
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యాంగంలోని 370వ అధికరణం రద్దు సందర్భంగా కశ్మీర్ ప్రజలపై ఆంక్షలు విధించడాన్ని వ్యతిరేకిస్తూ తన పదవికి రాజీనామా చేసిన కన్నన్ గోపీనాథన్ ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రజా ఆందోళనలో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. దేశంలో ఓ మైనారిటీ వర్గాన్ని మినహాయించి పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్ నుంచి అక్రమంగా వచ్చిన హిందువులకు పౌరసత్వం కల్పించే చట్టం ముమ్మాటికి భారత రాజ్యాంగంలోకి లౌకికవాద స్ఫూర్తికి వ్యతిరేకమే కాకుండా ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు.
ఆ మూడు దేశాల నుంచి వచ్చిన హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులకు భారత పౌరసత్వం ఇవ్వదలుచుకుంటే పార్లమెంట్ నిర్ణయం ద్వారా ఇవ్వొచ్చని, అలా కాకుండా రాజ్యాంగ విరుద్ధంగా సీఏఏ చట్టం తీసుకురావడం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. కశ్మీర్ విషయంలో కూడా తాను 370వ ఆర్టికల్ రద్దును వ్యతిరేకించలేదని, ఆ సందర్భంగా ప్రజల హక్కులకు కాలరాసి, వారి కదలికలపై ఆంక్షలు విధించడాన్ని వ్యతిరేకించానని ఆయన మీడియాకు స్పష్టం చేశారు.
ఓ పక్క దేశంలో దుర్భర ఆర్థిక పరిస్థితులు కొనసాగుతుంటే పట్టించుకోకుండా, ప్రజలను విభజించే రాజకీయాలను కేంద్ర ప్రభుత్వం నెత్తినెత్తుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును రెండంకెల పైకి తీసుకెళతాననే హామీతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం నేడు జీడీపీ ఐదు శాతానికి, ఎస్‌బీఐ అంచనాల ప్రకారం 4.6 శాతానికి పడిపోయినా, సాధారణ ప్రగతి రేటు 42 ఏళ్ల కనిష్ట స్థాయి 7.5 శాతానికి పడిపోయినా ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తానన్న మోదీ ప్రభుత్వం హయాంలో నేడు నిరుద్యోగ సమస్య 49 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నా, మునుపెన్నడు లేని విధంగా ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 14.7 శాతానికి చేరుకున్నా పట్టించుకోక పోవడం దారణమని ఆయన వ్యాఖ్యానించారు. కన్నన్ గోపీనాథన్ దేశవ్యాప్తంగా సుడిగాలిలా తిరుగుతూ వివిధ కళాశాలలు, ప్రజా వేదికలపై ప్రసంగిస్తున్నారు.
చదవండి:
కాంగ్రెస్కు షాకిచ్చిన విపక్షాలు..!
Comments
Please login to add a commentAdd a comment