సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ గణాంకాల ప్రాతిపదికన కాకుండా రాష్ష్ర్టాల వారీగా జనాభా ఆధారంగా మైనారిటీ వర్గాలను నిర్ణయించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్ధానం మంగళవారం తోసిపుచ్చింది. సామాజిక ప్రయోజనాలను పొందేందుకు 8 రాష్ష్ర్టాల్లో హిందువులను మైనారిటీలుగా పరిగణించాలని ఈ పిటిషన్ కోరింది. పలానా రాష్ష్ర్టంలో ఏ వర్గాన్ని మైనారిటీలుగా పరిగణించాలనే విషయంలో ఎలాంటి మార్గదర్శకాలు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బీజేపీ నేత, అడ్వకేట్ అశ్వని ఉపాథ్యాయ్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌కు అటార్నీ జనరల్ మద్దతు పలకలేదు.
కాగా, రాష్ష్ర్ట జనాభాకు అనుగుణంగా మైనారిటీ వర్గాన్ని గుర్తించాలని దాఖలైన ఈ పిటిషన్‌కు సంబంధించి సహకరించాలని జులైలో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను సుప్రీం కోర్టు కోరింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ అటార్నీ జనరల్ కార్యాలయానికి పిటిషన్ కాపీని అందించాలని పిటిషనర్, బీజేపీ నేతను కోరుతూ విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బుద్ధులు, పార్సీలను మైనారిటీలుగా పరిగణిస్తూ 26 ఏళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ చట్టబద్ధతను ఈ పిటిషన్ సవాల్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment