6 పరుగులతో నెదర్లాండ్స్‌పై విజయం
తాహిర్‌కు 4 వికెట్లు
చిట్టగాంగ్: వరుసగా రెండో విజయంతో టి20 ప్రపం చకప్‌లో దక్షిణాఫ్రికా సెమీస్ అవకాశాలను మెరుగు పర్చుకుంది. గురువారం జరిగిన గ్రూప్-1 మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై నెగ్గింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులు చేసింది. ఆమ్లా (22 బంతుల్లో 43; 7 ఫోర్లు, 1 సిక్స్), డు ప్లెసిస్ (14 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే ఓ మోస్తరుగా ఆడారు. జమీల్ 5 వికెట్లు తీశాడు.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ 18.4 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ మైబర్గ్ (28 బంతుల్లో 51; 8 ఫోర్లు, 2 సిక్స్) ఇచ్చిన శుభారంభాన్ని మిగతా బ్యాట్స్‌మెన్ సద్వినియోగం చేసుకోలేకపోయారు. అయితే విజయానికి 72 బంతుల్లో 65 పరుగులు చేయాల్సిన దశలో డచ్ బ్యాట్స్‌మెన్‌ను తాహిర్ పూర్తిగా కట్టడి చేశాడు. దీంతో గెలవాల్సిన ఈ మ్యాచ్‌ను హాలండ్ చేజార్చుకుంది. 23 పరుగుల వ్యవధిలోనే ఆ జట్టు చివరి ఆరు వికెట్లు కోల్పోయింది. ఇమ్రాన్ తాహిర్ (4/21)కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం దక్కింది.
గట్టెక్కిన దక్షిణాఫ్రికా
Published Fri, Mar 28 2014 3:52 AM | Last Updated on Sat, Sep 2 2017 5:15 AM
Advertisement
Advertisement