
దళితులు, మైనార్టీలపై మోదీ కపట ప్రేమ: షబ్బీర్
సాక్షి, హైదరాబాద్: దళితులు, మైనార్టీలపై దాడులను ప్రోత్సహిస్తూనే మరోవైపు కపట ప్రేమ చూపిస్తున్నారంటూ ప్రధాని మోదీని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ విమర్శించారు. వేముల రోహిత్ ఆత్మహత్య, గో రక్షకుల చేతిలో హతమైన దళిత, మైనారిటీల గురించి ప్రస్తావించకుండా.. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకుండా కపట ప్రేమ చూపితే ఎలా అని ప్రశ్నించారు. గోదావరి నదీ జలాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే గజ్వేల్‌కు వచ్చాయని, రోశయ్య సీఎంగా ఉన్నప్పుడే సింగరేణిలో 1,200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంటుకు అనుమతులు వచ్చాయన్నారు. రామగుండంలోని 1,600 మెగావాట్ల పవర్‌ప్లాంటుకు యూపీఏ హయాంలోనే అనుమతులు వచ్చాయంటూ సంబంధిత ఆధారాలు చూపారు.