ప్రపంచంలోని అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీదారులలో ఒకటైన షియోమీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో చైనా కంపెనీ షియోమీ అడుగుపెట్టింది. వచ్చే దశాబ్దంలో ఈ రంగంలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడిని పెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 10 బిలియన్ యువాన్(1.52 బిలియన్ డాలర్లు) పెట్టుబడితో ప్రారంభ దశలో స్మార్ట్ ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారం కోసం ఒక అనుబంధ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు హాంకాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు తెలిపింది.
2035 నాటికి చైనాలో కొత్త వాహనాల అమ్మకాలలో సగం కొత్త ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జరుగుతాయని గత ఏడాది విడుదల చేసిన ఒక నివేదిక పేర్కొంది. అంతర్జాతీయంగా కూడా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు భవిష్యత్ లో భారీగా పెరుగుతాయనే నమ్మకంతో దానిని క్యాష్ చేసుకునేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఈ రంగంలో పెట్టుబడులు పెడుతున్నాయి. కస్టమర్ బేస్, తయారీ కేంద్రంగా ఇప్పటికే చైనా ముందంజలో ఉంది. షియోమీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లీ జున్ కొత్త ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారానికి అధిపతిగా పనిచేయనున్నారు. స్మార్ట్ మొబిలిటీలోకి అడుగుపెట్టిన ఈ సంస్థ ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయడానికి ఆటో తయారీదారు జెజియాంగ్ గీలీ హోల్డింగ్ గ్రూప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇప్పటికే చైనా బ్రాండ్లు ఎక్స్‌పెంగ్, లి ఆటో రెండూ ఈ రంగంలో పోటీ పడుతున్నాయి.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment