
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రెండో దశలో కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తోంది. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. రోజు రోజుకు కరోనా ఉధృతి రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో హాంకాంగ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్-హాంకాంగ్‌మధ్య విమాన రాకపోకలను నిలిపివేయాలని హాంకాంగ్ విమానాయాన శాఖ నిర్ణయించింది. ముంబై నుంచి హాంకాంగ్ వెళ్లే విమానాలన్నింటినీ ఏప్రిల్ 20నుంచి మే2 వరకూ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. (దలాల్ స్ట్రీట్‌లో కరోనా ప్రకంపనలు)
భారత్‌నుంచి హాంకాంగ్ చేరుకున్న ప్రయాణికుల్లోనూ ముగ్గురికి వైరస్‌ఉందని తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం కీలక ప్రకటన వెల్లడించింది. అలాగే పాకిస్తాన్, ఫిలిప్పైన్స్ నుంచి వచ్చే విమానాలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది హాంకాంగ్. ఈ నెలలోనే రెండు విస్టారా విమానాల 50 మంది ప్రయాణికులు కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ కావడం గమనార్హం. ఆర్టీపీసీఆర్ ఫలితంలో 72గంటల ముందు నెగెటివ్ వస్తేనే ప్రయాణించాల్సి ఉంది. అంతకంటే ముందు ఢిల్లీ నుంచి హాంకాంగ్ వెళ్లే విమానాల్లోని ప్రయాణికులకు 47మంది వరకూ పాజిటివ్ వచ్చింది. దీంతో ఏప్రిల్ 6నుంచి ఏప్రిల్ 19వరకూ ఆ మార్గంలోని విమానాల రాకపోకలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. (కరోనా సెగ : రుపీ ఢమాల్)
Comments
Please login to add a commentAdd a comment