బీజింగ్: ప్రపంచంలోని అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీదారులలో ఒకటి, చైనీస్ స్మార్ట్‌ఫోన్, ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాల దిగ్గజం షావోమి మరో సంచలన నిర్ణయం దిశగా కదులుతోంది. ప్రస్తుతం కంపెనీ ఆటోమోబైల్ రంగంలోకి కూడా అడుగుపెట్టనుంది. అందులోనూ భాగంగా, ఎలక్ట్రిక్ వాహనాలకు పుంజుకుంటున్న ఆదరణను క్యాష్ చేసుకునేందుకు పావులు కదుపుతోంది. తాజా నివేదికల ప్రకారం షావోమీ త్వరలో ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు గ్రేట్ వాల్ మోటర్స్ డీల్ చేసుకోనుంది. ఈ భాగస్వామ్యంతో, సొంతంగా ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.
వీరు ఇరువురి మధ్య చర్చలు జరిగాయనే ఊహగానాలు రావడంతో షాంగై , హాంగ్‌కాంగ్ స్టాక్ మార్కెటులో గ్రేట్‌వాల్ కంపెనీ షేర్లు రాకెట్‌లా పైకి ఏగిశాయి. కాగా, గ్రేట్ వాల్ కంపెనీ ఇంతవరకు వేరే కంపెనీలకు మ్యానుఫాక్చరింగ్‌ను అందించలేదు. ఇరు కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో భాగస్వాములు అయ్యే విషయాన్ని వచ్చే వారం అధికారికంగా తెలుపనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇరు కంపెనీలు ఎలాంటి ధృవీకరణ ఇవ్వలేదు.
చైనా అతిపెద్ద ట్రక్ తయారీ సంస్థ గ్రేట్ వాల్ ఈ సంవత్సరం ఎలక్ట్రిక్, స్మార్ట్ వాహనాల కోసం తన సొంత బ్రాండ్‌ను విడుదల చేసింది. గ్రేట్ వాల్ కంపెనీ జర్మనీకి చెందిన బిఎమ్‌డబ్ల్యూతో కలిసి చైనాలో ఎలక్ట్రిక్ వాహనాల ఫ్యాక్టరీని నిర్మిస్తోంది.గత ఏడాది 1.11 మిలియన్ పి-సిరీస్ ట్రక్స్, ఓరా ఈవీ వాహనాలను గ్రేట్‌వాల్ విక్రయించింది. ప్రస్తుతం థాయిలాండ్‌లో తన మొదటి కర్మాగారాన్ని నిర్మిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment