హైదరాబాద్సిటీ బ్యూరో: ఎస్టీ, ఎస్సీ, బీసీల తరహాలో మైనార్టీలకు కూడా స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన పథకాల రుణాలపై గరిష్ట రాయితీ (సబ్సిడీ) 80 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కేవలం రూ.ఒక లక్షకే పరిమితమైన రుణ సదుపాయాన్ని రూ.10 లక్షల వరకు పెంచింది. రూ.లక్ష రుణంపై 50 శాతం వరకు గల రాయితీ ని 80 శాతానికి పెంచింది. అదేవిధంగా రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రుణంపై 70 శాతం, రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణంపై 60 శాతం (రూ.5 లక్షలు మించకుండా ) రాయితీని వర్తింపజేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు బుధవారం స్వయం ఉపాధి పథకాల నిబంధనల్లో చేర్పులు మార్పులు చేస్తూ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల తరహాలోనే మైనార్టీ కార్పొరేషన్‌కు కూడా నూతన రాయితీ విధానాన్ని ప్రభుత్వం వర్తింపజేసింది. గత కొన్నినెలలుగా ప్రభుత్వ పరిశీలన లో ఉన్న ఈ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర లభించింది.
మైనార్టీలకు భారీ సబ్సిడీపై రుణాలు!
Published Wed, Dec 30 2015 10:26 PM | Last Updated on Sun, Sep 3 2017 2:49 PM
Advertisement
Advertisement