puspa srivani
-
తాజంగిలో స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం
కొమరాడ (విజయనగరం)/పద్మనాభం (భీమిలి): అల్లూరి సీతారామరాజు తిరుగుబాటు చేసిన లంబసింగికి సమీపంలోని తాజంగిలో అల్లూరిని శాశ్వతంగా స్మరించుకునేలా గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియంను ప్రభుత్వం నిర్మించనుందని ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీవాణి తెలిపారు. 21 ఎకరాల విస్తీర్ణంలో రూ.35 కోట్లతో నిర్మించనున్న తాజంగి మ్యూజియం నిర్మాణానికి సీఎం జగన్ త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు ఆమె చెప్పారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా విజయనగరం జిల్లా కొమరాడ మండలంలోని కంబవలస పంచాయతీ రాజ్యలక్ష్మీపురంలో అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని వైఎస్సార్ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలకు ఆమె శంకుస్థాపనలు చేశారు. అల్లూరి మ్యూజియం విశాఖ జిల్లా పద్మనాభం మండలంలోని పాండ్రంగిలో ఆదివారం ప్రభుత్వ పరంగా నిర్వహించిన అల్లూరి జయంతి వేడుకల్లో విశాఖ కలెక్టర్ వినయ్‌చంద్ మాట్లాడారు. పాండ్రంగిలో అల్లూరి పేరు మీద రూ.3 కోట్లతో మ్యూజియాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. -
ఉప ముఖ్యమంత్రే వండి వడ్డించారు!
-
వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు
వైఎస్సార్సీపీ రోజురోజుకూ బలోపేతమవుతోంది. ప్రతి గ్రామం నుంచి నాయకులు... స్థానికులు ఇతర పార్టీల మద్దతుదారులు విరివిగా వచ్చి చేరుతున్నారు. కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలంలోని పలు గ్రామాలకు చెందిన పలువురు నాయకులు పెద్ద సంఖ్యలో ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి సమక్షంలో వైఎస్సార్సీపీలో శుక్రవారం చేరారు. స్థానిక ఎన్నికల ముందు ఈ చేరికలు మరింత ఉత్సాహాన్నిస్తున్నాయి. జియ్మమ్మవలస: వైఎస్సార్ సీపీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖమంత్రి పాముల పుష్ఫశ్రీవాణి, అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు అన్నారు. మండలంలోని గవరమ్మపేట, వెంకటరాజపురం, జియ్యమ్మవలస, పొట్టుదొరవలస గ్రామాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరారు. వీరికి చినమేరంగిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. గవరమ్మపేట నుంచి 95 కుటుంబాలు, వెంకటరాజపురం నుంచి 40 కుటుంబాలు, జియ్యమ్మవలస పంచాయతీ పొట్టుదొరవలస నుంచి 20 కుటుంబాలు, జియ్యమ్మవలస నుంచి 60 కుటుంబాలవారు వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీలో చేరిన నాయకులు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్టు వెల్లడించారు. అమ్మ ఒడి, రైతుభరోసా, ఆరోగ్యశ్రీ తదితర మంచి పథకాలతో పేదలను ఆదుకుంటున్నారని తెలిపారు. భవిష్యత్‌లో టీడీపీ పూర్తిగా ఖాళీ అవుతుందన్నారు. డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మాట్లాడుతూ జగనన్న చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయని, ఇందులో భాగంగానే టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారన్నారు. పరీక్షిత్‌రాజు మాట్లాడుతూ పార్టీలో చేరిన వారందరూ స్థానిక సంస్థల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషిచేయాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో వెంకటరాజపురం గ్రామానికి చెందిన మర్రాపు లక్ష్మునాయుడు, కర్రి సీతం నాయుడు, బొత్స గోవిందరావు, శ్రీరామాయూత్ సభ్యులు, గవరమ్మపేట గ్రామం నుంచి డీలర్ రౌతు అప్పలనాయుడు, కె.చంద్రశేఖర్, గవరమ్మపేట యువత ఉన్నారు. అలాగే, జియ్యమ్మవలస, పొట్టుదొరవలస నుంచి దత్తి శంకరరావు, బేత అప్పలనాయుడు, బొడ్డుపల్లి శ్రీనివాసరావు, తటిపిడకల వెంకటనాయుడు, రాయల సింహాచలం, గర్భాన చిన్న, చిలకల తిరుపతి, రంభ సత్యనారాయణ, రంభ శ్రీరాములు తదితరులు పార్టీలో చేరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మూడడ్ల గౌరీశంకరరావు, మండల ఎన్నికల సమన్వయకర్త బొంగు సురేష్, ఆర్నిపల్లి వెంకటనాయుడు, పెద్దింటి శంకరరావు, మర్రాపు చినతాతబాబు, జోగి సురేష్ పాల్గొన్నారు. -
‘ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటుకై తీర్మానం’
సాక్షి, విజయవాడ: ఎస్సీ, ఎస్టీ కమిషన్ కలిసి ఉండటం వలన గిరిజనులకు న్యాయం జగరడం లేదని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. విజయవాడలో మంగళవారం గిరిజన సలహా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో గిరిజన వ్యవహారాల మంత్రి పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.. ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు కోసం గిరిజన సలహా మండలిలో తీర్మానం చేశామన్నారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. నాన్ షెడ్యూల్లో ఉన్న 545 గ్రామాలను షెడ్యూల్ గ్రామాలుగా మార్చాలని తీర్మానం చేశామని తెలిపారు. 96 జీవోను రద్దు చేసి సీఎం జగన్ గిరిజనుల పక్షపాతి అనిపించుకున్నారిని, అలాగే బాక్సైట్‌ను రద్దు చేశారని కృతజ్ఞతలు తెలిపారు. ఇక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన మూడేళ్ల వరకు గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేయలేదని, మంత్రి పదవుల విషయంలో చంద్రబాబు గిరిజనులకు అన్యాయం చేశారని మంత్రి మండిపడ్డారు. అయితే సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన 3 నెలలోనే గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేసి, గిరిజన వ్యవహారాల మంత్రిగా తనను నియమించడంతో పాటు డిప్యూటీ సీఎం పదవి కూడా ఇచ్చారని పుష్ప శ్రీవాణి హర్షం వ్యక్తం చేశారు. -
క్రీడలకు వైఎస్ జగన్ సర్కార్ అధిక ప్రాధాన్యత
సాక్షి, విజయనగరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో రాష్ట్ర్రస్థాయి సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడలపై విద్యార్థుల్లో ఆసక్తి పెంపొందించాలని పిలుపునిచ్చారు. క్రీడల పట్ల తల్లిదండ్రులు కూడా అవగాహన కలిగి ఉండాలన్నారు. విజయనగరంలో కబడ్డీ అకాడమీ ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. క్రీడాకారులు మంచి ఫలితాలు సాధించాలి: బొత్స పట్టణ నడిబొడ్డున ఉన్న రాజీవ్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వసతులను వినియోగించుకుని.. క్రీడాకారులు మంచి ఫలితాలు సాధించాలని మంత్రి బొత్స సత్యనారాయణ ఆకాంక్షించారు. ఈ స్టేడియానికి అవసరమైన అన్నీ మౌలిక వసతులను కల్పిస్తామన్నారు. పట్టణంలో ఖాళీ స్థలాలు ఉన్న అన్ని పార్కుల్లోనూ ఆటస్థలాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యార్థులు ఉత్సాహంగా వుండాలంటే.. విద్యతో పాటు వ్యాయామం అవసరమన్నారు. పీవీ సింధును ఆదర్శంగా తీసుకోవాలి: పుష్పశ్రీవాణి రాష్ట్రంలోని క్రీడాకారులంతా బ్యాడ్మింటన్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన సింధును ఆదర్శంగా తీసుకోవాలని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి పిలుపునిచ్చారు. ఓటమికి నిరుత్సాహపడి కృంగిపోకుండా విజయం సాధించే వరకూ ప్రయత్నించాలన్నారు. రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నగదు బహుమతులు అందజేస్తోందని వెల్లడించారు. -
నిర్లక్ష్యం వద్దు.. బాధ్యతగా పనిచేయండి
సాక్షి, విశాఖపట్నం: నిర్లక్ష్యధోరణి వీడి.. వైద్యులు బాధ్యతయుతంగా పనిచేయాలని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. కేజీహెచ్‌లో వైద్యులు, సిబ్బంది పనితీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కింగ్ జార్జి ఆసుపత్రిలో వివిధ విభాగాలను డిప్యూటీ సీఎంలు ఆళ్ల నాని, పుష్పశ్రీవాణి, మంత్రులు అవంతి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు తనిఖీ చేశారు. అనంతరం జెడ్పీ హాలులో సమీక్షా సమావేశంలో వీరంతా పాల్గొన్నారు. పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.. కేజీహెచ్‌లో కొందరి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గతంలో కొన్ని మరణాలు సంభవించాయని తెలిపారు. కింగ్ జార్జి ఆసుపత్రిలో అవినీతి పెరిగిపోయిందన్నారు. పోస్టు మార్టం చేయడానికి కూడా గిరిజనులు, పేదల నుంచి లంచం తీసుకుంటున్నారని మండిపడ్డారు. గిరిజనులు వస్తే మీ కుటుంబ సభ్యులుగా స్పందించి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. పేదలు, గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలనే కృత నిశ్చయంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా వైద్యులు పనిచేయాలని పిలుపునిచ్చారు. సంతృప్తిగా లేను.. మళ్లీ మళ్లీ తనిఖీలు చేస్తా: ఆళ్ల నాని కేజీహెచ్‌లో వైద్యులు, సిబ్బంది పనితీరుపై డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అసంతృప్తి వ్యక్తం చేశారు. గిరిజనులకు వైద్యం అందించడంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. గిరిజనులకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. శానిటేషన్ కూడా అధ్వాన్నంగా ఉందన్నారు. కేజీహెచ్‌లో పరిస్థితులు మారాలని కోరారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి నిరుపేదకి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యం నెరవేరేలా పనిచేయలన్నారు. వైద్యులు, సిబ్బంది తీరు మార్చుకోవాలని మళ్లీ మళ్లీ వచ్చి తనిఖీలు చేస్తానని హెచ్చరించారు. శిథిలావస్థలో ఉన్న బ్లాక్‌ల స్థానంలో కొత్త భవనాలు నిర్మించడానికి సీఎం దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు. ఎంసిహెచ్‌లో అదనపు బ్లాక్‌ను మంజూరు చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే అవినీతి: అవంతి పేదలకు కేజీహెచ్‌లో సరైన వైద్యం అందండం లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే కేజీహెచ్‌లో అవినీతి పెరిగిపోయిందన్నారు. మృతదేహానికి పోస్టుమార్టం చేసి.. బంధువులకి అప్పగించడానికి కూడా లంచాలు తీసుకుంటున్న దుస్థితి ఉందన్నారు. ఆసుపత్రిలో అవినీతిని రూపు మాపాలన్నారు. కేజీహెచ్‌ను అవినీతి రహితంగా తీర్చిదిద్దాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ బడ్జెట్లో అధిక వాటాను ఉత్తరాంధ్రకు కేటాయించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. కేజీహెచ్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి సహకరించాలన్నారు. వైఎస్సార్ హయాంలో కేజీహెచ్ అభివృద్ధి: ద్రోణంరాజు శ్రీనివాస్ దివంగత మహానేత వైఎస్సార్ హయాంలో కేజీహెచ్ ఆసుపత్రి బాగా అభివృద్ధి చెందిందని విఎంఆర్డిఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ అన్నారు. ఆయన హయాంలో రూ. 35 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖకు వైఎస్సార్ అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఇప్పుడు ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా వైద్యం, విద్యపై దృష్టి పెట్టారన్నారు. కేజీహెచ్‌కు రెండు కోట్ల అదనపు బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. కేజీహెచ్‌లో అదనపు బెడ్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఆరోగ్యశ్రీతో పేదలకు ఎంతో మేలు జరిగింది: ఎంపీ సత్యవతి దివంగత సీఎం వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీతో పేదలకు ఎంతో మేలు జరిగిందని అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి అన్నారు. కేజీహెచ్‌లో చిన్న పిల్లల వార్డుకి మౌలిక సదుపాయాలు పెంచాలని కోరారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులతో పాటు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జవహర్‌రెడ్డి, కలెక్టర్ వినయ్‌చంద్, ఎంపీలు ఎంవివి సత్యనారాయణ, గొడ్డేటి మాధవి పాల్గొన్నారు. -
కనుల పండువ... స్వాతంత్య్ర వేడుక...
జిల్లా వ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. వీధి వీధినా... స్వాతంత్య్రవేడుకలు అత్యంత ఉత్సాహవంతంగా సాగాయి. జిల్లా కేంద్రంలోని పోలీస్‌పరేడ్ మైదానంలో కనుల పండువగా సాగిన ఉత్సవంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి పతాకావిష్కరణ గావించారు. జిల్లాస్థాయి ఉన్నతాధికారులు... నాయకులు హాజరైన ఈ ఉత్సవంలో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖలు ప్రగతిని తెలియజేస్తూ ప్రదర్శించిన శకటాలు అలరించాయి. విజయనగరం గంటస్తంభం: జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో 73వ స్వాతంత్య్ర వేడుకలు గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి ముఖ్య అతిథిగా జెండా ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి ప్రజలనుద్దేశించి ప్రసగించారు. ఉత్తమ సేవలందించిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. కలెక్టర్ ఎం. హరి జవహర్లాల్, జిల్లా పోలీసు సూపరిండెంట్ రాజకుమారితో కలిసి సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించారు. ప్రభుత్వ పథకాల గురించి తెలియజేసే శకటాలను తిలకించి, స్టాల్స్‌ను సందర్శించి పేదలకు ఆస్తులు పంపిణీ చేశారు. పతాకావిష్కరణతో ఉత్సవాలు ప్రారంభం.. పోలీసు పరేడ్ మైదానంలో ఉదయం 9గంటలకు వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి జెండా ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం ఆమెకు పోలీసులు, ఇతర రక్షకభటులు గౌరవ వందనం చేశారు. అనంతరం శాంతికి సూచికగా పావురాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం మూడు నెలల్లో చేసిన కార్యక్రమాలు, రానున్న ఏడాది కాలంలో చేపట్టే కార్యక్రమాల గురించి ఆమె సుదీర్ఘంగా ప్రసంగించారు. పనితీరుకు ప్రశంస.. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఉత్తమ సేవలందించిన అధికారులు, సిబ్బంది, స్వచ్చంద సంస్థలకు ప్రశంసా పత్రాలు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన వారికి ఉప ముఖ్యమంత్రి వాటిని అందజేశారు. జిల్లాలో 87 శాఖలు, వివిధ విభాగాలకు చెందిన 430మంది ప్రశంసా పత్రాలు అందికున్నవారిలో ఉన్నారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన వినతుల పరిష్కారంలో మంచి ప్రగతి కనపరిచిన వారికి, పారిశుద్ధ్య కార్యక్రమాలు బాగా చేసిన వారికి, వివిధ శాఖల్లో విధుల్లో మంచి పనితీరు కనపరిచిన వారికి ఈ ప్రశంస దక్కింది. అదరహో అనిపించిన సాంస్కృతిక ప్రదర్శనలు.. వేడుకల్లో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎనిమిది పాఠశాలలకు చెందిన పిల్లలు దేశభక్తి పెంపొందించే గీతాలకు నృత్య ప్రదర్శన చేశారు. ఎవరికి వారే పోటీ, ఎవరికి వారే సాటి అన్న రీతిలో సాగిన ప్రదర్శనలు ఆహూతులను అలరించా యి. భారత దేశ సంస్కృతీ, సంప్రదాయాలు, స్వా తంత్య్ర సమరయోధుల పోరాటం, దేశ గొప్పతనం, ప్రజాస్వామ్యం విశిష్టత చాటిచెబుతూ రచించిన గే యాలకు విద్యార్థులు చూడ ముచ్చటగా నృత్యాలను ప్రదర్శించడం విశేషం. ముందుగా వివిధ పాఠశాల విద్యార్థుల మాస్ డ్రిల్‌తో కార్యక్రమం మొదలైంది. తర్వాత విజయనగరం గరŠల్స్ హైస్కూల్ విద్యార్థినులు వందేమాతరం గేయానికి స్థానికంగా ప్రాచుర్యం పొందిన కర్ర, కత్తి సాములు జోడించి ప్రదర్శన ఇచ్చారు. ఫోర్ట్ సిటీ విద్యార్థులు ఐ యామ్ ఇండియన్ గేయానికి, కేజీబీవీ విద్యార్థినులు ఒకే ఒక్క ఓంకారం అన్న గీతానికి, సెయింట్ మేరీస్ విద్యార్థులు దేశభక్తి గీతానికి, ద్వారకా తిరుమల అంధుల పాఠశాల విద్యార్థులు మేరా భారత్, జిల్లా పోలీసు వెల్ఫేర్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ విద్యార్థులు మేమే ఇండియన్స్, కొత్తవలస ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు పుణ్యభూమి ఈ భరతదేశం, బాడంగి ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు ఇండియా వాలా గేయాలకు నృత్య ప్రదర్శన అందించారు. ఇందులో ద్వారకామయి అంధుల పాఠశాల విద్యార్థులు, ఏపీ మోడ ల్ స్కూల్ విద్యార్థులు, కేజీబీవీ విద్యార్థుల ప్రదర్శనలకు వరుసగా ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు లభించాయి. బాడంగి ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రత్యేక బహుమతి గెల్చుకున్నారు. రూ.336.86కోట్ల ఆస్తులు పంపిణీ.. ఉత్సవంలో భాగంగా పేదలకు రుణాలు, ఆస్తులు పంపిణీ చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, కలెక్టర్ హరి జవహర్లాల్, ఎస్పీ రాజకుమారి తదితరులు వాటిని అందజేశారు. మైదానంలో మొత్తం 18శాఖలు తమ ప్రగతిని, పథకాలను తెలియజేస్తూ స్టాల్స్ ఏర్పాటు చేశాయి. ఇందులో ఆరుశాఖలు పేదల కు రూ.336.85కోట్ల ఆస్తులు, రుణాలు పంపిణీ చేశా యి. డీఆర్డీఏ–వెలుగు అధికారులు 8642 సంఘాల కు రూ.298.55కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు, 4087 మందికి రూ.19.47కోట్ల స్త్రీనిధి రుణాలు అందజేశారు. వైఎస్సార్ బీమా కింద 456 మందికి రూ.8.36కోట్లు సాయం అందజేశారు.252 రైతు సంఘాలకు రూ.1.26 కోట్లు రుణాలు ఇప్పించారు. విభిన్న ప్రతిభావంతులశాఖ ద్వారా 8మందికి రూ.50వేలు వంతున, బీసీ కార్పొరేషన్ ద్వారా 34మందికి రూ.41.04కోట్లు, కెనరాబ్యాంకు, డీసీసీబీ 9మందికి రూ.15లక్షలు, డీపీవో ద్వారా 2289మందికి రూ.4.65కోట్లు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 68మందికి రూ.2కోట్లు విలువ గల ఆస్తులు, రుణాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో విజయనగరం, నెల్లిమర్ల ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, బడ్డుకొండ అప్పలనాయుడు, అసిస్టెంట్ కలెక్టర్ కేతన్ గార్గ్, ఇన్చార్జి జేసీ–2 సాల్మన్‌రాజ్, డీఆర్వో జె.వెంకటరావు, విజయనగరం ఆర్డీవో జె.వి.మురళి, ఇతర అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, మజ్జిశ్రీనివాసరావు, పెనుమత్స సురేష్‌బాబు, సూర్యనారాయణరాజు పాల్గొన్నారు. -
అగ్రగామిగా విజయనగరం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని, రాబోయే రోజు ల్లో జిల్లాను పూర్తి సస్యశ్యామలంగా తీర్చిదిద్దేందుకు అడుగులు పడుతున్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. విజయనగరం పోలీస్ పరేడ్ మైదానంలో గురువారం నిర్వహించిన 73వ స్వాతంత్య్ర దినోత్సవంలో ఆమె ముఖ్యఅతిథిగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లాలోని వివిధ∙ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ పనితీరు కనబరచిన ఉద్యోగులు, అధికారులకు ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు. అనంతరం ఆమె జిల్లా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ గ్రామాలే దేశాభివృద్ధికి పట్టుకొమ్మలనే గాంధీ ఆలోచనలకు అనుగుణంగా గ్రామ స్వరాజ్య సాధన దిశగా ప్రభుత్వ సాలన సాగుతోందని చెప్పారు. జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రోత్సాహం అందించేందుకు పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం, ప్రస్తుతం ఉన్నవాటిని ఆధునికీకరిస్తామని తెలిపారు. త్యాగధనుల ఆశయసాధనకు కృషి: దేశ స్వాతంత్య్రం కోసం ఎంతోమంది నిస్వార్ధ పోరాటం చేశారని, వారి త్యాగాలను మనం ఎన్నటికీ మరువలేమన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ మొదలుకొని మన ప్రాంతంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వరకు ఎందరో నేతలు దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలు అర్పించారనీ, అలాంటి సమర యోధులందరికీ శిరసు వంచి నివాళులర్పిస్తున్నట్లు తెలిపా రు. వారి ఆశయాల సాధన కోసం పునరంకితం కావా లని కోరారు. రాష్ట్రంలో విజయనగరం జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని, ప్రజల్లో దేశభక్తి భావాలు పెంపొందించే రచనలు చేసిన మహాకవి గురజాడ అప్పారావు నడయాడిన నేల అని, వ్యవహారిక భాషకు పట్టంకట్టిన గిడుగు రామమూర్తి, హరికథ ద్వారా జిల్లా పేరు ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేసిన ఆదిభట్ల నారాయణ దాసు వంటి ఎందరో మహనీయులకు పురిటిగడ్డయిన ఈ జిల్లాలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి: జిల్లా ఆర్థిక వ్యవస్థకు మూలమైన వ్యవసాయ, అనుబంధ రంగాల అభివద్ధికి తోడ్పాటు అందించి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ప్రభుత్వం భావిస్తోందని వెల్లడించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తిచేయడం, మరికొన్ని ప్రాజెక్టులను ఆధునికీకరించి పూర్తి సామర్థ్యంతో నిర్దేశిత ఆయకట్టుకు సాగునీటిని అందించే పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. అదనపు ఆయకట్టుకు సాగునీటి వసతుల కల్పనలో భాగంగా 62 పెద్ద చెరువులను మరమ్మతు చేయనున్నట్టు చెప్పారు. దాదాపు రూ.210 కోట్లతో ఈ ఏడాది నుంచి వ్యవసాయరంగ అభివృద్ధితో పాటు ఉద్యాన పంటల విస్తరణకు ప్రోత్సాహం, మత్స్య పరిశ్రమ అభివద్ధికి తోడ్పాటు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు చేయూతనిస్తామన్నారు. ఆంధ్ర ప్రదేశ్ సమీకృత సాగునీరు– వ్యవసాయ పరివర్తన పథకం, నీటిపారుదల– జీవనోపాధుల అభివృద్ధి పథకం పేరుతో ఈ కార్యక్రమాలు ఈ ఏడాది నుండి అమలు కానున్నాయని చెప్పారు. దివంగత నేత వైఎస్సార్ ఆశయ సాధనలో భాగంగా రైతులు గౌరవప్రదమైన స్థానంలో నిలిచేలా ప్రస్తుత ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నారని చెప్పారు. జిల్లాలో ప్రకృతివ్యవసాయంవైపు రైతులు మొగ్గు చూపేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది 37 వేల మంది రైతుల ద్వారా 40వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు 61 వేల క్వింటాళ్ల వరి, వేరుశనగ, పచ్చిరొట్ట ఎరువులు, విత్తనాలు రాయితీపై సరఫరా చేశామని, బ్యాంకుల ద్వారా రూ.1446కోట్ల పంట రుణాలు అందజేయాలన్నది లక్ష్యమని ఇప్పటి వరకూ రూ. 571 కోట్లు అందజేశామని తెలిపారు. జిల్లాలో 15 వేల మంది కౌలు రైతులకు రుణ అర్హత పత్రాలు మంజూరు చేసినట్లు వివరించారు. గిరిజన సంక్షేమానికి పెద్దపీట: జిల్లాలోని గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామనీ, విద్య, వైద్యంతో పాటు వారి ఆర్థికాభివృద్ధికి చేయూతనిస్తున్నామని వివరించారు. గిరిజనులకోసం మంజూరైన విశ్వవిద్యాలయాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి మన జిల్లాలోనే ప్రారంభిస్తున్నామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేసే గ్రామ సచివాలయాల్లోని ఉద్యోగాలన్నీ వంద శాతం గిరిజన యువతకే కేటాయించేలా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రతి గిరిజన కుటుంబానికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించటంతో పాటు జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు భోజన, వసతి సదుపాయాల నిమిత్తం ఏడాదికి రూ.20 వేలు అందించనున్నట్లు చెప్పారు. మాతా శిశు మరణాల నిరోధానికి జిల్లాలో రెండు చోట్ల గర్భిణుల వసతి గృహాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. పాఠశాలల మెరుగుకు చర్యలు: ప్రభుత్వ విద్యాసంస్థల్లో వసతులు మెరుగు పరచి విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతాయన్నారు. సంక్షేమ వసతి గృహాలలో పరిస్థితులు మెరుగు పరుస్తామని తెలిపారు. హాస్టళ్ల మరమ్మతుకోసం జిల్లాకు రూ.14 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేస్తూ బడ్జెట్లో రూ.66 కోట్లు కేటాయించారన్నారు. గరివిడిలో పశు వైద్య కళాశాలను త్వరలో ప్రారంభిస్తామన్నారు. అక్టోబర్ నుంచి వైఎస్సార్ రైతు భరోసా: రైతుల కోసం వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి నాలుగేళ్ళకు పెట్టుబడి సహాయంగా రూ.50 వేలు అందించనున్నట్టు తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ నెల నుంచే ఈ పథకం అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. రైతుల దరఫున ప్రభుత్వమే బీమా మొత్తాన్ని చెల్లిస్తుందని, రైతులకు వడ్డీలేని పంట రుణాలు అందించడంతో పాటు వారికి ప్రభుత్వమే ఉచితంగా బోర్లు కూడా వేయిస్తుందన్నారు. ఆరోగ్యపరిరక్షణలో భాగంగా కిడ్నీ, తలసేమియా లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రతినెలా రూ.10 వేలు పింఛన్ ఇస్తున్నామన్నారు. బడికి పంపే తల్లులకు అమ్మ ఒడి పథకం ద్వారా అండగా నిలువనున్నట్లు తెలిపారు. జిల్లాలో 3 లక్షల 9 వేల మంది ప్రయోజనం పొందనున్నట్లు తెలిపారు. వైఎస్సార్ ఆసరా పథకం కింద 45 ఏళ్ల వయస్సు కలిగిన డ్వాక్రా సభ్యులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళకు ఏడాదికి రూ. 15 వేలు సహాయం అందించనున్నట్టు వెల్లడించారు. జిల్లాలో 3 లక్షల 5 వేల మందికి ప్రతి నెలా సామాజిక పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఇల్లు లేని అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ళ స్థలాలతో పాటు పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. మద్యం నిషేధానికి అడుగులు: మద్యం రక్కసిని తరిమి కొట్టాలని ప్రభుత్వం భావి స్తోందనీ, దీనిని దశలవారీగా అమలు చేసేందుకు బెల్ట్ షాపులు మూసివేయిస్తున్నట్టు తెలిపారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా అక్టోబర్నుంచి ప్రజలదగ్గరికే పథకాలు వస్తాయన్నారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రతి సోమవారం స్పందన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుండి రాష్ట్రంలో కొత్త ఇసుక విధానం అందుబాటులోకి వస్తోందన్నారు. విజయనగరాన్ని సుందర వనంగా, హరిత నగరంగా చేయాలనే కలెక్టర్ ఆలోచనను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యమివ్వాలని కోరారు. కార్పొరేషన్ హోదా దక్కించుకున్న విజయనగరంలో రోడ్ల విస్తరణ, అభివృద్ధి, నీటి సరఫరా వంటి పనులను రూ.110 కోట్లు వెచ్చిస్తున్నట్టు తెలిపారు. జిల్లా ఎస్పీ నేతృత్వంలో శాంతిభద్రతల పరిరక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణకు చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి తోడ్పాటు నందించా లని కోరారు. -
వైఎస్సార్‌పై అభిమానంతోనే పరీక్షిత్‌తో పెళ్లి..
‘లక్ష్యం గొప్పదైనప్పుడు నడిచే దారిలో రాళ్లున్నా.. ముళ్లున్నా లెక్క చేయకు’ అని పెద్దలు చెప్పిన మాటలను మనసుకెక్కించుకున్న ఓ సాధారణ మహిళ. తనకు తెలియకుండానే మహానేత వై.ఎస్.రాజశేఖరెడ్డిపై అమితమైన అభిమానం పెంచుకుని... ఆ కారణంగానే పరీక్షిత్‌రాజ్‌ను పెళ్లి చేసుకుని వైఎస్ తనయుడు జగన్మోహన్రెడ్డి స్థాపించిన వైఎస్సార్సీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. అటు ప్రజా ప్రతినిధిగా, రాజకీయనేతకు భార్యగా సమతూకం పాటిస్తూ ప్రజల ఆదరాభిమానాలు గెలుచుకుంటున్నారు. ఆమే కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి. మారుమూల గిరిజన పల్లెల్లో ప్రతి గడపా తొక్కారు. ప్రతి ఇంటి సమస్యా తెలుసుకున్నారు. వాటికోసం అవిశ్రాంతంగా పోరాడుతున్నారు.శుక్రవారం ఆమె పుట్టినరోజు సందర్భం గా ‘సాక్షి ప్రతినిధి’కిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ..... సాక్షి ప్రతినిధి, విజయనగరం: మాది పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండలం దొరమామిడి గ్రామం. మేం ముగ్గురం అక్కా చెల్లెళ్లం, ఒక తమ్ముడు. నేను రెండో అమ్మాయిని. మా నాన్న పేరు నారాయణమూర్తి. ప్రధానో పాధ్యాయునిగా పనిచేశారు. నేను 10వ తరగతి వరకు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుకున్నాను. ఇంటర్ జంగారెడ్డిగూడెం సూర్య కళాశాలలో, డిగ్రీ అక్కడి ఉమెన్స్ కళాశాలలో చదువుకున్నాను. విశాఖలో బీఈడీ చేశాను. చదివిన గిరిజన ఆశ్రమ పాఠశాలలోనే ఏడాదిన్నర పాటు టీచర్‌గా పనిచేశా. చిన్నతనం నుంచేపాలిటిక్స్పై మక్కువ మాకు బ్యాక్ గ్రౌండ్ అంటూ ఏమీ లేదు. కానీ చిన్నప్పటి నుంచీ పాలిటిక్స్ అంటే చాలా ఇష్టం. ఎన్నికలకు ముందు పెళ్ళి చూపుల్లోనే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సి ఉంటుందన్నారు. వైఎస్సార్సీపీ అయితేనే పోటీ చేస్తాను, ఇంకేదైతే నో అని చెప్పా. పెళ్ళయిన 15 రోజులకే నన్ను వైఎస్సార్సీపీ కురుపాంనియోజకవర్గ కోఆర్డినేటర్‌గా నియమించారు. మార్చి 14న పరీక్షిత్ రాజుతో పెళ్లయింది. నెల రోజులకే ఎలక్షన్ ప్రచారానికి వెళ్లా. మే 6న ఎలక్షన్. ఎమ్మెల్యేగా 19 వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలిచా. వైఎస్ కోసమే పెళ్లికి ఒప్పుకున్నా: 2004లో నేను డిగ్రీ చేస్తున్నాను. అప్పుట్లో రాజశేఖరరెడ్డి గెలుస్తారా, చంద్రబాబు నాయుడు గెలు స్తారా అని మా ఫ్రెండ్స్‌లో బెట్టింగ్‌లు కూడా జరి గాయి. మేం అన్నట్టే రాజశేఖరరెడ్డి గెలిచారు. సమ్మర్ హాల్డేస్కి చింతలపూడి దగ్గరున్న వెలగలపల్లిలో మా ఫ్రెండ్ ఇంటికి 15 రోజులు వెళ్ళా. వారితో ఎప్పుడూ రాజకీయాల కోసం, వై.ఎస్. రాజశేఖరరెడ్డి కోసమే చర్చ జరిగేది. అప్పుడే నా కు రాజశేఖరరెడ్డి అంటే చాలా అభిమానం పెరిగిపోయింది. మా నాన్న హెచ్ఎంగా పనిచేసేవారు. అయినా నేను వైఎస్ ఫొటోలను తీసుకుని ఇంటి నిండా అంటించేశాను. మనం ఉద్యోగులం అలా చేయకూడదమ్మా అని మా నాన్న చెప్పినా వినేదా న్ని కాదు. వైఎస్ కోసమే పరీక్షిత్‌తో పెళ్లికి ఒప్పుకున్నా. నాకేదైనా కష్టం వస్తే రాజశేఖరరెడ్డి ఫొటో దగ్గరకు వెళ్ళే చెప్పుకుంటాను. అలా ఆయన ఫొటో ముందు చెప్పుకోబట్టే నేను ఇలా ఎమ్మెల్యే ని అయ్యానని అనుకుంటాను. జగన్ మెచ్చుకున్నారు: నేనూ, నా భర్త ఏనాడూ డబ్బుకు అంతగా ప్రాముఖ్యం ఇవ్వం. విలువలకే ప్రాధాన్యమిస్తాం. చాలా మంది ఫోన్ చేసి ప్రలోభాలు ఎరవేశారు. కానీ మేం దేనికీ లొంగలేదు. ఆ సమయంలో వైఎస్‌పై మాకున్న అభిమానాన్ని చాటిచెప్పడం కోసం చేతిపై ‘వైఎస్ఆర్’ అని పచ్చబొట్టు పొడిపించుకున్నాను. ఇచ్చిన మాట కోసం, ప్రజల కోసం ఎన్ని కష్టాలెదురైనా తట్టుకుని నిలబడటం జగన్ నుంచే నేర్చుకున్నాం. ఆయన బాటలోనే నడుస్తూ ఆయన ప్రేమను పొందగలిగాం. లోటస్‌పాండ్‌లో ఒకసారి రివ్యూ జరిగింది. గడప గడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమం నేను బాగా చేసానని ఆయన నన్ను మెచ్చుకున్నారు. కార్యకర్తలు అలసిపోయేవారు, రిపోర్టర్స్ అలసిపోయే వారు కాని నేను మాత్రం 600 గడపలు తిరిగేసే దాన్ని. అదే అందరికీ చెప్పాను. పర్సనల్ లైఫ్‌కి దూరమయ్యాం : పర్సనల్ లైఫ్ మొత్తం కిల్ అయిపోయింది. నాలు గు రోజులు ఎక్కడికైనా వెళ్ధామన్నా ఇక్కడ ఏమైపోతుందో, జనం ఎలా ఉన్నారోనన్న భయం. అందుకే ఎక్కడికీ వెళ్ళలేదు. పెళ్ళయిన తరువాత పొలిటికల్‌గా వెళ్ళడమే తప్ప పర్సనల్‌గా ఎక్కడికీ వెళ్ళలేదు. ఐదేళ్ళు కష్టపడితే తరువాత జగనన్న సీఎం అయితే చాలు అంతా హ్యాపీగా ఉంటాం. ఇంట్లో అమ్మాయిగా చూస్తారు గిరిజన ప్రాంతాలకు వెళ్తుంటే వాళ్ళింట్లో అమ్మా యి ఎమ్మెల్యే అయినట్టు ఫీలవుతారు. వాళ్ళ మధ్యలోనే కూర్చొని భోజనం చేస్తాను. వాళ్ళ సమస్యలు వింటుంటాను. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళం. అధికారులను బతిమాలైనా పనులు చేయించుకోవాలి. అలానే చేయిస్తున్నాను. పూర్ణపాడు, లాబేసు వంతెన 20 ఏళ్ల కిందట శంకుస్థాపన చేసి వదిలేశారు. దానికి నిధులు విడుదలయ్యేలా చేశాను. గడప గడపకు వెళ్ళడం, వారం రోజులు తిరగడం, ఆ ఫొటోలు అన్నీ కలిపి ఐటీడీఏ పీవోకి, కలెక్టర్‌కి ఇవ్వడం. ఇదే నా పని. జియ్యమ్మవలస మండలం చినతోలిమంద గిరిజన ఏరియాలో నా వల్లే రోడ్డు వచ్చిందని అక్కడి వారంతా నాకు చీరలు పరిచి తీసుకెళ్ళారు. చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే సాక్షిలో వచ్చిన ఓ ఫొటోను(డోలి కట్టి ఆస్పత్రికి తీసుకెళ్ళడం) అసెంబ్లీలో స్పీకర్ దృష్టికి తీసుకెళ్ళాను. కొమరాడ మండలం కల్లికోటకు వెళ్తే అక్కడి ఆడవాళ్ళు మాకు మంచినీటి సమస్య తీర్చమ్మా చాలు నిన్ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం అన్నారు. ఆ ఊరికి రూ.34 లక్షలు విడుదల చేయించాను. చినమేరంగిలో కూడా నీటిసమస్య తీర్చేందుకు రూ.25లక్షలు మంజూరు చేయించాను. ఇలా ఎన్నో చేస్తున్నాను. ఇవన్నీ ఒకెత్తయితే ఏ ఒక్కరికి కష్టం వచ్చినా నేనూ, పరీక్షిత్ ఎంత దూరమైనా వెళ్లి వారికి అండగా ఉంటాం. ఈ రోజు మా నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా నా పేరు తెలియని వారుండరు. జగన్ నా దైవం టీవీలో జగన్ పేరు వినిపిస్తే చాలు కదిలేదాన్నే కాదు. జగన్ జైలు నుండి విడుదలైన రోజే మా మదర్‌కి యాక్సిడెంట్ అయిం ది. మా అమ్మకోసం హాస్పిటల్లో ఫారాలు నింపాల్సిందీ నేనే. అయినా ఎవరి మాటలు వినకుండా టీవీ వద్దకు పరిగెత్తా. ఆయన ఫేస్ చూడకపోతే నా జన్మ వేస్ట్ అని పించింది. 16 నెలలు వెయిట్ చేశాం ఆయన కోసం. జగన్ మాకు దేవుడు. చాలా మంచి వ్యక్తి. అంత ఆప్యాయత ఏ లీడర్‌లోనూ చూడలేదు. ఆయనది చాలా గొప్ప వ్యక్తిత్వం. భార్యగానూ సక్సెస్ వాణి నాకు భార్యగా దొరకడం నా అదృష్టం. ముందుగా ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం వాళ్లది. అయినప్పటికీ ఒక పరిపూర్ణ పొలిటీషియన్‌కు ఉండాల్సిన అన్ని క్వాలిటీలు అమెలో ఉన్నాయి. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించడం, ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడటం ఆమెకున్న మంచి లక్షణం. ఎమ్మెల్యేగా ప్రజల కోసం ఎంతగా తపిస్తుందో, భార్యగా నా కోసం అంతే బాధ్యతగా మెలుగుతుంది. నాకు చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేదు. తనను ఎవరేమన్నా పెద్దగా పట్టించుకోదు. నన్నెవరైనా చిన్న మాట అంటే మాత్రం అస్సలు ఊరుకోదు. జగన్‌ను సీఎం చేయడమే మా ఇద్దరి ఏకైక లక్ష్యం.– శత్రుచర్ల పరీక్షిత్ రాజు,వైఎస్సార్సీపీ అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు -
'నేతలను, కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారు'
విజయనగరం: వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని అన్యాయంగా అరెస్టు చేశారంటూ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ నేతల నుంచి కార్యకర్తల వరకూ టార్గెట్ చేసి బలహీనపర్చాలనే ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి వ్యతిరేకంగా రైతులు పోరాటం చేస్తున్నారని అన్నారు. అధికారులు మాత్రం పరుగు పేరుతో గ్రామాల్లో ప్రజలను అశాంతి పరుస్తున్నారని విమర్శించారు. ఇదిలా ఉండగా, ఎమ్మెల్యే భూమా అరెస్ట్ ను కురుపాం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి ఖండించారు. -
ఏజెన్సీలో వైద్య సేవలు దుర్భరం
కురుపాం: నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతమండలాలైన గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, జియ్యమ్మవలస, కురుపాంలలో అరకొరగా వైద్య సిబ్బంది ఉండడంతో వైద్యసేవలు దుర్భరంగా ఉన్నాయని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి శుక్రవారం శాసనసభ క్వశ్చన్ అవర్‌లో ప్రశ్నించారు. ముఖ్యంగా గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో నలుగురు వైద్యాధికారులు ఉండాల్సి ఉన్నప్పటికీ కనీసం ఒక్కరు కూడా లేరని, దీంతో ఈ మధ్య పల్స్‌పోలియో చుక్కలు వికటించి 13 మంది గిరిజన చిన్నారులు తీవ్ర అస్వస్థకు గురయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో పూర్తిస్థాయి వైద్యాధికారులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, చివరకు క్షేత్రస్థాయి సిబ్బందే వైద్యసేవలు అందించడంతో చిన్నారులు ప్రాణాపాయస్థితి నుంచి బయట పడ్డారని తెలిపారు. అలాగే ఏజెన్సీలోని పీహెచ్‌సీలన్నింటిలోనూ సరైన సిబ్బంది, సదుపాయాలు లేక గిరిజనం ఎప్పుడు ఏ కష్టం వచ్చినా బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు చేతుల్లో పెట్టు కుని బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీలోని పీహెచ్‌సీలపై దృష్టిసారించి గిరిజన ప్రజలను ఆదుకోవాలని కోరారు. దీనిపై మంత్రి కామినేని శ్రీనివాసరావు స్పందిస్తూ ఏజెన్సీలో వైద్యసేవలపై తప్పని సరిగా దృష్టి సారిస్తానని, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.