బచ్చు క్రిష్ణారెడ్డి (ఫైల్)
రాజపురం (పోలాకి) : మండలంలోని రాజపురం గ్రామానికి చెందిన బచ్చు క్రిష్ణారెడ్డి (34) అనే యువకుడు ప్రమాదవశాత్తు హాంకాంగ్‌లో ఇటీవల మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. వృత్తిరీత్యా సీమెన్‌గా పని చేస్తున్న క్రిష్ణారెడ్డి ఆగస్టు 17వ తేదీన మృతి చెందినట్లు సమాచారం వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆరేళ్లుగా సీమెన్‌గా పని చేస్తున్న మృతుడు ఇంజిన్ ఫిట్టర్‌గా ఉద్యోగంలో చేరాడు. షిప్‌లో ఇంజిన్ ఎడ్జెస్ట్‌వాల్ సరిచేస్తుండగా ఇనుప హుక్ తలకు తగిలి ప్రమాదం జరిగిందని ముంబయిలోని సీజ్‌పాన్ షిప్పింగ్ కంపెనీ నుండి కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. అక్కడే పోస్టుమార్టం నివేదికలు పూర్తయ్యాయి. మృతదేహం రాజపురానికి గురువారం వచ్చే అవకాశం ఉంది. మృతునికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు.