బీజేపీపై దీపాంకర్ భట్టాచార్య ధ్వజం
హైదరాబాద్: ఆర్‌ఎస్‌ఎస్ అండతో మైనార్టీలు, దళితులపై బీజేపీ దాడులు, హత్యలు చేస్తోందని, దీనిని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య అన్నారు. అదివారం ఇక్కడ విలేకరుతో మాట్లాడుతూ రైతు సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకున్నవారి పాలనలో సైతం రైతు ఆత్మహత్యలు ఆగడంలేదని విచారం వ్యక్తం చేశారు.
పాలకులు కార్పొరేటు శక్తులకు, కంపెనీలకు రుణ సౌకర్యాలు అందిస్తూ, దేశానికి అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెడుతున్నారని విమర్శించారు. పెద్దనోట్ల రద్దు పేరుతో బడా వ్యాపారులకు నష్టం జరగకుండా సామాన్యులపై సర్జికల్ దాడులు చేసిందని అన్నారు. జేఎన్‌టీయూ విద్యార్థి నజీబ్, సెంట్రల్ యూనివర్శీటీ విద్యార్థి రోహిత్.వేముల ఘటనల్లో బాధితులకు న్యాయం జరగాలని ఉద్యమిస్తామన్నారు.