
ఆసియాకప్‌లో భాగంగా పాకిస్తాన్‌పై విజయం సాధించిన జోష్‌లో ఉన్న టీమిండియా తన తర్వాతి మ్యాచ్‌లో పసికూన హాంకాంగ్‌తో తలపడనుంది. ఇప్పటివరకు ఆసియాకప్‌లో ఇరుజట్లు రెండుసార్లు తలపడ్డాయి. 2008లో ఒకసారి.. 2018లో రెండోసారి ఆడగా.. రెండింటిలోనూ టీమిండియాదే గెలుపు. అయితే హాంకాంగ్‌పై వచ్చిన రెండో విజయం మాత్రం అంత సులువుగా ఏం రాలేదు.
2018లో వన్డే ఫార్మాట్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో హాంకాంగ్.. టీమిండియాకు ముచ్చెమటలు పట్టించింది. దాదాపు ఓటమి అంచుల వరకు వెళ్లిన టీమిండియా.. చివరి నిమిషంలో విజయం సాధించి పరువు కాపాడుకుంది. అందుకే బుధవారం జరగనున్న మ్యాచ్‌లో హాంకాంగ్‌ను పసికూనే కదా అని తక్కువ అంచనా వేస్తే అంతే సంగతులు. అప్పటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 23 పరుగులు చేయగా శిఖర్ ధావన్ 120 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 127 పరుగులు చేశాడు. అంబటి రాయుడు 60, దినేశ్ కార్తీక్ 33, కేదార్ జాదవ్ 28 పరుగులు చేయగా ఎంఎస్ ధోనీ డకౌట్ అయ్యాడు.
అయితే 286 పరుగుల లక్ష్యఛేదనలో హంగ్ కాంగ్ ఓపెనర్లు అద్భుతంగా పోరాడారు. నిజకత్ ఖాన్ 92, అన్సీ రత్ 73 పరుగులు చేసి తొలి వికెట్‌కి 174 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.ఎంత మంది బౌలర్లను మార్చినా టీమిండియాకు 35వ ఓవర్ వరకూ వికెట్ దక్కలేదు. దీంతో హంగ్ కాంగ్ భారీ విజయం సాధించడం ఖామమనుకున్నారు. అయితే 34.1 ఓవర్లకు 174 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన హంగ్‌కాంగ్.. 50 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయి 259 పరుగులకి పరిమితమైంది. ఖలీల్ అహ్మద్, యజ్వేంద్ర చాహాల్ మూడేసి వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశాడు...
ఈ మ్యాచ్‌లో హాంగ్‌కాంగ్ ఓడినప్పటికి వారు చూపించిన పోరాటం అద్భుతం. ఆఖర్లో అనుభవం ఉన్న ఒక్క హిట్టర్ ఉన్నా టీమిండియా పని ఖేల్‌ఖతం అయ్యేదే. అందుకే హాంకాంగ్‌తో మ్యాచ్‌లో టీమిండియా జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉందని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.
చదవండి: Asia Cup 2022: కృష్ణమాచారి తెచ్చిన తంట.. మాజీ క్రికెటర్ బదానికి తీవ్ర గాయం!
AFG Vs BAN: అఫ్గన్‌తో మ్యాచ్.. అరుదైన ఘనత అందుకోనున్న బంగ్లా కెప్టెన్