సాక్షి, న్యూఢిల్లీ : ఈవీఎంల స్ధానంలో తిరిగి బ్యాలెట్ పేపర్లను ఉపయోగించే విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్న రాజకీయ పార్టీలకు ఎదురుదెబ్బ తగిలింది. సాంకేతిక లోపాలు, ట్యాంపరింగ్‌కు అవకాశాలున్న క్రమంలో ఈవీఎంల వాడకాన్ని ఆయా రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈవీఎంల వాడకాన్ని నిలిపివేసి, తిరిగి బ్యాలెట్ విధానాన్ని అమలుపరచాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్ధానం గురువారం కొట్టివేసింది.
ప్రతి యంత్రాన్ని సద్వినియోగం చేయవచ్చని, అలాగే దుర్వినియోగం కూడా చేయవచ్చని పిటిషనర్‌తో పేర్కొంది. గతంలోనే బ్యాలెట్ పత్రాలను మళ్లి ప్రవేశపెట్టాలన్న పిటిషన్‌లను కోర్టు కొట్టివేసిందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈవీఎంలపై అనుమానాలున్నాయని, ఓటర్లలో విశ్వాసం కలిగించాలని కోరిన పిటిషనర్ వాదనలతో సుప్రీం కోర్టు ఏకీభవించలేదు. కాగా ఈవీఎంల వాడకాన్ని వ్యతిరేకిస్తూ న్యాయభూమి అనే ఎన్జీవో ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment