
శ్రీలంక శుభారంభం
టి20 ప్రపంచకప్‌లో శ్రీలంక బోణి చేసింది. దక్షిణాఫ్రికాతో శనివారం జరిగిన గ్రూప్ ‘1’ లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక ఐదు పరుగుల తేడాతో నెగ్గింది.
ఐదు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలుపు
టి20 ప్రపంచ కప్
చిట్టగాంగ్: టి20 ప్రపంచకప్‌లో శ్రీలంక బోణి చేసింది. దక్షిణాఫ్రికాతో శనివారం జరిగిన గ్రూప్ ‘1’ లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక ఐదు పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 165 పరుగులు చేసింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 160 పరుగులకే పరిమితమైంది. కుశాల్ పెరీరా (40 బంతుల్లో 61; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు)కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
పెరీరా, మాథ్యూస్ విజృంభణ
ఓపెనర్ కుశాల్ పెరీరా తొలి ఓవర్ నుంచే దూకుడు కొనసాగించాడు. స్టెయిన్ వేసిన మొదటి ఓవర్‌లో పెరీరా రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాది ప్రొటీస్ బౌలర్లకు హెచ్చరిక పంపాడు. అదేజోరులో పెరీరా 29 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. పెరీరా అవుటయ్యాక మాథ్యూస్ (32 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్) కదంతొక్కి లంకకు భారీ స్కోరు అందించాడు.
సఫారీ రనౌట్
దక్షిణాఫ్రికా 166 పరుగుల లక్ష్యాన్ని చేధించేలా కనిపించినా.. ఒత్తిడి ముందు మరోసారి చేతులెత్తేసింది. ఓపెనర్లు డి కాక్ (25), ఆమ్లా (23)తో పాటు డుమినీ (39), డివిలియర్స్ (24) రాణించారు. అయితే డివిలియర్స్ అవుటైన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఇక చివరి రెండు ఓవర్లలో 19 పరుగులు చేయాల్సి ఉండగా సఫారీ బ్యాట్స్‌మెన్‌ను బౌలర్లు కులశేఖర, మలింగ కట్టడి చేశారు. 19వ ఓవర్‌లో కులశేఖర బౌలింగ్‌లో బెహర్దీన్ అవుట్ కాగా... మలింగ వేసిన చివరి ఓవర్‌లో స్టెయిన్, మిల్లర్ రనౌటవడంతో సఫారీ విజయంపై ఆశలు వదులుకుంది.
స్కోరు వివరాలు
శ్రీలంక ఇన్నింగ్స్: కుశాల్ పెరీరా (సి) డివిలియర్స్ (బి) తాహిర్ 61; దిల్షాన్ (బి) స్టెయిన్ 0; జయవర్ధనే (సి) స్టెయిన్ (బి) మోర్నీ మోర్కెల్ 9; సంగక్కర (సి) సోట్‌సోబ్ (బి) తాహిర్ 14; మాథ్యూస్ (బి) స్టెయిన్ 43; చండిమాల్ (స్టంప్డ్) డి కాక్ (బి) తాహిర్ 12; తిషార పెరీరా (బి) మోర్నీ మోర్కెల్ 8; కులశేఖర నాటౌట్ 7; సేనానాయకే నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 165
వికెట్ల పతనం: 1-17; 2-42; 3-83; 4-106; 5-137; 6-152; 7-160. బౌలింగ్: స్టెయిన్ 4-0-37-2; సోట్‌సోబ్ 4-0-31-0; మోర్నీ మోర్కెల్ 4-0-31-2; డుమినీ 2-0-13-0; అల్బీ మోర్కెల్ 2-0-24-0; తాహిర్ 4-0-26-3.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డి కాక్ (బి) మలింగ 25; ఆమ్లా (సి) దిల్షాన్ (బి) సేనానాయకే 23; డుమినీ (సి) దిల్షాన్ (బి) సేనానాయకే 39; డివిలియర్స్ (సి) సంగక్కర (బి) మాథ్యూస్ 24; మిల్లర్ (రనౌట్) 19; అల్బీ మోర్కెల్ (సి) చండిమాల్ (బి) మెండిస్ 12; బెహర్దీన్ (సి) జయవర్ధనే (బి) కులశేఖర 5; స్టెయిన్ (రనౌట్) 0; మోర్నీ మోర్కెల్ నాటౌట్ 0; తాహిర్ నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 160
వికెట్ల పతనం: 1-32; 2-82; 3-110; 4-119; 5-133; 6-148; 7-151; 8-152. బౌలింగ్: కులశేఖర 3-0-23-1; మాథ్యూస్ 3-0-21-1; సేనానాయకే 4-0-22-2; మలింగ 4-0-29-1; తిషార పెరీరా 2-0-18-0; మెండిస్ 4-0-44-1.