
ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కుమారుడు ఆడిన ఓ షాట్‌కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఫిదా అయ్యాడు. స్మాష్ గేమింగ్ సెంటర్‌లో బౌలింగ్ మిషన్ సాయంతో జూనియర్ కైఫ్ ఆడిన కవర్స్ షాట్ వీడియోను మాస్టర్ ట్వీట్ చేశాడు. ‘కవర్స్‌లో జూనియర్ కైఫ్ అద్భుతంగా ఆడాడు. వెల్‌డన్ ఎప్పుడూ.. ఇలానే ఆడుతూ ఉండూ..’ అని ఈ బుడ్డోడిని ప్రశంసించాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. 87వేలకు పైగా వ్యూస్ రాగా వెయ్యికి పైగా రీట్వీట్ చేశారు.
కైఫ్ సారథ్యంలో భారత్ 2000ల్లో అండర్-19 యూత్ ప్రపంచకప్ గెలిచింది. 2002 నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో కైఫ్ అద్భుతంగా రాణించాడు. తనదైన ఫీల్డింగ్ మార్క్‌తో భారత అభిమానులకు గుర్తుండిపోయాడు. 37 ఏళ్ల కైఫ్ ఇప్పటి వరకు అధికారికంగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించలేదు. తన చివరి వన్డేను దక్షిణాఫ్రికాతో 2006లో ఆడాడు. రంజీ ట్రోఫీలో చత్తీస్‌ఘడ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment