మైనార్టీల సంక్షేమానికి మహానేత వైఎస్ ఎంతగానో కృషి చేశారని, దాన్ని వైఎస్సార్ సీపీ చిత్తశుద్ధితో కొనసాగిస్తుందని ఆ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు లాయిక్ అలీ పేర్కొన్నారు.
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్ : మైనార్టీల సంక్షేమానికి మహానేత వైఎస్ ఎంతగానో కృషి చేశారని, దాన్ని వైఎస్సార్ సీపీ చిత్తశుద్ధితో కొనసాగిస్తుందని ఆ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు లాయిక్ అలీ పేర్కొన్నారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఈసీ శేఖర్‌గౌడ్ రూపొందించిన క్యాలెండర్‌ను ఆదివారం ఇబ్రహీంపట్నంలోని పార్టీ కార్యాలయంలో ఆయన ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా లాయిక్ అలీ మాట్లాడుతూ.. వైఎస్సార్ హయాంలో మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. వాటిని కొనసాగిస్తూ మైనార్టీలను మరింత అభివృద్ధి చేయాలన్నదే వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ధ్యేయమని అన్నారు.
తెలంగాణలో పార్టీ బలహీనపడిం దన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. గ్రామాల్లో క్యాడర్ పటిష్టంగా ఉందని, భవిష్యత్తులో మరింత బలపడతామన్నారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త శేఖర్‌గౌడ్ మాట్లాడుతూ.. మైనార్టీల సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తామని అన్నారు. పార్టీ బలోపేతం కోసం బూత్, గ్రామ స్థాయిలో కమిటీలను నియమిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ మైనార్టీ సెల్‌కు పలువురిని నియమించారు. పార్టీ మైనార్టీ సెల్ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా ఎండీ మునీర్, నగర పంచాయతీ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఎండీ నదీమ్, యువజన విభాగం పట్టణ అధ్యక్షుడిగా ఎండీ కరీం నియమితులయ్యారు. వీరికి లాయిక్ అలీ నియామకపత్రాలను అందజేశారు. సమావేశంలో పార్టీ నాయకులు సాయిబాబా, చిత్రం జంగయ్య, ముత్యాల శ్రీహరి, అచ్చన బాషా, బాలశివుడు, చెనమోని రాజు, శ్రీనివాస్‌రెడ్డి, శ్యామ్, జి.దర్శన్, బాల్‌రెడ్డి, వెంకటేశ్, ఎం.సంతోష్, సాయి, వజ్రమ్, ఖాలెద్, అజర్, ముస్తఫా, హసన్, ఉమర్ తదితరులు పాల్గొన్నారు.