Suryakumar Yadav Goes 26 an Over Hong Kong Match In Asia Cup 2022 - Sakshi
Sakshi News home page

Asia Cup 2022: 6 బంతుల్లో 26 పరుగులు.. విధ్వంసం సృష్టించిన సూర్యకుమార్‌! వీడియో వైరల్‌

Published Thu, Sep 1 2022 11:52 AM | Last Updated on Thu, Sep 1 2022 1:46 PM

Suryakumar Yadav goes 26 an over Hong kong match In Asia Cup 2022 - Sakshi

ఆసియా కప్‌-2022లో భాగంగా హాంగ్‌ కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ తుపాన్‌ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 26 బంతుల్లోనే 68 పరుగులు సాధించి సూర్య విధ్వంసం సృష్టించాడు.

అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, ఆరు సిక్స్‌లు ఉన్నాయి. కాగా కేఎల్‌ రాహుల్‌ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన సూర్య.. ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. విరాట్‌ కోహ్లితో కలిసి స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు.

ముఖ్యంగా భారత్‌ ఇన్నింగ్స్‌ అఖరి ఓవర్‌ వేసిన హరూన్ అర్షద్‌ను సూర్య రఫ్పాడించాడు. అతడి ఓవర్‌లో సూర్యకుమార్‌  ఏకంగా 26 పరుగులు రాబట్టాడు. దాంట్లో నాలుగు భారీ సిక్సర్లు కూడా ఉన్నాయి.

తొలి మూడు బంతులను సిక్సర్లగా మలిచిన సూర్య.. ఐదో బంతిని కూడా బౌండరీకి తరలించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో హాంగ్‌ కాంగ్‌పై భారత్‌ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సూర్యకి మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు లభించింది.


చదవండిAsia Cup 2022: నాడు కోహ్లి వర్సెస్‌ సూర్య! ఇప్పుడు సూర్యకు విరాట్‌ ఫిదా! తలవంచి మరీ! వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement