దర్శకుడిగా మారుతున్న స్టంట్ కొరియోగ్రాఫర్
తిరువనంతపురం: స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ మెగా ఫోన్ పట్టేందుకు సిద్ధమవుతున్నాడు. మాలీవుడ్ మెగాస్టార్ మోహన్‌లాల్‌ను డైరెక్ట్ చేయనున్నాడు. పీటర్ చెప్పిన కథ నచ్చడంతో అతడి దర్శకత్వంలో నటించేందుకు మోహన్‌లాల్ అంగీకరించినట్టు మాలీవుడ్ సమాచారం. భారీ బడ్జెట్‌తో బహుభాషా చిత్రంగా దీన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దేశంలోని అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పనిచేయనున్నారు.
ఇంతకుముందు మోహన్‌లాల్ హీరోగా నటించిన పులి మురుగన్(మన్యం పులి) సినిమాకు పీటర్ హెయిన్స్ స్టంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేశాడు. ఈ సినిమా మలయాళంలో రూ.150 కోట్లు వసూలు చేసిన తొలి చిత్రంగా నిలిచింది. ఈ సినిమా పీటర్స్ హెయిన్స్‌కు జాతీయ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. మగధీర, రోబో, బాహుబలి, బాహుబలి 2 వంటి విజయవంతమైన సినిమాలకు పీటర్ పనిచేశాడు. మోహన్‌లాల్ తాజా చిత్రం ‘విలన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్న మహాభారతంలో ఆయన ముఖ్యపాత్ర పోషించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి రానుంది.