టీమిండియా
"Stay on Instagram but be here as well": టీమిండియా క్రికెటర్ల ఆట తీరుపై మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ మండిపడ్డాడు. కండలు పెంచి ఫొటోలు షేర్ చేస్తే సరిపోదని.. మైదానంలో మన ప్రదర్శన ఎలా ఉందన్నదే ముఖ్యమంటూ ఘాటు విమర్శలు చేశాడు. ఆసియా కప్-2023లో భాగంగా తమ రెండో మ్యాచ్‌లో భారత జట్టు సోమవారం నేపాల్‌తో తలపడిన విషయం తెలిసిందే.
మూడు గోల్డెన్ క్యాచ్‌లు డ్రాప్
శ్రీలంకలోని పల్లెకెలెలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆదిలోనే మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ వంటి స్టార్ పేసర్లను దింపినా ఫలితం లేకుండా పోయింది. టీమిండియా ఫీల్డర్ల తప్పిదాలతో లైఫ్ పొందిన నేపాల్ ఓపెనర్లు కుశాల్ భుర్తేల్(38), ఆసిఫ్ షేక్(58) మెరుగైన స్కోర్లు సాధించారు.
PC: Star Sports
ఆరంభంలో వీళ్లిద్దరు ఇచ్చిన మూడు గోల్డెన్ మ్యాచ్‌లను శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లి, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ మిస్ చేయడం వల్ల ఈ మేరకు భారత బౌలర్లకు భంగపాటు తప్పలేదు. ఈ నేపథ్యంలో మహ్మద్ కైఫ్.. క్యాచ్ డ్రాప్‌లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
పెద్ద పెద్ద కండలు ఉంటే సరిపోదు
స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ..‘‘మీరు ఎంత ఫిట్‌గా ఉన్నారన్న విషయంతో సంబంధం లేదు. మీకు పెద్ద పెద్ద కండలు ఉండొచ్చు. జిమ్‌లో వర్కౌట్లతో మీరు నిరంతరం శ్రమిస్తూ ఉండవచ్చు.
అంతేనా... అందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయనూ వచ్చు. అయితే, మైదానంలో మీరు చురుగ్గా కదలలేకపోతే.. ఏం లాభం? ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నట్లు ఇక్కడా ఫిట్‌గా ఉన్నామని నిరూపించుకోవాలి కదా!’’ అని అయ్యర్, కోహ్లి, ఇషాన్‌లను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
శ్రేయస్ అయ్యర్
కోహ్లికి ఇదేం మొదటిసారి కాదు
అదే విధంగా స్టార్ బ్యాటర్, ఫిట్‌నెస్‌కు మారుపేరైన విరాట్ కోహ్లి గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నేపాల్‌తో మ్యాచ్‌లో కోహ్లి నన్ను పూర్తిగా నిరాశపరిచాడు. అయినా విరాట్ కోహ్లి క్యాచ్‌లు డ్రాప్ చేయడం ఇదే మొదటిసారి కాదు.
ఐపీఎల్‌లోనూ ఇలాగే చేశాడు. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లతో మ్యాచ్‌లలోనూ ఇలాంటి తప్పులే చేశాడు. ఈ విషయంలో నేనేమీ అబద్ధం చెప్పడం లేదు. వాస్తవం మాట్లాడుతున్నా’’ అంటూ మహ్మద్ కైఫ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు.
సూపర్-4లో టీమిండియా ఎంట్రీ
కోహ్లి ఫిట్‌గా ఉంటాడన్న విషయం అందరికీ తెలుసని, అయితే మైదానంలో కూడా ఆ విషయాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుందంటూ చురకలు అంటించాడు. కాగా టీమిండియాతో మ్యాచ్‌లో మెరుగైన ఆట తీరు కనబరిచిన నేపాల్.. 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది.
ఈ క్రమంలో... వర్షం అంతరాయం కలిగిన నేపథ్యంలో డీఎల్‌ఎస్ పద్ధతిలో విధించిన లక్ష్యాన్ని టీమిండియా 20.1 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా ఛేదించింది. తద్వారా పది వికెట్ల తేడాతో గెలుపొంది సూపర్-4లో ఎంట్రీ ఇచ్చింది.
చదవండి: WC 2023: శ్రేయస్ అయ్యర్‌కు నో ఛాన్స్! అనూహ్యంగా వాళ్లిద్దరికి చోటు..
ఆరోజు నేను- ధోని కాదు.. భజ్జీ గెలిపించాడు! వెటకారమెందుకు గంభీర్? బుద్ధుందా?
Comments
Please login to add a commentAdd a comment