
సూర్యాపేట: రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమాన్ని ఆలోచించేది ఒక్క కేసీఆర్ మాత్రమేనని, వివిధ ప్రభుత్వాలు దేశంలో మైనార్టీలకు రూ.4,700 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే తెలంగాణ రాష్ట్రంలో రూ.2,400 కోట్ల బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీల సంక్షేమానికి కేటాయించారని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన ముస్లింల ఆత్మీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. కేసీఆర్ పాలనలోనే మైనార్టీలకు గౌరవం పెరిగిందన్నారు. 2004లో అప్పటి కాంగ్రెస్ పాలకులు ముస్లింల సంక్షేమానికి కేవలం రూ.80 లక్షలే కేటాయించారని తెలిపారు. శాంతిభద్రతల విషయంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో ఉందని పేర్కొన్నారు. కశ్మీర్ ప్రజలు కేసీఆర్‌లాంటి నాయకులను కోరుకుంటున్నారని చెప్పారు. ఈ సదస్సులో రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment