MTR
-
షాకింగ్ వీడియో.. మెట్రో రైలులో మహిళపై పిడిగుద్దులు!
హాంకాంగ్: ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైలులో ఓ వ్యక్తి మహిళపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. ఇరువురి మధ్య ఫైటింగ్ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ సంఘటన హాంకాంగ్‌లోని ఎంటీఆర్ ట్రైన్లో జరిగింది. 13 సెకన్ల నిడివిగల ఈ వీడియోలో బ్లాక్ డ్రెస్‌లో ఉన్న మహిళపై ఓ వ్యక్తి పిడిగుద్దులు కురిపిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మరో వ్యక్తి వారిని విడిపించేందుకు కలుగజేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఆ మహిళ తిరిగి దాడి చేసేందుకు యత్నించింది. రద్దీగా ఉన్న ట్రైన్లో ఒక్కసారిగా గొడవ జరిగి గందరగోళ పరిస్థితులు తలెత్తడంపై పలువురు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. ఇరువురు హోరాహోరీగా గొడవపడడం వల్ల పలువురు ప్రయాణికులు కిందపడిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ వీడియోను ‘టుడే రీవ్యూ67’ అనే ఫేస్బుక్ పేజీలో డిసెంబర్ 18న పోస్ట్ చేశారు. ఇప్పటికే ఈ వీడియోను 2లక్షల మందికిపైగా వీక్షించారు. అయితే, ఈ గొడవకు గల కారణాలు తెలియరాలేదు. ఇదీ చదవండి: కోవిడ్ కొత్త వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన! -
ఫుడ్ తయారీ సంస్థలో కరోనా కలకలం
బెంగుళూరు: ప్రముఖ రెడీ టూ ఈట్ ఇన్స్టంట్ ఫుడ్ సంస్థ ‘ఎంటీఆర్ ఫుడ్స్’ కంపెనీలో కరోనా కలకలం రేగింది. వివరాల ప్రకారం.. కర్ణాటక లోని బొమ్మసాంద్రలో గల ఎంటీఆర్ ఫుడ్స్ తయారీ పరిశ్రమలో ఏకంగా 40 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో ఫ్యాక్టరీని మరి కొంతకాలం మూసివేస్తున్నట్లు ప్రకటించింది. జూలై 6న ఫ్యాక్టరీలో మొట్టమొదటి కరోనా కేసు నమోదవగా వెంటనే కంపెనీని మూసివేసి శానిటైజేషన్ నిర్వహించారు. జూలై 10న ఫ్యాక్టరీ తెరవాలని భావించినా కాంట్రాక్ట్ ట్రేసింగ్‌లో భాగంగా మిగతా ఉద్యోగులకు కూడా కరోనా నిర్ధారణ అయినట్లు తేలింది. ఇప్పటివరకు ఫ్యాక్టరీలో పనిచేసే 40 మందికి కరోనా వచ్చిందని యాజమాన్యం ప్రకటించింది. దీంతో ఈనెల 20 వరకు ఫ్యాక్టరీని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఉద్యోగుల భద్రత, శ్రేయస్సే తమకు ప్రథమ కర్తవ్యం అని ఓ ప్రకటన జారీ చేసింది. (సీఎం కార్యాలయం బయట వ్యక్తి ఆందోళన ) వివిధ సూపర్ మార్కెట్లలో ఎంటీఆర్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నందున ఏం చేయాలన్న ప్రశ్నలు వెల్లువెత్తాయి. దీనిపై కంపెనీ సీఈవో స్పందిస్తూ ప్రజలెవరూ దీనిపై ఆందోళన చెందవద్దని మనుషుల ప్రమేయం లేకుండా యంత్రాల సహాయంతో ఫుడ్ ప్యాకెజింగ్ చేస్తామని తెలిపారు. తమ ఉత్పత్తులన్నీ మనిషి స్పర్శతో సంబంధం లేకుండా ఆటోమేటెడ్ లైన్లలో తయారు చేయబడతాయని పేర్కొన్నారు. బెంగళూరులో లాక్డౌన్ అనంతరం తిరిగి కార్యకలాపాలు ప్రారంభిస్తామని వెల్లడించారు. రాష్ర్టంలో ఓ ప్రముఖ కంపెనీలో వైరస్ కలకలం రేగడం ఇది కొత్తేమి కాదు. ఇంతకుముందు మైసూరు నంజన్‌గూడ్‌లోని జూబిలెంట్ లైఫ్ సైన్స్ ఫార్మా కంపెనీలో 50 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అదే విధంగా బళ్లారి జిల్లాలో ఓ స్టీల్ ప్లాంట్‌లో ఏకంగా 200 మంది కార్మికులకు కరోనా సోకింది. రాష్ర్ట వ్యాప్తంగా కరోనా కేసులు అధికమవుతున్నందున బెంగుళూరులో ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. (‘లక్షణాలు లేకుంటే ఓకే’) -
ఎపి,తెలంగాణ మార్కెట్లో సైసీ సాంబర్ పోడులు
-
ఈ ఏడాది రూ.1,000 కోట్లు టార్గెట్
ఎంటీఆర్ ఫుడ్స్ సీఈవో సంజయ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీ ఎంటీఆర్ ఈ ఏడాది రూ.1,000 కోట్ల టర్నోవర్‌ను లక్ష్యంగా చేసుకుంది. 2016లో కంపెనీ రూ.800 కోట్ల టర్నోవర్ సాధించింది. ఇందులో రూ.140 కోట్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సమకూరింది. మూడేళ్లలో తెలుగు రాష్ట్రాల వాటాను రెండింతలకు చేరుస్తామని ఎంటీఆర్ ఫుడ్స్ సీఈవో సంజయ్ శర్మ తెలిపారు. గురువారమిక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్పైసీ సాంబార్ పౌడర్‌ను విడుదల చేసిన సందర్భంగా ఎంటీఆర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ రెజి మాథ్యూతో కలిసి మీడియాతో మాట్లాడారు. కర్ణాటక తర్వాత కంపెనీకి అధిక ఆదాయాన్ని అందిస్తున్న తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేశామని, ఇందులో భాగంగానే నూతన ఉత్పాదనను పరిచయం చేశామన్నారు. 1,500 మంది కస్టమర్ల ఆమోదం తర్వాత స్పైసీ సాంబార్ పౌడర్‌ను విడుదల చేసినట్టు చెప్పారు. ఈ రెండు రాష్ట్రాల్లో 1.50 లక్షల దుకాణాల్లో సంస్థ ఉత్పత్తులు లభిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ–కామర్స్ ద్వారా కూడా కంపెనీ ప్రొడక్టులను అమ్ముతోంది. -
నోరూరిస్తున్న రెడీ టు ఈట్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెడీ టు ఈట్.. నిముషాల్లో సిద్ధం చేసుకునే వీలున్న ఫుడ్. అందుబాటు ధర, సౌలభ్యం, నెలల తరబడి మన్నికకుతోడు నోరూరించే వేలాది రుచులు. వెరశి ఈ ఉత్పత్తులకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. ఏటా 30 శాతం దాకా వద్ధి నమోదు చేస్తుండడంతో దిగ్గజ కంపెనీలూ ఈ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. వినియోగం విషయంలో దక్షిణాది రాష్ట్రాలే ముందంజలో ఉండడం విశేషం. ఇక భారత్ రుచులతో తయారైన రెడీ టు ఈట్ ఉత్పత్తులకు విదేశీయులూ దాసోహం అంటున్నారు. వేలాది ఉత్పత్తులు..: ప్రస్తుతం భారత్‌లో 6,000 పైచిలుకు రెడీ టు ఈట్ ఉత్పత్తులు లభిస్తున్నాయని సమాచారం. వీటిలో వెజ్ రకాలు 80 శాతముంటాయి. యువతరం విభిన్న రుచులను కొరుకుంటోందని ఎంటీఆర్ ఫుడ్స్ సీఈవో సంజయ్ శర్మ తెలిపారు. ఇందుకోసం ఎంతైనా వెచ్చిస్తున్నారని అన్నారు. ఈ తరం యువతలో అత్యధికులకు వంట చేయడం రాదని, వీరంతా ప్యాకేజ్డ్ ఫుడ్‌పై ఆధారపడుతున్నారని వివరించారు. రెస్టారెంట్ల విషయానికి వస్తే చేయి తిరిగిన వంట వారి కొరత దేశవ్యాప్తంగా ఉంది. ఒక్క ముంబై నగరంలోనే ఐదేళ్లలో 180కి పైగా రెస్టారెంట్లు మూతపడ్డాయని ఉడుపి రుచి బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్న శ్రీ ఫ్యామిలీ గ్రూప్ డైరెక్టర్ ఎస్.ఆర్.రావు సాహిబ్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. హోటళ్లలో సైతం రెడీ టు ఈట్ ఉత్పత్తుల వాడకం పెరిగిందన్నారు. దక్షిణాది ముందంజ..: ఈ ఉత్పత్తుల వాడకంలో దక్షిణాది రాష్ట్రాలే అగ్ర స్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత మహారాష్ట్ర నిలిచింది. ప్రధానంగా మెట్రో నగరాలే ముం దుంటున్నాయి. ఇప్పుడిప్పుడు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కూడా వినియోగం పెరిగింది. రెడీ టు ఈట్ విభాగంలో అల్పాహార ఉత్పత్తుల వాటాయే అధికం. రవ్వ ఇడ్లీ, రవ్వ దోశ టాప్‌లో నిలిచాయి. స్వీట్స్‌లో గులాబ్ జామూన్ ఏకచత్రాధిపత్యం కొనసాగిస్తోంది. రైస్ ఐటెమ్స్‌లో పులిహోరకు అగ్రస్థానం లభిస్తోంది. రైస్ ఐటెమ్స్ ను అత్యధికంగా దక్షిణాది కస్టమర్లు కోరుకుంటున్నారు. ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, బీహార్‌లో వీటికి కొద్ది డిమాండ్ ఉంది. ఎగుమతులు రూ.2,000 కోట్లు అంతర్జాతీయంగా వడ, ఇడ్లీ, సాంబార్, దోశ, ఉప్మ టాప్ జాబితాలో స్థానం సంపాదించాయి. సింగపూర్, హాంగ్‌కాంగ్, దుబాయి, యూకే, యూఎస్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో భారత రెడీ టు ఈట్ ఉత్పత్తులకు సమున్నత స్థానం ఉంది. రుచికరంగా ఉండడం, వేలాది రకాల లభ్యత ఇందుకు కారణం. ఎంటీఆర్ 30కిపైగా దేశాలకు ఎగుమతి చేస్తోంది. అన్ని బ్రాండ్లు కలిపి భారత్ నుంచి ఎగుమతుల విలువ రూ.2,000 కోట్లుంది. ఇదీ మార్కెట్..: భారత్‌లో రెడీ టు ఈట్ పరిశ్రమలో 15 కంపెనీల దాకా ప్రముఖంగా పోటీపడుతున్నాయి. అలాగే ఈ రంగంలో చిన్నా చితకా కంపెనీలు, చిరు వ్యాపారులు వేలల్లో ఉంటారు. నెస్లే, ఎంటీఏఆర్, ఐటీసీ, బాంబినో, కోహినూర్ ఫుడ్స్, హల్దీరామ్స్, ఉడుపి రుచి, సూర్య, మదర్స్ రెసిపీ వంటి బ్రాండ్లు పోటీపడుతున్నాయి. ఎఫ్ఎంసీజీ దిగ్గజం బ్రిటానియా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. హైదరాబాద్‌కు చెందిన 24 లెటర్ మంత్ర సైతం ఎంట్రీ ఇచ్చింది. ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నాణ్యత ప్రమాణాల నిబంధనల అమలు కఠినతరం చేస్తోంది. దీంతో నాణ్యతకు పెద్ద పీట వేసే వ్యాపారులు, కంపెనీలు మాత్రమే నిలుస్తాయి. ఇక దేశవ్యాప్తంగా ప్రస్తుతం రూ.13,500 కోట్ల వ్యాపారం జరుగుతోంది. వార్షిక వృద్ధి రేటు 25–30 శాతముంది. విపణిలో 80 శాతం అవ్యవస్థీకృత రంగానిదే. ఆన్లైన్ కొనుగోళ్ల వాటా 1 శాతముంది. -
హైదరాబాద్ మార్కెట్లోకి ఎంటీఆర్ ''స్నాక్అప్'' స్నాక్స్
హైదరాబాద్: దేశీ ప్యాకేజ్డ్ ఫుడ్స్ అగ్రగామి ఎంటీఆర్ తాజాగా ‘స్నాక్అప్’ స్నాక్స్‌ను హైదరాబాద్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇవి 16 రుచుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. కర్నాటక మార్కెట్లో విజయవంతమైన స్నాక్అప్ శ్రేణిని ఇప్పుడు హైదరాబాద్‌లో ప్రవేశపెడుతున్నామని, ఇక్కడి ప్రజలు కూడా తమ ఉత్పత్తులను ఆదరిస్తారని ఎంటీఆర్ ఫుడ్స్ సీఈవో సంజయ్ శర్మ తెలిపారు. 180 గ్రాముల ప్యాక్ ధర రూ.60గా ఉంటుందని పేర్కొన్నారు. ‘స్నాక్అప్’ స్నాక్స్ దగ్గరిలోని దుకాణాల్లో, ఆధునిక ట్రేడ్ స్టోర్లలోనూ వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. -
ఇక రైళ్లలోనూ హైదరాబాదీ బిర్యానీ
న్యూఢిల్లీ: రైల్వే బడ్జెట్లో ప్రకటించినట్లుగా ముందుగానే వండి తినేందుకు సిద్ధంగా ఉండే ఆహారాన్ని రైళ్లలో సరఫరా చేసేందుకు ఐటీసీ, ఎంటీఆర్, హల్దీరామ్ వంటి అగ్రశ్రేణి క్యాటరింగ్ సంస్థలను రంగంలోకి దించినట్లు రైల్వే అధికారి ఒకరు వివరించారు. చికెన్ చెట్టినాడ్, హైదరాబాదీ బిర్యానీ, సాంబార్ అన్నం, రాజ్మా చావల్ తదితర వంటకాలను రాజధాని, దురంతో, శతాబ్ది సహా ఆరు రైళ్లలో వారంపాటు ప్రయోగాత్మకంగా అందిస్తామన్నారు. ప్యాకింగ్ చేసి ఉండే ఈ వంటకాలను వడ్డించేందుకు ముందుగా మైక్రోవేవ్ ఓవెన్లో వేడి చేస్తే సరిపోతుందన్నారు. ఈ విధానంపై ప్రయాణికుల నుంచీ వచ్చే స్పందననుబట్టి ఇతర రైళ్లలో అందుబాటులోకి తెస్తామన్నారు.