Tribal Advisory Council
-
గిరిజన ప్రాంతాల్లో ఏం వసతులు కల్పించారు?
సాక్షి, హైదరాబాద్: గిరిజన సలహా మండలి తీర్మానాలను 2013 నుంచి ఎందుకు అమలు చేయడం లేదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, రవాణా వంటి మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకున్న చర్యలను వివరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. గిరిజన ప్రాంతాలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, కనీసవసతులు కూడా కల్పించడం లేదంటూ ఆదివాసి సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు పి.శ్రీనివాస్ దాఖ లు చేసిన ప్రజాహిత వ్యాజ్యా న్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం ఇటీవల విచారించింది. ‘గిరిజనులకు రక్షణగా ఉన్న 1/70 చట్టాన్ని అమలు చేయడం లేదు. ఈ మేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను అమలు చేయడం లేదు. గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు కనీసం వైద్యం అందడం లేదు. ప్రాథమిక వైద్యం కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆస్పత్రులకు తరలించే అంబులెన్స్‌లు లేవు. విద్యుత్, రవాణా వంటి కనీస సదుపాయాల కల్పనలోనూ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. జీవనోపాధి కోసం గిరిజనులు సాగు చేసుకుంటున్న భూముల్లోకి అటవీ, పోలీస్ అధికారులు వెళ్లి వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. గిరిజన సలహా మండలి 2013 నుంచి అనేక సిఫార్సులు చేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు’ అని పిటిషనర్ తరఫున న్యాయ వాది పీవీ రమణ వాదనలు వినిపించారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేప ట్టామని, సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరఫు స్పెషల్ జీపీ హరీందర్ నివేదించారు. తదుపరి విచారణను కోర్టు నవంబర్ 10కి వాయిదా వేసింది. -
అడవి బిడ్డలను ఆదుకోవడానికి కొత్త చట్టం
సాక్షి, అమరావతి/బుట్టాయగూడెం: గిరిజనులకు ఉద్యోగాల్లో వంద శాతం రిజర్వేషన్లు కల్పించే జీవో నంబర్ 3ని సుప్రీంకోర్టు కొట్టేసిన నేపథ్యంలో గిరిజనుల హక్కులను కాపాడేందుకు న్యాయపరమైన చర్యలు తీసుకొని అవసరమైతే కొత్త చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్ర గిరిజన సలహా మండలి (టీఏసీ) ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ విషయంలో సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న చర్యలను అభినందిస్తూ మరో తీర్మానాన్ని కూడా ఆమోదించింది. ఐటీడీఏలలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా మెడికల్ కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం, కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కళాశాలకు 153 కోట్లను కేటాయించినందుకు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపింది. జీవో నంబర్ 3 విషయంపై రాష్ట్ర గిరిజన సలహా మండలి (టీఏసీ) ప్రత్యేక సమావేశం గురువారం సచివాలయంలో జరిగింది. దీనికి డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణితో పాటుగా గిరిజన ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, పీడిక రాజన్న దొర, కళావతి, చెట్టి ఫల్గుణ, భాగ్యలక్ష్మి, ధనలక్ష్మి, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, డైరెక్టర్ రంజిత్ బాషా హాజరయ్యారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ► జీవో నంబర్ 3పై సుప్రీం తీర్పు నేపథ్యంలో ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలపై సుదీర్ఘంగా చర్చించాం. ► ఏజెన్సీ ప్రాంతాల్లోని పరిస్థితులు, భాషలు, సంప్రదాయాల నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో స్థానికులైన గిరిజనులు ఉపాధ్యాయులుగా ఉంటే ప్రయోజనం. ► గిరిజన పిల్లలు చదువుకోవడానికి, డ్రాప్ అవుట్స్ తగ్గడానికి అవకాశం ఉంటుందని జీవో నంబర్ 3ని తీసుకొచ్చాం. ► సుప్రీం తీర్పు తర్వాత సీఎం జగన్ ఆదేశాలతో అధికారులు ఇప్పటికే 3 సార్లు సమావేశాలను నిర్వహించారు. ► తెలంగాణకి చెందిన న్యాయశాఖ అధికారులు, అడ్వొకేట్ జనరల్‌తోనూ సమన్వయ సమావేశాలను నిర్వహించాం. ► సుప్రీం తీర్పుపై రివ్యూ పిటీషన్ దాఖలు చేయడానికి ఎలాంటి గడువు లేదు. కొంతమంది రాజకీయ దురుద్దేశాలతో జీవోపై రాద్ధాంతం చేయాలని చూస్తున్నారు. ► కాగా, సుప్రీం కోర్టులో రివ్యూ పిటీషన్ వేయడంతో పాటుగా ఏజెన్సీ గిరిజనులకు ఉద్యోగాల్లో 100 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలని పలువురు గిరిజన ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో కోరారు. -
గిరిజన హక్కుల రక్షణకు కొత్త చట్టం..
సాక్షి, తాడేపల్లి: డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి అధ్యక్షతన గిరిజన సలహా మండలి సమావేశం గురువారం జరిగింది. గిరిజన ప్రాంత ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో పుష్పశ్రీవాణి మాట్లాడుతూ జీవో 3 పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశామని పేర్కొన్నారు. గిరిజనుల హక్కులు కాపాడేందుకు కొత్త చట్టాన్ని తేవాలని తీర్మానం చేశామన్నారు. గిరిజనుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాలను అభినందిస్తూ తీర్మానం చేశామని వెల్లడించారు. జీవో 3పై తెలంగాణ అధికారులతో కూడా చర్చించామని పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. -
షెడ్యూల్డ్ ఏరియాలుగా గిరిజన పునరావాస గ్రామాలు
సాక్షి, అమరావతి: పునరావాసం కింద గిరిజనులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించినప్పుడు ఆ ప్రాంతాన్ని షెడ్యూల్డ్ ఏరియాగా ప్రభుత్వం ప్రకటించాలని గిరిజన సలహా మండలి సమావేశం తీర్మానించింది. కొన్ని ప్రాజెక్టుల కారణంగా గిరిజనులను తరలించి పునరావాసం ఏర్పాటు చేసినప్పుడు గిరిజన హక్కులు కోల్పోతున్నారని సలహా మండలి అభిప్రాయ పడింది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి అధ్యక్షతన మంగళవారం గిరిజన సలహా మండలి సమావేశం జరిగింది. సమావేశంలో సభ్యులైన గిరిజన ఎమ్మెల్యేలు విశ్వసరాయి కళావతి, పీడిక రాజన్నదొర, బాలరాజు, చెట్టి ఫల్గుణ, భాగ్యలక్ష్మి, కె ధనలక్ష్మి, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పి సిసోడియా, డైరెక్టర్ పి రంజిత్‌బాషా, అడిషనల్ డైరెక్టర్ రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. సమావేశం ఆమోదించిన తీర్మానాలను అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పుష్పశ్రీవాణి వివరించారు. - గిరిజనుల కోసం ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసేందుకు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుతాం. - రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో ప్రస్తుతం నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న 554 గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాలో కల´బాలి. - ఆర్వోఎఫ్ఆర్ పథకం కింద వచ్చే ఫిబ్రవరిలో గిరిజనులకు పట్టాలు ఇవ్వాలి. ప్రభుత్వం పేదలకు ఉగాది నాటికి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో అంతకు ముందుగానే గిరిజనులకు ఇవ్వాలని నిర్ణయం. - బాక్సైట్ తవ్వకాల జీవో రద్దు చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. అలాగే సాలూరులో వైఎస్సార్ గిరిజన యూనివర్సిటీ, పాడేరులో మెడికల్ కాలేజీ, కురుపాంలో ఇంజనీరింగ్ కాలేజీ, ఏడు గిరిజన ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు గిరిజనులు అడగకుండానే ఇచ్చిన సీఎంకు ధన్యవాదాలు. -
‘ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటుకై తీర్మానం’
సాక్షి, విజయవాడ: ఎస్సీ, ఎస్టీ కమిషన్ కలిసి ఉండటం వలన గిరిజనులకు న్యాయం జగరడం లేదని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. విజయవాడలో మంగళవారం గిరిజన సలహా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో గిరిజన వ్యవహారాల మంత్రి పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.. ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు కోసం గిరిజన సలహా మండలిలో తీర్మానం చేశామన్నారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. నాన్ షెడ్యూల్లో ఉన్న 545 గ్రామాలను షెడ్యూల్ గ్రామాలుగా మార్చాలని తీర్మానం చేశామని తెలిపారు. 96 జీవోను రద్దు చేసి సీఎం జగన్ గిరిజనుల పక్షపాతి అనిపించుకున్నారిని, అలాగే బాక్సైట్‌ను రద్దు చేశారని కృతజ్ఞతలు తెలిపారు. ఇక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన మూడేళ్ల వరకు గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేయలేదని, మంత్రి పదవుల విషయంలో చంద్రబాబు గిరిజనులకు అన్యాయం చేశారని మంత్రి మండిపడ్డారు. అయితే సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన 3 నెలలోనే గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేసి, గిరిజన వ్యవహారాల మంత్రిగా తనను నియమించడంతో పాటు డిప్యూటీ సీఎం పదవి కూడా ఇచ్చారని పుష్ప శ్రీవాణి హర్షం వ్యక్తం చేశారు. -
నెల రోజుల్లో పెండింగ్ కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: అటవీ భూముల హక్కులకు సంబంధించిన కేసులను నెలరోజుల్లో పూర్తిస్థాయిలో పరిష్కరించాలని గిరిజన సలహా మండలి (టీఏసీ) నిర్ణయించింది. అటవీభూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలిచ్చే అంశంపై మరోసారి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వాన్ని కోరింది. బుధవారం ఇక్కడ దామోదరం సంజీవయ్య సంక్షేమ భవనంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి అజ్మీరా చందూలాల్ అధ్యక్షతన టీఏసీ సమావేశం జరిగింది. ఇందులో ఎస్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అటవీ భూముల హక్కులకు సంబంధించి పెండింగ్ కేసులపై పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి కేసులు పెండింగ్‌లో ఉండటంతో అసలైన లబ్ధిదారులకు న్యాయం జరగట్లేదని మండిపడ్డారు. రైతు బంధు పథకం వర్తింపజేయాలంటే కేసులు పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా స్పందిస్తూ రైతు బంధు పథకం అమల్లోపే కేసులు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గతంలో తిరస్కరించిన దరఖాస్తులతో పాటు కొత్తవారి నుంచి కూడా అర్జీలు స్వీకరించే అంశాన్ని పరిశీలించాలని, ఈ మేరకు ప్రభుత్వానికి సూచించాలని టీఏసీ తీర్మా నించింది. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ.. ప్రభుత్వ శాఖల్లో ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి తక్షణ చర్యలు తీసుకోవాలని గిరిజన సలహా మండలి తీర్మానించింది. దాదాపు 1,000 బ్యాక్లాగ్ పోస్టులున్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని సభ్యులు సూచించారు. నెలరోజుల్లోగా ఈ మేరకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని గిరిజన ప్రాంతాల్లో 108 వాహ నాలను అందుబాటులో ఉంచాలని, పారామెడికల్, మెడికల్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. దేవరకొండ ప్రాంతంలో నర్సింగ్ శిక్షణ కళాశాల ఏర్పాటు చేయాలని టీఏసీ తీర్మానించింది. భద్రాచలం, ఏటూరునాగారం, ఉట్నూరు ఐటీడీఏలకు మూడు స్వధార్ గృహాలను మంజూరు చేసి నిర్మించాలని సలహా మండలి తీర్మానం చేసింది. భద్రాచలం, సార పాక, ఉట్నూరు, ఆసిఫాబాద్‌లను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేయాలని తీర్మానించింది. ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్లుగా ఐఏఎస్ అధికారులనే నియమించాలని సభ్యులు సున్నం రాజయ్య టీఏసీకి సూచించగా.. ప్రభుత్వానికి నివేదిస్తామని పేర్కొన్నారు. గిరిజన సలహా మండలి సమావేశానికి మీడియాను అనుమతించకపోవడంపై పలువురు సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. -
‘ఆ మండలి సభ్యులంతా టీడీపీ తొత్తులే’
విశాఖపట్నం: గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మండలిపై పాడేరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ.. గిరజన సలహామండలిలోని సభ్యులంతా టీడీపీ తొత్తులే అని ఎమ్మెల్యే అన్నారు. జీవో నంబర్ 84ను తక్షణమే మార్పు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అధికారి పార్టీ గిరిజనుల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. బాక్సైట్ తవ్వకాల కోసం ప్రభుత్వ కుట్ర చేస్తోందని ఎమ్మెల్యే ఈశ్వరి ఆరోపించారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి ఉపయోడపడే గిరిజన సలహా మండలి ఏర్పాటు కోసం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడేళ్ల నుంచి పోరాటం చేస్తున్నారు. ఎస్టీ రిజర్వ్ అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటిలోనూ ప్రతిపక్ష పార్టీకి చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఎన్నికకావడంతో ఇన్ని రోజులు గిరిజన సలహామండలిని ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేసింది. ఈ నేపథ్యంలో ఇక సుమారు రెండేళ్లు మాత్రమే అధికారం మిగిలి ఉండగా టీడీపీ ప్రభుత్వం ఈ మండలిని ఏర్పాటు చేసింది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అధ్యక్షతన ఏడుగురు ఎస్టీ ఎమ్మెల్యేలు, మరో ముగ్గురు అధికారులు సభ్యులుగా మరో అధికారి సభ్య కార్యదర్శిగా గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేసింది. మరో 8 మంది ఎస్టీలను సభ్యులుగా నామినేట్ చేసింది. వచ్చే సాధారణ ఎన్నికల వరకు మండలి కాలపరిమితి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గిరిజన సలహా మండలి: చైర్పర్సన్–గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సభ్యులుగా, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి, కేంద్ర ప్రభుత్వ ఎస్టీ, ఎస్టీ విభాగం డైరెక్టర్, రాష్ట్ర గిరిజన సహకార ఆర్థిక సంస్థ డైరెక్టర్. సభ్య కార్యదర్శిగా రాష్ట్ర గిరిజన శాఖ ప్రత్యేక కమిషనర్ నాన్–అఫీషియల్ సభ్యులుగా శాసన సభ్యులు విశ్వసరాయి కళావతి (ఎమ్మెల్యే, పాలకొండ), పాముల పుష్ప శ్రీవాణి (ఎమ్మెల్యే, కురుపాం), పీడిక రాజన్నదొర (ఎమ్మెల్యే, సాలూరు), కె.సర్వేశ్వరరావు (ఎమ్మెల్యే, అరకు), గిడ్డి ఈశ్వరి (ఎమ్మెల్యే, పాడేరు), వంతల రాజేశ్వరి (ఎమ్మెల్యే, రంపచోడవరం), ఎం. శ్రీనివాసరావు (ఎమ్మెల్యే, పోలవరం). నామినేటెడ్ సభ్యులుగా ఎన్.జయకృష్ణ, గుమ్మడి సంధ్యారాణి, జనార్దన్ థాట్రాజ్, ఎం.మణికుమారి, కెపీఆర్‌కె ఫణీశ్వరి, ఎం.ధారూనాయక్, ఎం.జీవుల నాయక్, వి.రంగారావులు నియమితులయ్యారు. -
ఎట్టకేలకు గిరిజన సలహా మండలి ఏర్పాటు
-
ఎట్టకేలకు గిరిజన సలహా మండలి ఏర్పాటు
సాక్షి, అమరావతి: గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి ఉపయోగపడే గిరిజన సలహా మండలి ఏర్పాటు కోసం ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడేళ్ల పోరాటానికి ఫలితం లభించింది. గవర్నర్ నరసింహన్ ప్రశ్నించడం, ప్రతిపక్షం పోరాటంతో ఎట్టకేలకు గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్టీ రిజర్వ్ అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటిలోనూ ప్రతిపక్ష పార్టీకి చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఎన్నికకావడంతో ఇన్ని రోజులు గిరిజన సలహామండలిని ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేసింది. రాజ్యాంగ పరంగా ఏర్పాటు చేయాల్సిన మండలిని కూడా ఏర్పాటు చేయకపోవడంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్.. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు. గవర్నర్ స్పందిస్తూ గిరిజన సలహా మండలి ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని లేఖ ద్వారా ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక సుమారు రెండేళ్లు మాత్రమే అధికారం మిగిలి ఉండగా టీడీపీ ప్రభుత్వం ఈ మండలిని ఏర్పాటు చేసింది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అధ్యక్షతన ఏడుగురు ఎస్టీ ఎమ్మెల్యేలు, మరో ముగ్గురు అధికారులు సభ్యులుగా మరో అధికారి సభ్య కార్యదర్శిగా గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేసింది. మరో 8 మంది ఎస్టీలను సభ్యులుగా నామినేట్ చేసింది. వచ్చే సాధారణ ఎన్నికల వరకు మండలి కాలపరిమితి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గిరిజన సలహా మండలి: చైర్పర్సన్–గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సభ్యులుగా, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి, కేంద్ర ప్రభుత్వ ఎస్టీ, ఎస్టీ విభాగం డైరెక్టర్, రాష్ట్ర గిరిజన సహకార ఆర్థిక సంస్థ డైరెక్టర్. సభ్య కార్యదర్శిగా రాష్ట్ర గిరిజన శాఖ ప్రత్యేక కమిషనర్ నాన్–అఫీషియల్ సభ్యులుగా శాసన సభ్యులు విశ్వసరాయి కళావతి (ఎమ్మెల్యే, పాలకొండ), పాముల పుష్ప శ్రీవాణి (ఎమ్మెల్యే, కురుపాం), పీడిక రాజన్నదొర (ఎమ్మెల్యే, సాలూరు), కె.సర్వేశ్వరరావు (ఎమ్మెల్యే, అరకు), గిడ్డి ఈశ్వరి (ఎమ్మెల్యే, పాడేరు), వంతల రాజేశ్వరి (ఎమ్మెల్యే, రంపచోడవరం), ఎం. శ్రీనివాసరావు (ఎమ్మెల్యే, పోలవరం). నామినేటెడ్ సభ్యులుగా ఎన్.జయకృష్ణ , గుమ్మడి సంధ్యారాణి, జనార్దన్ థాట్రాజ్, ఎం.మణికుమారి, కెపీఆర్‌కె ఫణీశ్వరి, ఎం.ధారూనాయక్, ఎం.జీవుల నాయక్, వి.రంగారావులు నియమితులయ్యారు. -
సీఎం అధ్యక్షతన గిరిజన సలహామండలి ఏర్పాటు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చైర్‌పర్సన్‌గా గిరిజనశాఖ ముఖ్యకార్యదర్శి, భారత ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీల డెరైక్టర్, డెరైక్టర్ టీసీఆర్/టీఐ సభ్యులుగా, ఏపీ గిరిజనసంక్షేమ కమిషనర్ సభ్య కార్యదర్శిగా తెలంగాణ రాష్ట్ర గిరిజన సలహా మండలి ఏర్పాటైంది. ఇందులో సభ్యులుగా ఎమ్మెల్యేలు అజ్మీరా రేఖ, కోవా లక్ష్మి, రాథోడ్ బాపూరావు, బానోత్ శంకర్‌నాయక్, అజ్మీరా చందులాల్, పాయం వెంకటేశ్వర్లు, కోరం కన్నయ్య, బానోత్ మదన్‌లాల్, సున్నం రాజయ్య, రవీంద్రకుమార్ రమావత్, డీఎస్ రెడ్యానాయక్, టి. వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర గిరిజనసంక్షేమ కమిషనర్ ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఈ మండలి ఏర్పాటు, అధికారుల నియామకం, సమావేశాల నిర్వహణ, తదితర నిబంధనలకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడిగా జారీచేసింది. ఈ మండలిలో 20 మంది సభ్యులుగా ఉంటారు. వారిలో 15 మందికి తక్కువ కాకుండా తెలంగాణ ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉంటారు. సభ్యుల పదవీకాలం మూడేళ్లపాటు ఉంటుంది. ఈ నిబంధనలను తెలంగాణ గిరిజనుల సలహా మండలి-2014 రూల్స్‌గా పిలుస్తారు. ఇందుకు సంబంధించిన రెండు ఉత్తర్వులను సోమవారం తెలంగాణ గిరిజనసంక్షేమ ముఖ్యకార్యదర్శి డాక్టర్. టి.రాధ విడుదలచేశారు. ఇళ్ల అక్రమాలపై 20న సీఎంకు నివేదిక హైదరాబాద్: బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణాలలో జరిగిన అక్రమాలపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) ఈనెల 20న సీఎం కేసీఆర్‌కు ప్రాథమిక నివేదికను సమర్పించనుంది. తొమ్మి ది జిల్లాల్లో బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణాలలో చోటు చేసుకున్న అక్రమాలపై సీఐడీ సిట్‌కు చెందిన 30 దర్యాప్తు బృందాలు మండలంలో రెండు గ్రామాలను ఎంచుకుని తమ దర్యాప్తును కొనసాగించారుు. ఒక్కో వ్యక్తికి కొన్ని ప్రాంతాల్లో ఐదు నుంచి ఆరు ఇళ్ల కేటాయింపులు జరగగా, మరి కొన్ని ప్రాంతాలలో అసలు నిర్మాణాలు జరగక పోయినా దానికి సంబంధించి మంజూరైన నిధు లు అక్రమార్కులు, రాజకీయ దళారుల జేబుల్లోకి పోయినట్లు దర్యాప్తు అధికారుల దృష్టికి వచ్చింది.