అనుమతి ఇవ్వం | SC dismisses TN plea to review Jallikattu ban | Sakshi
Sakshi News home page

అనుమతి ఇవ్వం

Published Thu, Nov 17 2016 4:00 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

అనుమతి ఇవ్వం - Sakshi

అనుమతి ఇవ్వం

►  సుప్రీంకోర్టు స్పష్టీకరణ
పునస్సమీక్ష పిటిషన్ తిరస్కృతి
ఇక కేంద్రం కోర్టులో జల్లికట్టు
చట్టం తీసుకొచ్చేనా?

 
 సాక్షి, చెన్నై : జల్లికట్టుకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పునస్సమీక్ష పిటిషన్‌ను తిరస్కరించింది. సుప్రీంకోర్టులో వ్యవహారం తేలిన దృష్ట్యా, ఇక, బంతి కేంద్రం కోర్టులో పడ్డట్టే. అరుుతే, సుప్రీంకోర్టు కూడా అడ్డు తగలని రీతిలో చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చేనా అన్న ఎదురుచూపులు పెరిగారుు.  తమిళనాట సాహసక్రీడగా జల్లికట్టును పరిగణిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. పారంపర్యంగా కొనసాగుతూ వస్తున్న ఈ జల్లికట్టుకు జంతు ప్రేమికుల రూపంలో అడ్డంకులు వచ్చారుు. ఎద్దులను హింసించి, రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారంటూ జంతు ప్రేమికులు చేసిన వాదనను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, ఆ క్రీడను నిషేధించింది. 2014 నుంచి సంక్రాంతి పర్వదినం వేళ జల్లికట్టుకు దూరంగా రాష్ట్రం ఉంటూ వస్తోంది. ప్రతి ఏటా ఆశలు చిగురిస్తున్నా, చివరకు నిరాశే. తీర్పును పునస్సమీక్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రరుుంచి రెండేళ్లు అవుతోంది.

ఈ పిటిషన్ తుది విచారణ బుధవారం సుప్రీంకోర్టులో సాగింది. వాదనల అనంతరం జల్లికట్టును అనుమతించే ప్రసక్తే లేదని న్యాయమూర్తులు తేల్చడం తమిళులకు షాక్కే. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలతో ఏకీభవించని న్యాయమూర్తులు, అస్సలు ఆ క్రీడ ఏ మతానికి చెందినది కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. తీర్పును పునస్సమీక్షించేందుకు తగ్గట్టుగా అర్హతలు ఈ పిటిషన్‌లో లేదు అని పేర్కొంటూ, తిరస్కరించడంతో జల్లికట్టు కోసం ఎదురుచూస్తూ వచ్చిన వారికి నిరాశే.

ఊహించినదే : జల్లికట్టుకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వదన్న విషయాన్ని ముందు ఊహించిన విషయమేనని ఆ క్రీడల నిర్వాహక కమిటీ ప్రతినిధి అంబలకరసు వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జల్లికట్టుకు అనుమతి ఇవ్వకూడదు నిర్ణయంతో ఆది నుంచి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎప్పుడో జారీ చేసిన పాత జీవోను అడ్డం పెట్టుకుని పీటా సంస్థకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా నమ్మకం సన్నగిల్లుతున్నదని, ఇక, తాడో పేడోతేల్చుకునే విధంగా పోరాటాలకు సిద్ధం అవుతామని హెచ్చరించారు. ఇక, సాహస క్రీడ సమాఖ్య ప్రతినిధి రాజేష్ పేర్కొంటూ, ఐదు వందల పేజీ కూడిన పునస్సమీక్ష పిటిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసి ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఆ పిటిషన్‌ను గంటన్నర సమయంలో పరిశీలించి, విచారణను తిరస్కరించబడడం విచారకరం అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక, కేంద్రం దిక్కు అని, అరుుతే, వారు రెండు నాలుకల ధోరణి అనుసరిస్తుండడం బట్టి చూస్తే, స్పందిసా ్తరా అన్న అనుమానాలు నెలకొంటున్నదని పేర్కొన్నారు. డీఎంకే అధికార ప్రతిని ది, ఎంపీ టీకేఎస్ ఇలంగోవన్ మాట్లాడుతూ అన్నాడీఎంకే సర్కారు సుప్రీంకోర్టులో సరైన వాదనల్ని వినిపించని దృ ష్ట్యా, పిటిషన్ తిరస్కరణకు గురైనట్టుంద ని విమర్శించారు. అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి పేర్కొంటూ, పిటిషన్ తిరస్కరణకు గురి కావడం విచారకరంగా వ్యాఖ్యానించారు. అరుుతే, నిం దల్ని తమ మీద నెట్టడం లక్ష్యంగా డీఎంకే వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశా రు. డీఎంకే - కాంగ్రెస్‌ల బంధంతో కేంద్రంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ నిషేధానికి తగ్గ ఉత్తర్వులు జారీ చేయబడ్డ విషయాన్ని  గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
 కేంద్రం కోర్టులోకి బంతి : రాష్ట్రానికి చెందిన బీజేపీ పెద్దలు గానీయండి, ఢిల్లీ నుంచి వచ్చే కేంద్ర మంత్రులు గానీయం డి, ఈ సారి జల్లికట్టు గార్యంటీ అని తమిళులకు భరోసా ఇస్తూ వస్తున్నారు.

అరుుతే, అందుకు తగ్గ చట్టం తీసుకురావడంలో వెనుకడుగు వేస్తున్నారని చెప్పవచ్చు. సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పు మేరకు తదుపరి అడుగులు వేద్దామన్నట్టుగా, తాజాగా ప్రారంభమైన శీతాకాల సమావేశాల దృష్టికి జల్లికట్టు ప్రస్తావనను కూడా తీసుకురాలేదు. ఈ సమయంలో సుప్రీం కోర్టు స్పష్టం వ్యక్తం చేసిన దృష్ట్యా, ఇకనైనా జల్లికట్టు కోసం ప్రత్యేక చట్టాన్ని కేంద్ర పాలకులు తీసుకొస్తారా అన్న ప్రశ్న బయలు దేరింది.

బంతి కేంద్రం కోర్టులో పడి ఉన్న దృష్ట్యా, రాష్ట్రంలోని బీజేపీ వర్గాలపై ఒత్తిడికి జల్లికట్టు ప్రేమికులు, తమిళాభిమానులు సిద్ధం అవుతున్నారు. సు ప్రీం కోర్టు అడ్డు తగిలేందుకు వీలు కూడా లేని రీతిలో చట్టాన్ని తీసుకొచ్చేనా, ఈ ఏడాది జల్లికట్టును సంక్రాంతి కానుకగా తమిళులకు సమర్పించేనా అన్న  ఎదురు చూపు లు పెరిగారుు. ఇందుకు తగ్గట్టుగానే బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా, రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ స్పందించారు. తమ పార్టీ పెద్దల ద్వారా కేంద్రప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని, తమ పార్టీ సి ద్ధాంత మేరకు జల్లికట్టు కోసం ప్రత్యేక చ ట్టం విషయంగా ఒత్తిడి తీసుకొస్తామని వ్యాఖ్యానించారు. అరుుతే, ఈ హామీలు అచరణలో పెట్టేనా లేదా, గత ఏడాది వలే నిరాశే మిగిలేనా అన్నది వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement