Asia Cup 2022: Virat Kohli Sweats Out In Gym Ahead Hong Kong Match - Sakshi
Sakshi News home page

Virat Kohli: హాంకాంగ్‌తో మ్యాచ్‌.. జిమ్‌లో కష్టపడుతున్న కోహ్లి

Published Tue, Aug 30 2022 8:40 PM | Last Updated on Tue, Aug 30 2022 9:04 PM

Asia Cup 2022: Virat Kohli Sweats Out In Gym Ahead Hong Kong Match - Sakshi

Photo Credit: Virat Kohli Twitter

పాకిస్తాన్‌పై విజయంతో టీమిండియా ఆసియాకప్‌ను ఘనంగా ప్రారంభించింది. ఆఖరి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యా చివరి వరకు నిలబడి మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు. కాగా ఇదే మ్యాచ్ కోహ్లికి వందో టి20 అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే కోహ్లి తన వందో మ్యాచ్‌లో 34 బంతుల్లో 35 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఫిప్టీ చేయడంలో విఫలమైనప్పటికి విజయంలో తన వంతు పాత్రను సమర్థంగా పోషించాడు.

ఇక బుధవారం హాంకాంగ్‌తో మ్యాచ్‌ నేపథ్యంలో కోహ్లి జిమ్‌లో కసరత్తులు చేస్తున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. జిమ్‌లో గంటపాటు కసరత్తులు చేసిన కోహ్లి.. దానికి సంబంధించిన ఫోటోలను స్వయంగా ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ''హాంకాంగ్‌తో మ్యాచ్‌కు సిద్ధం''.. అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. ఇక అంతకముందు పాకిస్తాన్‌తో మ్యాచ్‌ ముగిసిన అనంతరం పాక్‌ పేసర్‌ హారిస్‌ రౌఫ్‌కు తన జెర్సీని గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ చర్యతో కోహ్లి అభిమానుల మనసులు కూడా గెలుచుకున్నాడు.

చదవండి: US Open 2022: యూఎస్‌ ఓపెన్‌లో పెను సంచలనం.. 87 ఏళ్ల రికార్డు బద్దలు

Asia Cup 2022: కృష్ణమాచారి తెచ్చిన తంట.. మాజీ క్రికెటర్‌ బదానికి తీవ్ర గాయం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement