petition rejected
-
తహవూర్ రాణాకు బిగ్ షాక్
వాషింగ్టన్: 26/11 ముంబై ఉగ్రవాద దాడుల కీలక సూత్రధారి తహవూర్ రాణా(Tahawwur Rana)కు బిగ్ షాక్ తగిలింది. తనను భారత్‌కు అప్పగించవద్దంటూ వేసిన పిటిషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది.ముంబై దాడుల కేసులో తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు(Extradition) అమెరికా ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే చికిత్సపై హామీకి భారత ప్రభుత్వం నిరాకరించింది. దీంతో.. ఈ కారణాన్ని చూపిస్తూ భారత్‌కు తన అప్పగింతను నిలిపివేయాలంటూ అమెరికా సుప్రీం కోర్టు(US Supreme Court)లో తహవూర్ పిటిషన్ వేశాడు. ‘‘ప్రాణాంతక జబ్బులతో పోరాడుతున్న నన్ను భారత్‌కు అప్పగించడమంటే మరణశిక్ష విధించడమే. నా అప్పగింత అమెరికా చట్టాలతో పాటు ఐరాస తీర్పుల ఉల్లంఘనే. కనుక అప్పగింతపై స్టే విధించండి’’ అని తహవూర్ పిటిషన్ పేర్కొన్నాడు. పాక్ సంతతికి చెందిన ముస్లిం వ్యక్తిని కావడంతో తనను కచ్చితంగా హింసిస్తారని, భారత్‌కు అప్పగిస్తే తాను బతికే అవకాశమే లేదని వాదించాడతను. అయితే తహవూర్ రాణా వాదనలను కోర్టు తోసిపుచ్చింది. అతని పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో త్వరలోనే తహవూర్‌ను అమెరికా భారత్‌కు అప్పగించే ఛాన్స్ కనిపిస్తోంది. ఎవరీ తహవూర్ రాణా..?పాక్ సంతతికి చెందిన కెనడా జాతీయుడైన తహవూర్ రాణా.. ప్రస్తుతం లాస్ఏంజెలెస్లోని మెట్రోపాలిటన్ జైల్లో ఉన్నాడు. 2009లో FBI అతన్ని అరెస్టు చేసింది. పాక్–అమెరికా ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీతో అతనికి దగ్గరి సంబంధాలున్నాయి. రాణాను భారతదేశానికి అప్పగించడానికి అమెరికా సుప్రీంకోర్టు జనవరి 25, 2024న ఆమోదం తెలిపింది. ఈ కేసులో రాణా తనను తప్పుగా దోషిగా ప్రకటించారని చెప్పి రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. కానీ కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది.భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి అమెరికా పర్యటనలో.. తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించే అంశంపై అధ్యక్షుడు ట్రంప్ స్వయం ప్రకటన చేశారు. ఇందుకుగానూ ట్రంప్‌కి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. దీంతో రాణా భారతదేశానికి వచ్చి న్యాయ విచారణ ఎదుర్కోవడం దాదాపు ఖాయమని భావించారంతా. -
బాబు లీగల్ ములాఖత్ పెంపు పిటిషన్ తిరస్కరించిన ఏసీబీ కోర్టు
-
చంద్రబాబుకు ఏసీబీ కోర్టు మరో భారీ షాక్
-
హౌస్ రిమాండ్ పిటిషన్ తిరస్కరించిన ఏసీబీ కోర్టు
-
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర యువజన వ్యవహారాలు & రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ.శ్రీనివాస్‌గౌడ్‌కు మంగళవారం హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టేయాలంటూ ఆయన కోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. ఎన్నికల అఫిడవిట్లో శ్రీనివాస్‌గౌడ్ తప్పుడు ధ్రుృవపత్రాలు సమర్పించారని, శ్రీనివాసగౌడ్ ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు అనే వ్యక్తి పిటిషన్ వేశాడు. అయితే దీనిని కొట్టేయాలంటూ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. రాఘవేంద్రరాజు పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు, శ్రీనివాస్‌గౌడ్ దాఖలు చేసిన పిటిషన్‌ను మాత్రం కొట్టేసింది. ఇదిలా ఉంటే.. ఖమ్మం కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు తాజాగా అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: అప్పు చేయనిదే నడవని దుస్థితి తెలంగాణది! -
మైనారిటీల గుర్తింపుపై పిల్‌ను తోసిపుచ్చిన సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ గణాంకాల ప్రాతిపదికన కాకుండా రాష్ష్ర్టాల వారీగా జనాభా ఆధారంగా మైనారిటీ వర్గాలను నిర్ణయించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్ధానం మంగళవారం తోసిపుచ్చింది. సామాజిక ప్రయోజనాలను పొందేందుకు 8 రాష్ష్ర్టాల్లో హిందువులను మైనారిటీలుగా పరిగణించాలని ఈ పిటిషన్ కోరింది. పలానా రాష్ష్ర్టంలో ఏ వర్గాన్ని మైనారిటీలుగా పరిగణించాలనే విషయంలో ఎలాంటి మార్గదర్శకాలు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బీజేపీ నేత, అడ్వకేట్ అశ్వని ఉపాథ్యాయ్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌కు అటార్నీ జనరల్ మద్దతు పలకలేదు. కాగా, రాష్ష్ర్ట జనాభాకు అనుగుణంగా మైనారిటీ వర్గాన్ని గుర్తించాలని దాఖలైన ఈ పిటిషన్‌కు సంబంధించి సహకరించాలని జులైలో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను సుప్రీం కోర్టు కోరింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ అటార్నీ జనరల్ కార్యాలయానికి పిటిషన్ కాపీని అందించాలని పిటిషనర్, బీజేపీ నేతను కోరుతూ విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బుద్ధులు, పార్సీలను మైనారిటీలుగా పరిగణిస్తూ 26 ఏళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ చట్టబద్ధతను ఈ పిటిషన్ సవాల్ చేసింది. -
సుప్రీంకోర్టులో మాయావతికి చుక్కెదురు
-
ఈవీఎంలపై పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం..
సాక్షి, న్యూఢిల్లీ : ఈవీఎంల స్ధానంలో తిరిగి బ్యాలెట్ పేపర్లను ఉపయోగించే విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్న రాజకీయ పార్టీలకు ఎదురుదెబ్బ తగిలింది. సాంకేతిక లోపాలు, ట్యాంపరింగ్‌కు అవకాశాలున్న క్రమంలో ఈవీఎంల వాడకాన్ని ఆయా రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈవీఎంల వాడకాన్ని నిలిపివేసి, తిరిగి బ్యాలెట్ విధానాన్ని అమలుపరచాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్ధానం గురువారం కొట్టివేసింది. ప్రతి యంత్రాన్ని సద్వినియోగం చేయవచ్చని, అలాగే దుర్వినియోగం కూడా చేయవచ్చని పిటిషనర్‌తో పేర్కొంది. గతంలోనే బ్యాలెట్ పత్రాలను మళ్లి ప్రవేశపెట్టాలన్న పిటిషన్లను కోర్టు కొట్టివేసిందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈవీఎంలపై అనుమానాలున్నాయని, ఓటర్లలో విశ్వాసం కలిగించాలని కోరిన పిటిషనర్ వాదనలతో సుప్రీం కోర్టు ఏకీభవించలేదు. కాగా ఈవీఎంల వాడకాన్ని వ్యతిరేకిస్తూ న్యాయభూమి అనే ఎన్జీవో ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. -
అనుమతి ఇవ్వం
► సుప్రీంకోర్టు స్పష్టీకరణ ► పునస్సమీక్ష పిటిషన్ తిరస్కృతి ► ఇక కేంద్రం కోర్టులో జల్లికట్టు ► చట్టం తీసుకొచ్చేనా? సాక్షి, చెన్నై : జల్లికట్టుకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పునస్సమీక్ష పిటిషన్‌ను తిరస్కరించింది. సుప్రీంకోర్టులో వ్యవహారం తేలిన దృష్ట్యా, ఇక, బంతి కేంద్రం కోర్టులో పడ్డట్టే. అరుుతే, సుప్రీంకోర్టు కూడా అడ్డు తగలని రీతిలో చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చేనా అన్న ఎదురుచూపులు పెరిగారుు. తమిళనాట సాహసక్రీడగా జల్లికట్టును పరిగణిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. పారంపర్యంగా కొనసాగుతూ వస్తున్న ఈ జల్లికట్టుకు జంతు ప్రేమికుల రూపంలో అడ్డంకులు వచ్చారుు. ఎద్దులను హింసించి, రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారంటూ జంతు ప్రేమికులు చేసిన వాదనను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, ఆ క్రీడను నిషేధించింది. 2014 నుంచి సంక్రాంతి పర్వదినం వేళ జల్లికట్టుకు దూరంగా రాష్ట్రం ఉంటూ వస్తోంది. ప్రతి ఏటా ఆశలు చిగురిస్తున్నా, చివరకు నిరాశే. తీర్పును పునస్సమీక్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రరుుంచి రెండేళ్లు అవుతోంది. ఈ పిటిషన్ తుది విచారణ బుధవారం సుప్రీంకోర్టులో సాగింది. వాదనల అనంతరం జల్లికట్టును అనుమతించే ప్రసక్తే లేదని న్యాయమూర్తులు తేల్చడం తమిళులకు షాక్కే. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలతో ఏకీభవించని న్యాయమూర్తులు, అస్సలు ఆ క్రీడ ఏ మతానికి చెందినది కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. తీర్పును పునస్సమీక్షించేందుకు తగ్గట్టుగా అర్హతలు ఈ పిటిషన్లో లేదు అని పేర్కొంటూ, తిరస్కరించడంతో జల్లికట్టు కోసం ఎదురుచూస్తూ వచ్చిన వారికి నిరాశే. ఊహించినదే : జల్లికట్టుకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వదన్న విషయాన్ని ముందు ఊహించిన విషయమేనని ఆ క్రీడల నిర్వాహక కమిటీ ప్రతినిధి అంబలకరసు వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జల్లికట్టుకు అనుమతి ఇవ్వకూడదు నిర్ణయంతో ఆది నుంచి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎప్పుడో జారీ చేసిన పాత జీవోను అడ్డం పెట్టుకుని పీటా సంస్థకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా నమ్మకం సన్నగిల్లుతున్నదని, ఇక, తాడో పేడోతేల్చుకునే విధంగా పోరాటాలకు సిద్ధం అవుతామని హెచ్చరించారు. ఇక, సాహస క్రీడ సమాఖ్య ప్రతినిధి రాజేష్ పేర్కొంటూ, ఐదు వందల పేజీ కూడిన పునస్సమీక్ష పిటిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసి ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఆ పిటిషన్‌ను గంటన్నర సమయంలో పరిశీలించి, విచారణను తిరస్కరించబడడం విచారకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, కేంద్రం దిక్కు అని, అరుుతే, వారు రెండు నాలుకల ధోరణి అనుసరిస్తుండడం బట్టి చూస్తే, స్పందిసా ్తరా అన్న అనుమానాలు నెలకొంటున్నదని పేర్కొన్నారు. డీఎంకే అధికార ప్రతిని ది, ఎంపీ టీకేఎస్ ఇలంగోవన్ మాట్లాడుతూ అన్నాడీఎంకే సర్కారు సుప్రీంకోర్టులో సరైన వాదనల్ని వినిపించని దృ ష్ట్యా, పిటిషన్ తిరస్కరణకు గురైనట్టుంద ని విమర్శించారు. అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి పేర్కొంటూ, పిటిషన్ తిరస్కరణకు గురి కావడం విచారకరంగా వ్యాఖ్యానించారు. అరుుతే, నిం దల్ని తమ మీద నెట్టడం లక్ష్యంగా డీఎంకే వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశా రు. డీఎంకే - కాంగ్రెస్‌ల బంధంతో కేంద్రంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ నిషేధానికి తగ్గ ఉత్తర్వులు జారీ చేయబడ్డ విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. కేంద్రం కోర్టులోకి బంతి : రాష్ట్రానికి చెందిన బీజేపీ పెద్దలు గానీయండి, ఢిల్లీ నుంచి వచ్చే కేంద్ర మంత్రులు గానీయం డి, ఈ సారి జల్లికట్టు గార్యంటీ అని తమిళులకు భరోసా ఇస్తూ వస్తున్నారు. అరుుతే, అందుకు తగ్గ చట్టం తీసుకురావడంలో వెనుకడుగు వేస్తున్నారని చెప్పవచ్చు. సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పు మేరకు తదుపరి అడుగులు వేద్దామన్నట్టుగా, తాజాగా ప్రారంభమైన శీతాకాల సమావేశాల దృష్టికి జల్లికట్టు ప్రస్తావనను కూడా తీసుకురాలేదు. ఈ సమయంలో సుప్రీం కోర్టు స్పష్టం వ్యక్తం చేసిన దృష్ట్యా, ఇకనైనా జల్లికట్టు కోసం ప్రత్యేక చట్టాన్ని కేంద్ర పాలకులు తీసుకొస్తారా అన్న ప్రశ్న బయలు దేరింది. బంతి కేంద్రం కోర్టులో పడి ఉన్న దృష్ట్యా, రాష్ట్రంలోని బీజేపీ వర్గాలపై ఒత్తిడికి జల్లికట్టు ప్రేమికులు, తమిళాభిమానులు సిద్ధం అవుతున్నారు. సు ప్రీం కోర్టు అడ్డు తగిలేందుకు వీలు కూడా లేని రీతిలో చట్టాన్ని తీసుకొచ్చేనా, ఈ ఏడాది జల్లికట్టును సంక్రాంతి కానుకగా తమిళులకు సమర్పించేనా అన్న ఎదురు చూపు లు పెరిగారుు. ఇందుకు తగ్గట్టుగానే బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా, రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ స్పందించారు. తమ పార్టీ పెద్దల ద్వారా కేంద్రప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని, తమ పార్టీ సి ద్ధాంత మేరకు జల్లికట్టు కోసం ప్రత్యేక చ ట్టం విషయంగా ఒత్తిడి తీసుకొస్తామని వ్యాఖ్యానించారు. అరుుతే, ఈ హామీలు అచరణలో పెట్టేనా లేదా, గత ఏడాది వలే నిరాశే మిగిలేనా అన్నది వేచి చూడాల్సిందే.