ముస్లింలకు ఏం చేశారని.. | Congress minority cell chairman Md tajuddin slams cm kcr | Sakshi
Sakshi News home page

ముస్లింలకు ఏం చేశారని..

Jul 16 2016 6:31 PM | Updated on Mar 18 2019 8:57 PM

ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, పాత షాదీఖానాకు రీమోడలింగ్ కోసం రూ .2 కోట్లు ...

మామిళ్లగూడెం: ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, పాత షాదీఖానాకు రీమోడలింగ్ కోసం రూ .2 కోట్లు ,నూతనంగా మరో షాదీఖానా నిర్మాణం కోసం స్థలంతో  పాటు మరో రూ.2 కోట్లు నిధులు మంజూరు చేస్తానని ముస్లింలకు వాగ్దానంచేసి మరిచిపోయిన సీఎం  ఏం చేశారని ఖమ్మం వస్తున్నారని  కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా చైర్మన్ ఎండి.తాజుద్దిన్  ప్రశ్నించారు. శుక్రవారం  జరిగిన సమావేశంలో  ఆయన మాట్లాడుతూ  నగరంలో 48 వేలకు పైగా ఉన్న ముస్లింలను ఆకర్షించేందుకే ఎన్నికల జిమ్మిక్కుకు పాల్పడ్డారని విమర్శించారు. కార్పొరేషన్ ఎన్నికలు జరిగి నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ ఇచ్చిన హామీ ఊసేలేదన్నారు.‘ఏరుదాటేదాకా ఓడమల్లయ్య,-ఏరుదాటిన తరువాత బోడమల్లయ్య’ అన్న చందంగా సీఎం పరిస్థితి ఉందన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement