మహ్మద్ కైఫ్-యువరాజ్ సింగ్(ఫైల్‌ఫొటో)
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్‌లో మెరుపులు తమతోనే అంతరించిపోయాయని అంటున్నాడు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్. గతంలో యువరాజ్ సింగ్‌తో పాటు తాను కూడా భారత ఫీల్డింగ్‌లో కంప్లీట్ ఫీల్డర్ల వలే ఉండేవాళ్లమని ఇప్పుడు అది జట్టులో లోపించిందన్నాడు. గత కొన్నేళ్లుగా భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్‌లో మెరుగుపడినా పూర్తిస్థాయిలో కాలేదన్నాడు. తనతో పాటు యువీ ఆడిన కాలంలో భారత్ ఫీల్డింగ్ అమోఘంగా ఉండేదన్నాడు. ‘ ప్రస్తుతం భారత క్రికెట్ ఫీల్డింగ్ బాలేదని అనడం లేదు. పూర్తిస్థాయి ఫీల్డర్డు లేరని మాత్రమే అంటున్నాను. ఫీల్డింగ్‌లో కంప్లీట్ ప్యాకేజ్ అంటే వికెట్లను నేరుగా గిరాటేయడం కానీ, బంతితో పాటు వేగంగా పరుగెత్తి దాన్ని అందిపుచ్చుకోవడం కానీ, స్లిప్ ఫీల్డింగ్, ఫైన్‌లెగ్ ఫీల్డింగ్, లాంగాన్‌లో ఫీల్డింగ్ ఇలా ఎక్కడైనా ఫీల్డింగ్ చేస్తూ ఆకట్టుకోవడమే కంప్లీట్ ఫీల్డింగ్ ప్యాకేజ్. (ఆసీస్‌కు నంబర్‌వన్ ర్యాంక్ ఎలా ఇచ్చారు?)
ఒక బ్యాట్స్‌మన్ కట్ షాట్, హుక్ షాట్, పుల్‌షాట్, బౌన్సర్‌కు ఆడటం, ఇన్‌స్వింగ్ డెలివరిని సమర్ధవంతంగా ఎదుర్కొంటే వారిని గ్రేట్ బ్యాట్స్‌మన్ అంటాం. అలానే ఫీల్డింగ్‌లో కూడా అన్ని రకాల నైపుణ్యం ఉంటేనే సదరు ఆటగాడు కంప్లీట్ ఫీల్డర్ అవుతాడు. అది ఇప్పుడు లేదనే విషయం కనబడుతోంది. నాతోపాటు యువరాజ్ బెస్ట్ ఫీల్డర్లుగా పిలవబడే వాళ్లం. మా ఫీల్డింగే మమ్మల్ని ఒక స్థాయిలో నిలబెట్టింది. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో చాలా మంది మంచి ఫీల్డర్లను చూస్తున్నాం. మనవాళ్లు ఫీల్డింగ్‌లో మెరగయ్యారు. కానీ పూర్తిస్థాయి ఫీల్డింగ్ అనేది మాత్రం లోపించింది’ అని కైఫ్ పేర్కొన్నాడు. కాగా, మీరు, యువరాజ్ కాకుండా కంప్లీట్ ఫీల్డర్ ఇంకా ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్నకు దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అని సమాధానమిచ్చాడు కైఫ్. ‘ ఏబీ డివిలియర్స్ పూర్తిస్థాయి ఫీల్డర్. అందులో ఎటువంటి సందేహం లేదు. అతనొక బుల్లెట్. దక్షిణాఫ్రికా తరఫున అద్భుతమైన క్యాచ్‌లను ఏబీ అందుకున్నాడు. ఇక ఐపీఎల్‌లో కూడా ఏబీ మెరుపులు చూశాం. నేను అతనితో కలిసి ఆర్సీబీకి ఆడాను. అతని ఫీల్డింగ్‌లో ట్రైనింగ్ అనేది అత్యున్నత స్థాయిలో ఉంటుంది’ అని కైఫ్ పేర్కొన్నాడు.(కోహ్లితో నా వైరం ఇప్పటిది కాదు!)
Comments
Please login to add a commentAdd a comment