stunt choreographer
-
గగుర్పాటు కలిగించే ఘటన.. ఎత్తైన భవనంపై సాహసం.. అంతలోనే పట్టుతప్పి..
హాంగ్‌కాంగ్: డేర్‌డెవిల్ గా పేరొందిన 30 ఏళ్ల రెమీ లుసిడి ఎత్తైన భవనం అంచున నిలబడి వీడియో తీసుకునే సాహసం చేస్తుండగా పట్టుతప్పి జారిపోయాడు. 68వ అంతస్తు నుండి కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. లుసిడి చనిపోయిన స్పాట్ నుండి కెమెరాను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ఘటన హంగ్ కాంగ్ లోని ట్రెజుంటర్ టవర్ దగ్గర జరిగింది. రెమీ లుసిడి ఒళ్ళు గగుర్పొడిచే సాహసాలు చేసే ఓ బ్లాగర్. అతను చేసే సాహసాలంన్నిటినీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇదే క్రమంలో హాంగ్‌కాంగ్‌లోని ట్రెగుంటర్ టవర్ కాంప్లెక్స్ భవనంపైకి ఎక్కి వీడియో తీసుకోవాలని సంకల్పించాడు. అనుకుంది తడవు ఆ కాంప్లెక్స్ కి వెళ్లి 40వ అంతస్తులో తన ఫ్రెండుని కలవడానికి వెళ్తున్నానని చెప్పి సెక్యూరిటీ కళ్ళుగప్పి బిల్డింగ్‌లోకి ప్రవేశించాడు. BREAKING NEWS: Tragic Death of Fearless Instagram Daredevil in Hong Kong High-Rise IncidentIn a heartbreaking incident that shocked the world of extreme sports, Remi Lucidi, a 30-year-old French daredevil renowned for his high-rise stunts, lost his life after falling from the… pic.twitter.com/9jYKnrgVVt— URECOMM (@URECOMM) July 30, 2023 తీరా అతను చెప్పింది వాస్తవం కాదని సెక్యూరిటీ వారికి తెలిసే సమయానికే లుసిడి సీసీటీవీ ఫుటేజిలో 49వ అంతస్తులో బిల్డింగ్‌పైకి వెళ్లే మెట్లు ఎక్కుతూ కనిపించాడు. చివరిగా అతను 7.38 నిముషాలకు పెంట్ హౌస్ బయట కిటికీ తలుపు తడుతూ తాను ప్రమాదంలో ఉన్నట్లు చెప్పబోయాడని అందులో పని చేసే ఒకామె తెలిపింది. అంత ఎత్తు నుండి పడిపోవడంతో లుసిడి అక్కడికక్కడే చనిపోయాడని పోలీసులు తెలిపారు. స్పాట్లో లుసిడి కెమెరాను కనుగొన్న పోలీసులు అందులో కళ్లుచెదిరే సాహసాలకు సంబంధించిన అతడి వీడియోలు ఉన్నట్లు.. బలహీనమైన గుండె కలవారు వాటిని చూడలేరని తెలిపారు. లుసిడి మరణానికి గల కారణం ఏంటనేది మాత్రం వారు చెప్పలేదు. గతంలో లుసిడి చాలా సాహస కృత్యాలు చేశాడు. పారిస్ లోని ఈఫిల్ టవర్ తో పాటు దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా పైకి ఒట్టి చేతులతో ఎక్కి ఫోటోలు తీసుకున్నాడు. చివరిసారిగా హంగ్ కాంగ్ లో లుసిడి తీసుకున్న ఫోటోను కింది ట్వీట్ లో చూడవచ్చు. #STUPIDITY gets you #KILLED #Daredevil #Remi #lucidi , 30, known for Instagram #stunts dies after falling 721ft from the top of a 68-story #Hong #Kong #skyscraper - having posted final photo from another high-rise pic.twitter.com/ooMDorcFdB— NEWS-ONE 🏴 (@NEWSONE14898745) July 31, 2023 ఇది కూడా చదవండి: పాలస్తీనా శరణార్ధుల శిబిరంలో అల్లర్లు.. ఐదుగురు మృతి -
ప్రముఖ ఫైట్ మాస్టర్ అరెస్ట్.. అలా చేయడంతో!
Kanal Kannan Arrest: తెలుగు, తమిళంలో పలు సినిమాలకు ఫైట్ మాస్టర్‌గా పనిచేసిన కనల్ కన్నన్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. నాగర్ కోయిల్‌కి చెందిన సైబర్ క్రైమ్ పోలీసులు.. ఈయన్ని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. కొన్నిరోజుల ముందు ఓ వీడియో పోస్ట్ చేసిన ఈయన.. ఓ మతం వాళ్ల మనోభావాలు దెబ్బతీశాడు. ఈ కారణంగానే ఇప్పుడు జైల్లో ఉన్నాడు. (ఇదీ చదవండి: ఏంటి ‘బ్రో’.. బేరం కుదర్లేదటగా!) సోషల్ మీడియా వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో, అంతే నష్టం కూడా ఉంటుంది. ఫొటోలు, వీడియోలు చూడటం వరకు బాగానే ఉంటుంది కానీ వాటికి లైక్ కొట్టి, షేర్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇరకాటంలో పడే సందర్భాలు చాలా ఎక్కువ. కొన్నిసార్లు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫైట్ మాస్టర్ కనల్ కన్నన్ కూడా ఇలానే ఓ యువతితో పాస్టర్ డ్యాన్స్ చేస్తున్న వీడియోని గత నెల 18వ తేదీన తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వేరే దేశానికి సంబంధించినది అయినప్పటికీ, దాన్ని కనల్ కన్నన్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఇది సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో సోమవారం ఈయన్ని అదుపులోకి తీసుకున్నారు. కనల్ కన్నన్‌కి ఇలా అరెస్ట్ కావడం కొత్తేం కాదు. గతంలోనూ సోషల్ యాక్టివిస్ట్ పెరియార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలుపాలయ్యాడు. (ఇదీ చదవండి: ఈ నటిని గుర్తుపట్టారా? ఇంతలా మారిపోయిందేంటి!) -
Yashoda: డూప్ లేకుండా సమంత యాక్షన్ సీన్స్.. మేకింగ్ వీడియో వైరల్
సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'యశోద'. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన 'యశోద' థియేట్రికల్ ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ లభిస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ... అన్ని భాషల్లో, దేశంలోని అన్ని ప్రాంతాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సినిమాపై ట్రైలర్ అంచనాలు పెంచింది. నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో డూప్ లేకుండా సమంత యాక్షన్ సీన్స్ చేశారు. ఈ రోజు యాక్షన్ సీన్స్ మేకింగ్ వీడియో విడుదల చేశారు. సమంత డెడికేషన్, సినిమాలో యాక్షన్ సీన్స్ గురించి ఆ వీడియోలో యానిక్ బెన్ మాట్లాడారు. 'యశోద' యాక్షన్ కొరియోగ్రాఫర్లలో ఒకరైన యానిక్ బెన్ మాట్లాడుతూ ''నేనెప్పుడూ యాక్టర్ సేఫ్‌గా ఉండేలా చూసుకుంటాను. వాళ్ళకు యాక్షన్ కొరియోగ్రఫీ పర్ఫెక్ట్గా తెలియాలి. అందుకని, ముందుగా స్టంట్ పెర్ఫార్మర్లతో ఫైట్ కంపొజిషన్ చూపిస్తాం. నటీనటులకు ట్రైనింగ్ ఇస్తాం. అందువల్ల, వాళ్ళకు టైమింగ్ తెలుస్తుంది. ఆ తర్వాత ఫైట్ తీస్తాం. సమంత చాలా డెడికేటెడ్‌గా షూటింగ్ చేస్తారు. ప్రతిసారి తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఆమెతో షూటింగ్ చేయడం బాగుంటుంది. యాక్షన్ ఎప్పుడూ రియల్‌గా ఉండటం నాకు ఇష్టం. 'యశోద'లో స్టంట్స్ కూడా రియల్‌గా ఉంటాయి. రియల్ లైఫ్‌లో ఎలా జరుగుతుందో... 'యశోదలో యాక్షన్ కూడా అలాగే రియలిస్టిక్‌గా ఉంటుంది. కిక్ బాక్సింగ్, జూడో , మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్... 'యశోద' యాక్షన్ సీన్స్‌లో ఉంటాయి' అని అన్నారు. సమంత నటించిన తొలి వెబ్ సిరీస్ 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' కు యానిక్ బెన్ వర్క్ చేశారు. తెలుగులో తెలుగులో పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది', మహేష్ బాబు 'వన్ నేనొక్కడినే' చిత్రాలకు కూడా యానిక్ బెన్ పని చేశారు. -
మీలో ఆ టాలెంట్ ఉంటే.. ప్రభాస్ సినిమాలో ఛాన్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. ఇటీవలె రాధేశ్యామ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ చేతిలో ఇప్పుడు వరుస ప్రాజెక్టులు ఉన్నాయి. ఆది పురుష్, సలార్ షూటింగులతో బిజీగా ఉన్న ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎక్కువగా కొత్తవారికి ఛాన్స్ ఇచ్చేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలుమార్లు క్యాస్ట్ కాలింగ్ అంటూ ఆడిషన్స్‌కు పిలుపునిచ్చిన ప్రాజెక్ట్ కే.. తాజాగా మరోసారి టాలెంట్ ఉన్న వారిని తమ సినిమాలో నటించేందుకు అవకాశం కల్పించింది. మార్షల్ ఆర్ట్స్‌లో టాలెంట్ ఉన్నవారు, పార్కౌట్ ప్లేయర్స్, న్యూ ఏజ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ఉంటే టీంను సంప్రదించాలను కోరుతూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. Come on board and let's create #ProjectK together.#Prabhas @SrBachchan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/gP5J0i2SV3 — Vyjayanthi Movies (@VyjayanthiFilms) April 21, 2022 -
దర్శకుడిగా మారుతున్న స్టంట్ కొరియోగ్రాఫర్
తిరువనంతపురం: స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ మెగా ఫోన్ పట్టేందుకు సిద్ధమవుతున్నాడు. మాలీవుడ్ మెగాస్టార్ మోహన్‌లాల్‌ను డైరెక్ట్ చేయనున్నాడు. పీటర్ చెప్పిన కథ నచ్చడంతో అతడి దర్శకత్వంలో నటించేందుకు మోహన్‌లాల్ అంగీకరించినట్టు మాలీవుడ్ సమాచారం. భారీ బడ్జెట్‌తో బహుభాషా చిత్రంగా దీన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దేశంలోని అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పనిచేయనున్నారు. ఇంతకుముందు మోహన్‌లాల్ హీరోగా నటించిన పులి మురుగన్(మన్యం పులి) సినిమాకు పీటర్ హెయిన్స్ స్టంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేశాడు. ఈ సినిమా మలయాళంలో రూ.150 కోట్లు వసూలు చేసిన తొలి చిత్రంగా నిలిచింది. ఈ సినిమా పీటర్స్ హెయిన్స్‌కు జాతీయ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. మగధీర, రోబో, బాహుబలి, బాహుబలి 2 వంటి విజయవంతమైన సినిమాలకు పీటర్ పనిచేశాడు. మోహన్‌లాల్ తాజా చిత్రం ‘విలన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్న మహాభారతంలో ఆయన ముఖ్యపాత్ర పోషించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి రానుంది.