగా శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈరోజు ఆసియా కప్-2023 సూపర్-4లో శ్రీలంకతో మ్యాచ్ నేపథ్యంలో అతడు జట్టుతో కలిసి స్టేడియానికి వెళ్లడం లేదు’’ అని ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.
ఫిట్‌నెస్‌పై దృష్టి పెడితేనే
కాగా కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ చాలా కాలం తర్వాత నేరుగా తుదిజట్టులో ఆడే అవకాశం దక్కించుకోవడం పట్ల టీమిండియా మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా.. రాహుల్ ఆసియా కప్ తొలి రెండు మ్యాచ్‌లకు దూరం కావడం.. ఇప్పుడిలా అయ్యర్ సూపర్-4లో కీలక మ్యాచ్‌లకు అందుబాటులో లేకుండా పోవడం ఇందుకు కారణమైంది.
ఎంతో మంది ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు జట్టులో చోటు కోసం ఎదురుచూస్తుంటే ఫిట్‌నెస్ లేని వాళ్ల కోసం వారిని బలిచేయడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చదవండి: Ind vs SL: నా 15 ఏళ్ల కెరీర్‌లో ఇదే మొదటిసారి.. అప్పటికి నాకు 35: కోహ్లి
UPDATE - Shreyas Iyer is feeling better but is yet to fully recover from back spasm. He has been adviced rest by the BCCI Medical Team and has not travelled with the team to the stadium today for India's Super 4 match against Sri Lanka.#AsiaCup2023 pic.twitter.com/q6yyRbVchj
— BCCI (@BCCI) September 12, 2023
Comments
Please login to add a commentAdd a comment