టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దాదాపు ఏడాది తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఆగస్టులో ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు భారత జట్టు సారధిగా బుమ్రా వ్యవహరించనున్నాడు. ఆసియాకప్, వన్డే ప్రపంచకప్‌కు ముందు బుమ్రా తిరిగి పూర్తి ఫిట్‌నెస్ సాధించడం భారత జట్టుకు కలిసొచ్చే అంశం. ఈ నేపథ్యంలో బుమ్రా పునరాగమనంపై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కీలక వాఖ్యలు చేశాడు.
బుమ్రా ఫిట్‌నెస్‌గా ఉండడం చాలా ముఖ్యమని, వరల్డ్‌కప్ వంటి మెగా ఈవెంట్‌లో అతడి సేవలు భారత జట్టుకు చాలా అవసరమని కైఫ్ అభిప్రాయపడ్డాడు. కాగా 2019 వన్డే ప్రపంచకప్‌లో భారత్ టైటిల్ గెలవకపోయనప్పటికీ.. బుమ్రా మాత్రం తన ప్రదర్శనతో అందరినీ అకట్టుకున్నాడు. ఈ మెగా టోర్నీలో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. 9 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఈ ఏడాది ప్రపంచకప్‌లో కూడా బుమ్రా సత్తాచాటాలని సగటు అభిమాని కోరుకుంటున్నాడు.
వరల్డ్‌కప్ గెలవాలంటే అతడు ఉండాల్సిందే..
"బుమ్రా తన ఫిట్‌నెస్‌ను తిరిగి పొందడం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే అతడు ఆసియాకప్, వన్డే ప్రపంచకప్‌కు ముందు జట్టులోకి రావడం చాలా ముఖ్యం. బుమ్రా ఆసియాకప్‌కు ముందు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనున్నాడు. అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడా లేదా అన్నది ఐరీష్ గడ్డపై తేలిపోతుంది. బుమ్రా అక్కడ ఫిట్‌నెస్‌తో బౌలింగ్ చేసి వికెట్లు పడగొడితే, అతడిని అపడం ఎవరితరం కాదు. ముఖ్యంగా స్వదేశంలో అయితే ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తాడని" కైప్ పేర్కొన్నాడు.
వరల్డ్‌కప్ గురించి కైఫ్ మాట్లాడుతూ.. :"ప్రస్తుతం భారత జట్టు అంత బలంగా కన్పించడం లేదు. ఎందుకంటే చాలా మంది కీలక ఆటగాళ్లు గాయాలతో పోరాడతున్నారు. ప్రపంచకప్‌లో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ సేవలను భారత్ కోల్పోయే ఛాన్స్ ఉంంది. అయితే బుమ్రా తిరిగి రావడం మాత్రం భారత్‌కు భారీ ఊరటను కలిగిస్తోంది. ఒక వేళ అతడు తిరిగి తన ఫిట్‌నెస్‌ను కోల్పోయి ప్రపంచకప్‌కు దూరమైతే.. మెగా టోర్నీలో పరాభవం తప్పదని" ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
చదవండి: IND vs WI: టీమిండియాతో తొలి టీ20.. విండీస్ సిక్సర్ల కింగ్ వచ్చేశాడు! బౌలర్లూ జాగ్రత్త
Comments
Please login to add a commentAdd a comment