ముస్లింలకు ఏం చేశారని..
మామిళ్లగూడెం: ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, పాత షాదీఖానాకు రీమోడలింగ్ కోసం రూ .2 కోట్లు ,నూతనంగా మరో షాదీఖానా నిర్మాణం కోసం స్థలంతో పాటు మరో రూ.2 కోట్లు నిధులు మంజూరు చేస్తానని ముస్లింలకు వాగ్దానంచేసి మరిచిపోయిన సీఎం ఏం చేశారని ఖమ్మం వస్తున్నారని కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా చైర్మన్ ఎండి.తాజుద్దిన్ ప్రశ్నించారు. శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలో 48 వేలకు పైగా ఉన్న ముస్లింలను ఆకర్షించేందుకే ఎన్నికల జిమ్మిక్కుకు పాల్పడ్డారని విమర్శించారు. కార్పొరేషన్ ఎన్నికలు జరిగి నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ ఇచ్చిన హామీ ఊసేలేదన్నారు.‘ఏరుదాటేదాకా ఓడమల్లయ్య,-ఏరుదాటిన తరువాత బోడమల్లయ్య’ అన్న చందంగా సీఎం పరిస్థితి ఉందన్నారు.