‘మోరా’ దాటికి ఆరుగురు మృతి | Six Killed As Cyclone Mora Hits Bangladesh, Hundreds Of Thousands Evacuated | Sakshi
Sakshi News home page

‘మోరా’ దాటికి ఆరుగురు మృతి

Published Wed, May 31 2017 8:24 AM | Last Updated on Tue, Sep 5 2017 12:28 PM

Six Killed As Cyclone Mora Hits Bangladesh, Hundreds Of Thousands Evacuated

డాఖా: మోరా తుపాన్‌ బంగ్లాదేశ్‌పై విరుచుకుపడింది. తీరప్రాంతంలో పెను బీభత్సాన్ని సృష్టిస్తోంది. మంగళవారం ఈ తుపాన్‌ దాటికి దాదాపు ఆరుగురు మృతిచెందారు. వీరిలో ఒకరు తుపాన్‌ ఉధృతిని చూసి గుండెపోటుతో మరణించగా, మిగతా వారు ఇళ్లు, చెట్లు కూలిన ఘటనలో చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండడంతో బంగ్లా తీర ప్రాంతం అతలాకుతలం అవుతున్నారు.

పెద్దమొత్తంలో ఇళ్లు ధ్వంసంకావడంతో తీర ప్రాంతం నుంచి సుమారు 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. కొందరికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో రక్షణ కల్పించారు. తదుపరి సమాచారం వెలువరించే వరకు జాలర్లు ఎవరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఉత్తరదిశగా మోరా ప్రయాణిస్తోందని, బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో చిట్టగాంగ్‌ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చిట్టగాంగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. అణు శక్తిపై జరుగుతున్న సమావేశంలో పాల్గొనేందుకు వియన్నా వెళ్లిన బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement