ఈజీ క్యాచ్‌లు డ్రాప్ చేసిన టీమిండియా ఫీల్డర్లు (PC: X(Twitter))
Asia Cup, 2023 India vs Nepal: నేపాల్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఫీల్డర్ల పొరపాట్లపై అభిమానులు మండిపడుతున్నారు. పసికూనతో మ్యాచ్ అనే నిర్లక్ష్యం వద్దని.. ప్రత్యర్థిని తేలికగా తీసుకుంటే భారీ మూల్యం చెల్లించకతప్పని దుస్థితి బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఆసియా కప్-2023లో భాగంగా గ్రూప్-ఏలో ఉన్న నేపాల్ తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడింది. ముల్తాన్‌లో ఆగష్టు 30న జరిగిన మ్యాచ్‌లో పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 342 పరుగులు స్కోరు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్‌కు ఆతిథ్య జట్టు బౌలర్లు చుక్కలు చూపించారు.
పాక్ బౌలర్ల ముందు చిత్తు
ఓపెనర్లు కుశాల్ భుర్తేల్ 8 పరుగుల వద్ద పెవిలియన్ చేరగా.. ఆసిఫ్ షేక్ 5 పరుగులకే వెనుదిరిగాడు. ఇక తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ వచ్చిన నేపాల్ క్రికెటర్లు చేసిన స్కోర్లు వరుసగా.. 0, 26, 28, 13, 3, 6, 0, 7, 0. కానీ టీమిండియా మ్యాచ్‌కు వచ్చే సరికి పరిస్థితి మారిపోయింది.
టీమిండియా బౌలింగ్‌లో మాత్రం
పాక్‌తో మ్యాచ్‌లో సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమైన కుశాల్, ఆసిఫ్.. భారత పేసర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. ఇందుకు తోడు టీమిండియా ఫీల్డర్ల వైఫల్యం వారికి కలిసి వస్తోంది.
ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిన కుశాల్
శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లి సహా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ మూడు గోల్డెన్ క్యాచ్‌లు డ్రాప్ చేశారు. ఆసిఫ్, కుశాల్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌లను వదిలేశారు. నేపాల్ ఇన్నింగ్స్ మొదటి, రెండో, ఐదో ఓవర్లో ఈ తప్పిదాలు చేశారు.
ఈ క్రమంలో లైఫ్ పొందిన కుశాల్ 3 ఫోర్లు, రెండు సిక్సర్లతో చెలరేగాడు. అయితే, పదో ఓవర్‌లో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో కుశాల్ ఇచ్చిన క్యాచ్‌ను పట్టడంలో ఇషాన్ కిషన్ సఫలమయ్యాడు.
ఎట్టకేలకు.. శార్దూల్‌కు తొలి వికెట్
దీంతో ఎట్టకేలకు టీమిండియాకు తొలి వికెట్ దక్కింది. పదో ఓవర్ ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి నేపాల్ 65 పరుగుల మెరుగైన స్కోరు చేసింది. మరోవైపు.. 10 ఓవర్లు ముగిసే సరికి ఆసిఫ్ 4 ఫోర్ల సాయంతో 23 పరుగులు చేసి.. భీమ్ షర్కీతో కలిసి క్రీజులో ఉన్నాడు. కాగా నేపాల్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా సారథి రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్న విషయం విదితమే!
చదవండి: టాస్ గెలిచిన టీమిండియా.. తుది జట్లు ఇవే.. షమీకి చోటు
3 Dropped Catches 😱 #IndvsNep pic.twitter.com/LQOnqv3yEN
— Susanta Sahoo (@ugosus) September 4, 2023
Indian Fielders today 😭#IndvsNeppic.twitter.com/nQEWm5Ybp1
— 🏆 𝕏 3 (@thegoat_msd_) September 4, 2023
Comments
Please login to add a commentAdd a comment