Watch: Man And Woman Fighting On Crowded Hong Kong Train Video Goes Viral - Sakshi
Sakshi News home page

షాకింగ్‌ వీడియో.. మెట్రో రైలులో మహిళపై పిడిగుద్దులు!

Published Thu, Dec 22 2022 3:05 PM | Last Updated on Thu, Dec 22 2022 4:02 PM

Man And Woman Fighting On Crowded Hong Kong Train Video Viral - Sakshi

హాంకాంగ్‌: ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైలులో ఓ వ్యక్తి మహిళపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. ఇరువురి మధ్య ఫైటింగ్‌ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ సంఘటన హాంకాంగ్‌లోని ఎంటీఆర్‌ ట్రైన్‌లో జరిగింది. 13 సెకన్ల నిడివిగల ఈ వీడియోలో బ్లాక్‌ డ్రెస్‌లో ఉన్న మహిళపై ఓ వ్యక్తి పిడిగుద్దులు కురిపిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మరో వ్యక్తి వారిని విడిపించేందుకు కలుగజేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఆ మహిళ తిరిగి దాడి చేసేందుకు యత్నించింది. 

రద్దీగా ఉన్న ట్రైన్‌లో ఒక్కసారిగా గొడవ జరిగి గందరగోళ పరిస్థితులు తలెత్తడంపై పలువురు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. ఇరువురు హోరాహోరీగా గొడవపడడం వల్ల పలువురు ప్రయాణికులు కిందపడిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ వీడియోను ‘టుడే రీవ్యూ67’ అనే ఫేస్‌బుక్‌ పేజీలో డిసెంబర్‌ 18న పోస్ట్‌ చేశారు. ఇప్పటికే ఈ వీడియోను 2లక్షల మందికిపైగా వీక్షించారు. అయితే, ఈ గొడవకు గల కారణాలు తెలియరాలేదు.

ఇదీ చదవండి: కోవిడ్‌ కొత్త వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement