ఏలూరు అర్బన్ : ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీ మతాలకు చెందిన యువతీ యువకులకు పోలీస్ కానిస్టేబుల్, జైలు వార్డెన్ ఉద్యోగాలకు శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ హురియ ఖానమ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
కానిస్టేబుల్ ఉద్యోగాల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
Published Fri, Sep 2 2016 1:05 AM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM
ఏలూరు అర్బన్ : ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీ మతాలకు చెందిన యువతీ యువకులకు పోలీస్ కానిస్టేబుల్, జైలు వార్డెన్ ఉద్యోగాలకు శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ హురియ ఖానమ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్ పూర్తి చేసి 18 నుంచి 22 ఏళ్ల లోపు ఉండి కనీసం 167 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపిఎస్‌ఎమ్‌ఎఫ్‌సీ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకుని దరఖాస్తులను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏపీ స్టేట్ మైనార్టిస్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఏలూరు చిరునామాకు పంపాలన్నారు. మరిన్ని వివరాలకు 08812–242463, 9849901162 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు.
Advertisement
Advertisement