టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ ఐపీఎల్‌లో తన ఆల్ టైమ్ ప్లెయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు. ఈ జట్టుకు మహేంద్ర సింగ్ ధోనిని కెప్టెన్‌గా కైఫ్ ఎంచుకున్నాడు. ఈ జట్టులో ఆరుగురు విదేశీ ఆటగాళ్లకు, ఐదుగురు భారత ఆటగాళ్లకు చోటు దక్కింది. జట్టుకు ఓపెనర్లుగా క్రిస్ గేల్, రోహిత్ శర్మలను ఎంచుకున్న కైఫ్.. వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లి, నాలుగు, ఐదు స్థానాల కోసం సురేష్ రైనా, ఏబీ డివిలియర్స్‌లను ఎంపిక చేశాడు.
ఆ తరువాత ఆరో స్థానం కోసం ధోనిని (వికెట్‌కీపర్) ఎంపిక చేసిన కైఫ్.. ఆల్‌రౌండర్ల కోటాలో ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్‌కు చోటు కల్పించాడు. ఇక బౌలర్ల విషయానికి వస్తే.. రషీద్ ఖాన్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రాలకు చోటు ఇచ్చాడు.
మహ్మద్ కైఫ్ ఐపీఎల్ ఆల్‌టైం ప్లేయింగ్ ఎలెవెన్: క్రిస్ గేల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సురేష్ రైనా, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోని (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రషీద్ ఖాన్, సునీల్ నరైన్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా
చదవండి: Kuldeep Yadav: నాకు పెద్దన్న లాంటివాడు.. పర్పుల్ క్యాప్ అతడిదే: కుల్దీప్
Comments
Please login to add a commentAdd a comment