వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని అన్యాయంగా అరెస్టు చేశారంటూ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి మండిపడ్డారు.
విజయనగరం: వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని అన్యాయంగా అరెస్టు చేశారంటూ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ నేతల నుంచి కార్యకర్తల వరకూ టార్గెట్ చేసి బలహీనపర్చాలనే ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.
ఎయిర్పోర్టు నిర్మాణానికి వ్యతిరేకంగా రైతులు పోరాటం చేస్తున్నారని అన్నారు. అధికారులు మాత్రం పరుగు పేరుతో గ్రామాల్లో ప్రజలను అశాంతి పరుస్తున్నారని విమర్శించారు. ఇదిలా ఉండగా, ఎమ్మెల్యే భూమా అరెస్ట్ ను కురుపాం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి ఖండించారు.