దుబాయ్: హోరాహోరీగా సాగిన పోరులో పాకిస్తాన్‌ను ఓడించిన భారత జట్టు పసికూనతో తర్వాతి మ్యాచ్‌కు సిద్ధమైంది. ఆసియా కప్ టి20 టోర్నీలో భాగంగా గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో నేడు హాంకాంగ్‌తో భారత్ తలపడుతుంది. ఏ రకంగా చూసినా టీమిండియాతో పోలిస్తే కనీస పోటీ ఇచ్చే స్థాయిలో కూడా ప్రత్యర్థి జట్టు లేదు. సరిగ్గా చెప్పాలంటే నెట్స్‌లో కాకుండా మైదానంలో భారత్‌కు ఇది ప్రాక్టీస్ మ్యాచ్‌లాగా భావించవచ్చు. టాప్–3 రోహిత్, రాహుల్, కోహ్లి దూకుడుగా ఆడి లయ అందుకునేందుకు ఈ మ్యాచ్ అవకాశం కల్పిస్తోంది.
గత మ్యాచ్‌లో తొలి బంతికే అవుటైన రాహుల్ కొద్దిసేపు క్రీజ్‌లో నిలిచేందుకు ఇది సరైన వేదిక. తొలి మ్యాచ్ ఫలితాన్ని బట్టి చూస్తే తుది జట్టులో మార్పులు ఉండరాదు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ తరచూ ప్రయోగాలు కొనసాగిస్తామని చెబుతున్నాడు కాబట్టి స్వల్ప మార్పులతో ఇతరులకు అవకాశం కల్పిస్తారా చూడాలి. పాక్‌తో మ్యాచ్‌లో కీపర్‌గా పంత్‌కు బదులు దినేశ్ కార్తీక్‌కు అవకాశం ఇవ్వడం ఆశ్చర్యం కలిగించింది. అదే కొనసాగిస్తారా లేక ఈ సారి పంత్‌ను ఆడిస్తారా అనేది ఆసక్తికరం. బౌలింగ్‌లో అవేశ్‌కు బదులుగా స్పిన్నర్లు అశ్విన్, రవి బిష్ణోయ్‌లలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. ఓవరాల్‌గా భారత జట్టు ఫలితంపైనే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనలపైన కూడా దృష్టి పెట్టింది.
మరోవైపు ఎక్కువగా భారత్, పాకిస్తాన్‌ల నుంచి వలస వచ్చిన వారితోనే హాంకాంగ్ జట్టు నిండి ఉంది. ఇరు జట్లు ఇప్పటి వరకు టి20ల్లో తలపడలేదు. రెండుసార్లు వన్డేల్లో ఆడగా రెండూ భారత్ గెలిచింది. అయితే 2018లో ఇదే ఆసియా కప్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ విధించిన 286 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చేరువగా వచ్చి 26 పరుగులతో ఓడింది. కొంత కాలంగా వరుసగా నమీబియా, ఉగాండా, జెర్సీలాంటి జట్లతోనే తలపడుతూ వచ్చిన హాంకాంగ్‌కు ప్రస్తుతం భారత్‌ను ఎదుర్కోవడమే వారికి లభించిన పెద్ద అవకాశం. హాంకాంగ్ విజయావకాశాలు కెప్టెన్ నిజాకత్ ఖాన్, బాబర్ హయత్, కించిత్ షా, ఆయుష్ శుక్లాలపై ఆధారపడి ఉన్నాయి.
చదవండి: IND Vs Hongkong: నాలుగేళ్ల క్రితం చెమటలు పట్టించారు.. లైట్ తీసుకుంటే అంతే!
Comments
Please login to add a commentAdd a comment