సీఎం అధ్యక్షతన గిరిజన సలహామండలి ఏర్పాటు | CM presided over the establishment of Tribal Advisory Council | Sakshi
Sakshi News home page

సీఎం అధ్యక్షతన గిరిజన సలహామండలి ఏర్పాటు

Published Tue, Aug 19 2014 3:32 AM | Last Updated on Wed, Aug 15 2018 8:06 PM

సీఎం అధ్యక్షతన  గిరిజన సలహామండలి ఏర్పాటు - Sakshi

సీఎం అధ్యక్షతన గిరిజన సలహామండలి ఏర్పాటు

హైదరాబాద్:  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చైర్‌పర్సన్‌గా గిరిజనశాఖ ముఖ్యకార్యదర్శి, భారత ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీల డెరైక్టర్, డెరైక్టర్ టీసీఆర్/టీఐ సభ్యులుగా, ఏపీ గిరిజనసంక్షేమ కమిషనర్ సభ్య కార్యదర్శిగా తెలంగాణ రాష్ట్ర గిరిజన సలహా మండలి ఏర్పాటైంది. ఇందులో సభ్యులుగా ఎమ్మెల్యేలు అజ్మీరా రేఖ, కోవా లక్ష్మి, రాథోడ్ బాపూరావు, బానోత్ శంకర్‌నాయక్, అజ్మీరా చందులాల్, పాయం వెంకటేశ్వర్లు, కోరం కన్నయ్య, బానోత్ మదన్‌లాల్, సున్నం రాజయ్య, రవీంద్రకుమార్ రమావత్, డీఎస్ రెడ్యానాయక్, టి. వెంకటేశ్వర్లు నియమితులయ్యారు.

తెలంగాణ రాష్ట్ర గిరిజనసంక్షేమ కమిషనర్ ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఈ మండలి ఏర్పాటు, అధికారుల నియామకం, సమావేశాల నిర్వహణ, తదితర నిబంధనలకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడిగా జారీచేసింది. ఈ మండలిలో 20 మంది సభ్యులుగా ఉంటారు. వారిలో 15 మందికి తక్కువ కాకుండా తెలంగాణ ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉంటారు.  సభ్యుల పదవీకాలం మూడేళ్లపాటు ఉంటుంది. ఈ నిబంధనలను తెలంగాణ గిరిజనుల సలహా మండలి-2014 రూల్స్‌గా పిలుస్తారు. ఇందుకు సంబంధించిన రెండు ఉత్తర్వులను  సోమవారం  తెలంగాణ గిరిజనసంక్షేమ ముఖ్యకార్యదర్శి డాక్టర్. టి.రాధ విడుదలచేశారు.

ఇళ్ల అక్రమాలపై 20న సీఎంకు నివేదిక

హైదరాబాద్: బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణాలలో  జరిగిన అక్రమాలపై స్పెషల్ ఇన్‌వెస్టిగేషన్ టీమ్(సిట్) ఈనెల 20న సీఎం కేసీఆర్‌కు  ప్రాథమిక నివేదికను సమర్పించనుంది. తొమ్మి ది జిల్లాల్లో  బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణాలలో చోటు చేసుకున్న అక్రమాలపై సీఐడీ సిట్‌కు చెందిన 30 దర్యాప్తు బృందాలు  మండలంలో రెండు గ్రామాలను ఎంచుకుని తమ దర్యాప్తును కొనసాగించారుు. ఒక్కో  వ్యక్తికి కొన్ని ప్రాంతాల్లో ఐదు నుంచి ఆరు ఇళ్ల కేటాయింపులు జరగగా, మరి కొన్ని ప్రాంతాలలో అసలు నిర్మాణాలు జరగక పోయినా దానికి  సంబంధించి మంజూరైన నిధు లు  అక్రమార్కులు, రాజకీయ దళారుల  జేబుల్లోకి పోయినట్లు  దర్యాప్తు అధికారుల దృష్టికి వచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement