సాక్షి, విజయవాడ: ఎస్సీ, ఎస్టీ కమిషన్ కలిసి ఉండటం వలన గిరిజనులకు న్యాయం జగరడం లేదని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. విజయవాడలో మంగళవారం గిరిజన సలహా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో గిరిజన వ్యవహారాల మంత్రి పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.. ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు కోసం గిరిజన సలహా మండలిలో తీర్మానం చేశామన్నారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. నాన్ షెడ్యూల్‌లో ఉన్న 545 గ్రామాలను షెడ్యూల్ గ్రామాలుగా మార్చాలని తీర్మానం చేశామని తెలిపారు. 96 జీవోను రద్దు చేసి సీఎం జగన్ గిరిజనుల పక్షపాతి అనిపించుకున్నారిని, అలాగే బాక్సైట్‌ను రద్దు చేశారని కృతజ్ఞతలు తెలిపారు.
ఇక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన మూడేళ్ల వరకు గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేయలేదని, మంత్రి పదవుల విషయంలో చంద్రబాబు గిరిజనులకు అన్యాయం చేశారని మంత్రి మండిపడ్డారు. అయితే సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన 3 నెలలోనే గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేసి, గిరిజన వ్యవహారాల మంత్రిగా తనను నియమించడంతో పాటు డిప్యూటీ సీఎం పదవి కూడా ఇచ్చారని పుష్ప శ్రీవాణి హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment