
ట్రంప్ విజయం.. అయోమయం
అమెరికా అధ్యక్షునిగా డోనాల్డ్ ట్రంప్ అనూహ్య విజయం కీలక మలుపు. రిపబ్లికన్ అభ్యర్థిగా తన ప్రచార శైలిలో, ఆచరణ, నడ వడిల్లో దుందుడుకు స్వభావాన్నే చూపించారు.
అమెరికా అధ్యక్షునిగా డోనాల్డ్ ట్రంప్ అనూహ్య విజయం కీలక మలుపు. రిపబ్లికన్ అభ్యర్థిగా తన ప్రచార శైలిలో, ఆచరణ, నడ వడిల్లో దుందుడుకు స్వభావాన్నే చూపించారు. మైనారిటీలు, మహిళలు, ఇతర దేశాల ఉద్యోగుల పట్ల చిన్నచూపునే ప్రదర్శించారు. అందుకే ఆయన గెలుపుపై సందేహాలేర్పడ్డాయి కానీ, అమెరికా పౌరుల్లోని అసంతృప్తిని ‘సొమ్ము’ చేసుకోవ డంలో, వారి భయాల్ని, అభద్రతను ఓట్లుగా మార్చుకోవ డంలో సఫలమయ్యారు. అరుుతే ఇకపై ప్రపంచదేశాలతో ఎలా నడుచుకొంటారన్నదే సందేహం.
అమెరికా అధ్యక్ష స్థానంలో ఎవరున్నా ఆ దేశపు స్వప్రయోజనాలే వారికి ముఖ్యం. లాభం లేనిదే వారు కన్నెత్తి చూడరు. కనుక మన దేశం సొంత బలం పెంచుకోవడంపైనే దృష్టిపెట్టాలి తప్ప స్నేహ బంధంపై కాదు. ఆయన తీవ్రవాదంపై నిష్పాక్షిక యుద్ధానికి కట్టుబడి, చైనా దిగుమతులకు ప్రతికూలంగా ఉంటే మనకు వ్యాపారపరంగా కొంత సానుకూలత ఉంటుందేమోగానీ అంత ర్జాతీయ వ్యాపార సూత్రాలకు భంగం కలుగుతుంది. ప్రస్తుతా నికి ప్రపంచదేశాలది అంతా ఉహాగానమే.. అయోమయమే..- డాక్టర్ డీవీజీ శంకరరావు, మాజీ ఎంపీ, పార్వతీపురం