హాంకాంగ్ : హాంకాంగ్‌లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న డబుల్ డెక్కర్ బస్సు అదుపుతప్పి చెట్టును బలంగా డీకొట్టడంతో ఐదుగురు మృతి చెందగా, 12 మంది మృత్యువాత పడ్డారు. బస్సు చెట్టును బలంగా ఢీకొట్టడంతో బస్సు పూర్తిగా ఒంగిపోవడంతో పాటు అద్దాలు పూర్తిగా ధ్వంసమై ప్రయాణికులు కూర్చున్న సీట్ల పక్కకు కుంచించికపోవడంతో చిందర వందరగా తయారైంది.దీంతో ప్రయాణికులను బయటికి తీయడం సాధ్యం కాకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు.
వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు బస్సు పైభాగం ద్వారా లోపలికి ప్రవేశించి మృతదేహాలను బయటికి తీశారు.ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారని, 12 మంది తీవ్ర గాయాలపాలయ్యారని పోలీసులు అధికారికంగా ధృవీకరించారు. ప్రమాదంలో చనిపోయిన ఐదుగురుని బ్లాక్‌బాక్స్‌ల్లో పెట్టి చైనాకు దగ్గర్లోని క్వాతుంగ్ ఆసుపత్రి మార్చురికీ తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, ప్రపంచంలోనే అత్యంత ఉత్తమమైన రవాణామార్గం కలిగిన హాంకాంగ్‌లో ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకోవడం దురదృష్టకరమని తెలిపారు. ఇంతకుముందు ఇదే తరహాలో ఫిబ్రవరి 2018లో అతివేగంతో వెళుతున్న డబుల్‌డెక్కర్ బస్సు ప్రమాదానికి గురవడంతో 19మంది మృత్యువాత పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment