Peter Hein
-
హీరోగా ఎంట్రీ ఇస్తున్న 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' ఫైట్ మాస్టర్
ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోలు చేస్తున్న నటులు పెరుగుతున్నారు. దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు.. ఇలా అందరూ హీరోలు అయిపోతున్నారు. తాజాగా ప్రముఖ ఫైట్‌మాస్టర్ పీటర్ హెయిన్ కూడా కథానాయకుడిగా ఎంట్రీకి రెడీ అయిపోయాడు. ఎం.వెట్రి దర్శకత్వం వహించనున్న ఈ భారీ యాక్షన్ ఓరియెంటెడ్ కథాచిత్రాన్ని ట్రెండ్స్ సినిమాస్ అధినేత జేఎం బషీర్, యంటీ సినిమాస్ అధినేత ఏఎం చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గురువారం సాయంత్రం చైన్నెలో పూజా కార్యక్రమంతో లాంఛనంగా ప్రాజెక్ట్ ప్రారంభమైంది. (ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా) నిర్మాతల్లో ఒకరైన బషీర్ మాట్లాడుతూ.. నేను, నా మిత్రుడు చౌదరి కలిసి ఫైట్‌మాస్టర్ పీటర్ హెయిన్ని హీరోగా పరిచయం చేస్తూ ఒక భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తీయాలని చాలాకాలంగా అనుకుంటున్నాం. అది ఇప్పటికి నెరవేరింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల్లో పీటర్ హెయిన్ భాగమే. ఇప్పుడు ఆయన హీరోగా పాన్ ఇండియా సినిమా నిర్మిస్తున్నాం. ఇకపోతే పీటర్ హెయిన్ మాట్లాడుతూ.. ఈ చిత్రం కోసం తాను ఏమేం చేయగలనో అది చేస్తానని, ఇందులో అటవీ వాసీగా యాక్ట్ చేస్తున్నట్లు చెప్పాడు. సరికొత్త యాక్షన్ కథా చిత్రంగా ఉంటుందని అన్నాడు. ఇందులో నటించడానికి తాను ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. (ఇదీ చదవండి: థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో మాత్రం ఇదే టాప్ ట్రెండింగ్ సినిమా!) -
నాలుగోసారి...
హీరో రజనీకాంత్ టీమ్‌లోకి ఒక్కొక్కరుగా యాడ్ అవుతున్నారు. తాజాగా రజనీ టీమ్‌లోకి యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ జట్టులో చేరారట. ‘పిజ్జా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ డార్జిలింగ్‌లో మొదలైంది. ఈ చిత్రానికి యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పీటర్ హెయిన్ను ఓకే చేశారని కోలీవుడ్ సమాచారం. ఇదివరకు రజనీ నటించిన ‘శివాజీ, యందిరిన్, కొచ్చాడియన్’ సినిమాలకు యాక్షన్ స్టంట్స్‌ను కొరియోగ్రఫీ చేసింది పీటరే. విజయ్‌సేతుపతి, బాబీ సింహా తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు అనిరు«ద్ స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలన్నది చిత్రబృందం ఆలోచనట. -
డూప్ లేకుండా...
యస్... ఫైట్ ఓకే అన్నారు శ్రీవాస్. శ్రీనివాస్ కూల్ అయ్యారు. మరి అలాంటి ఇలాంటి ఫైట్ కాదది. రిస్కీ ఫైట్. గాల్లో ఎగిరి తన్నడం, పెద్ద గోడ మీద నుంచి దూకడం.. వాట్ నాట్ ఎన్ని రిస్కులు తీసుకోవాలో అన్ని రిస్కులూ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో చేయించారు ఫైట్‌మాస్టర్ పీటర్ హెయిన్. దర్శకుడు శ్రీవాస్ పక్కా ప్లాన్‌తో ఈ ఫైట్ తీశారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీకి సంబంధించిన ఫైట్ ఇది. ప్రస్తుతం పొల్లాచ్చీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. చిత్రనిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ– ‘‘బలమైన కథ–కథనాలతో రూపొందుతోన్న చిత్రమిది. ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత సాంకేతిక విలువలుతో నిర్మిస్తున్నాం. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. తాజాగా పొల్లాచ్చీలో 15 రోజుల షెడ్యూల్లో పీటర్ హెయిన్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ ఎపిసోడ్ తీశాం. సాయిశ్రీనివాస్ డూప్ లేకుండా ఈ ఫైట్ సీక్వెన్స్‌లో పాల్గొనడం విశేషం. ఈ ఫైట్ సినిమాకి కీలకంగా నిలుస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్ధర్ ఎ.విల్సన్, మాటలు: సాయిమాధవ్ బుర్రా. -
అమ్మడూ... లెట్స్ డూ కుమ్ముడు!
అమ్మడు’ అంటే కాజల్ అగర్వాల్ కాదు. ‘లెట్స్ డూ కుమ్ముడు’ అంటే స్టెప్పులేయడం కాదు, ఈ మాట అంటున్నది చిరంజీవి అంతకన్నా కాదు. ఇక్కడ అమ్ముడు ఎవరంటే... హన్సిక. ‘లెట్స్ డూ కుమ్ముడు’ అంటోన్నది ఎవరంటే... యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్. ఈయన గురించి తెలుసుగా. మాంచి స్టంట్సీక్వెన్సులు కొరియోగ్రఫీ చేస్తారు. సో, కుమ్ముడు అంటే కన్ఫర్మ్గా కొట్టడమనే! రౌడీలను చితకొట్టేయమని హన్సికతో అంటున్నారు. ఇదంతా సినిమా కోసమే సుమా! ‘గులేబకావలి’ అనే తమిళ యాక్షన్ కామెడీ సిన్మాలో ప్రభుదేవాకు జోడీగా హన్సిక నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ పాటలకు, హీరోతో రెండుమూడు సన్నివేశాలకు పరిమితమయ్యేది కాదు. హీరోయిన్‌తో ఫైట్లు కూడా చేయిస్తున్నారు. ఏయే సందర్భాల్లో హీరోయిన్ ఫైట్ చేస్తుందనేది సస్పెన్స్. ప్రస్తుతం చెన్నైలో హన్సిక, ఇతర ముఖ్య తారలపై కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగులో ఫైట్ సీన్స్ తీస్తున్నారు. అదండీ సంగతి!! -
దర్శకుడిగా మారుతున్న స్టంట్ కొరియోగ్రాఫర్
తిరువనంతపురం: స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ మెగా ఫోన్ పట్టేందుకు సిద్ధమవుతున్నాడు. మాలీవుడ్ మెగాస్టార్ మోహన్‌లాల్‌ను డైరెక్ట్ చేయనున్నాడు. పీటర్ చెప్పిన కథ నచ్చడంతో అతడి దర్శకత్వంలో నటించేందుకు మోహన్‌లాల్ అంగీకరించినట్టు మాలీవుడ్ సమాచారం. భారీ బడ్జెట్‌తో బహుభాషా చిత్రంగా దీన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దేశంలోని అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పనిచేయనున్నారు. ఇంతకుముందు మోహన్‌లాల్ హీరోగా నటించిన పులి మురుగన్(మన్యం పులి) సినిమాకు పీటర్ హెయిన్స్ స్టంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేశాడు. ఈ సినిమా మలయాళంలో రూ.150 కోట్లు వసూలు చేసిన తొలి చిత్రంగా నిలిచింది. ఈ సినిమా పీటర్స్ హెయిన్స్‌కు జాతీయ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. మగధీర, రోబో, బాహుబలి, బాహుబలి 2 వంటి విజయవంతమైన సినిమాలకు పీటర్ పనిచేశాడు. మోహన్‌లాల్ తాజా చిత్రం ‘విలన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్న మహాభారతంలో ఆయన ముఖ్యపాత్ర పోషించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి రానుంది. -
'మా అమ్మది వియత్నాం, నాన్నది చెన్నై'
హైదరాబాద్: పీటర్ హెయిన్స్.. ఈ పేరు దాదాపు తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. ఒకప్పుడు కొరియోగ్రాఫర్లు, సంగీత దర్శకులు, నేపథ్య గాయకులకు మాత్రమే ప్రేక్షకులకు బాగా గుర్తుండేవారు. ఫైట్స్‌లో సరికొత్త ట్రెండ్ సృష్టించిన పీటర్హెయిన్స్ ప్రేక్షకులకు సుపరిచి తుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. బంజారాహిల్స్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి గురువారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున నుంచి ఈతరం హీరోలు అల్లు అర్జున్, రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ దాకా 120 సినిమాలకు స్టంట్ మాస్టర్‌గా పని చేశానని చెప్పారు. తల్లి మేరి వియత్నాం దేశస్తురాలు కాగా, తండ్రి పెరుమాల్ చెన్నైకి చెందినవారని తెలిపారు. తాను హైదరాబాద్‌లోనే ఇల్లు కొనుక్కొని ఇక్కడే ఉంటున్నానని చెప్పారు. తెలుగు నేర్చుకుంటున్నట్లు, ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తున్నట్లు చెప్పారు. -
360 డిగ్రీల అందగాడు మహేష్ - ‘1’ ఆడియో వేడుకలో సుకుమార్
‘‘నేను చేసే ప్రతి ప్రయత్నాన్ని... అభిమానంతో ఆదరిస్తున్న మీ రుణం తీర్చుకోలేనిది. ఏం చేసి మీ రుణం తీర్చుకోగలను. చేతులెత్తి నమస్కరించడం తప్ప’’ అని అభిమానులను ఉద్దేశించి మహేష్ ఉద్వేగంగా మాట్లాడారు. సుకుమార్ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘1’. ‘నేనొక్కడినే’ అనే ఉపశీర్షికతో తెరకెక్కిన ఈ చిత్రానికి రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. కృతి సనన్ కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. మహేష్ తనయుడు గౌతమ్‌కృష్ణ ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని శ్రీను వైట్లకు అందించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ-‘‘చాలాకాలంగా దేవిశ్రీ, నేనూ కలిసి పనిచేయాలనుకుంటున్నాం. సుకుమార్ కారణంగా మా కలయిక కుదిరింది. సుకుమార్ ఐడియాస్ సూపర్బ్. మూడేళ్లు ఈ సినిమాకోసం ఆయన పడ్డ కష్టం కళ్లతో చూసిన వాణ్ణి. పీటర్‌హేన్స్ ఈ సినిమాలో నాతో పెద్ద పెద్ద సాహసాలే చేయించారు. బిల్డింగుల మీదనుంచి దూకించేశారు. నేను డాన్సులు చేయడం లేదని అభిమానుల్లో ఓ బాధ ఉంది. ఆ బాధను ఈ సినిమా తీర్చేస్తుంది. మరో సినిమా ఒప్పుకోకుండా రెండేళ్లు మాతో ఉండి అద్భుతమైన అవుట్‌పుట్ ఇచ్చారు కెమెరామేన్ రత్నవేలు. ఈ సినిమా ద్వారా మా అబ్బాయి గౌతమ్ నటుడిగా పరిచయమవుతున్నాడు. ఇది నాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్న అంశం. నా కంటే తానే బాగా చేశానని వాడి ఫీలింగ్. ఏదిఏమైనా ఈ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. టోటల్‌గా నా కెరీర్లోనే బెస్ట్ మూవీ ఇది’’ అని నమ్మకం వ్యక్తం చేశారు. ‘‘దేవిశ్రీతో నా అయిదో సినిమా ఇది. నా గత చిత్రాల్లాగే మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమాకు ఈ లుక్, ఈ కలర్ రావడానికి కారణం రత్నవేలు. సాంకేతికంగా ఈ సినిమా నిజంగా వండర్ అనే చెప్పాలి. ఓ కాఫీ షాప్‌లో రెండేళ్ల క్రితం మహేష్‌కి ఈ కథ చెప్పాను. రీసెంట్గా షూటింగ్ జరుగుతున్నప్పుడు స్క్రిప్ట్‌లో ఎక్కడో చిన్న మార్పు జరిగింది. ‘అప్పుడు నువ్వు ఈ కథ ఇలా చెప్పలేదే’అని అడిగారు. ఆయనలోని జ్ఞాపకశక్తి చూసి అనిపించింది ఎస్.. హీఈజ్ ‘1’ అని. మహేష్‌కి స్విమ్మింగ్ రాదు. కానీ... సముద్రంలో ఎంతో అనుభవం ఉన్నవాడిలా స్కై డైవింగ్ చేసేశారు. ఆయనలోని తెగువ చూసి అనిపించింది. హీ ఈజ్ ‘1’ అని. కెమెరాలోంచి ఏ కోణంలో చూసినా అందంగా ఉంటారు మహేష్. ఆయన 360 డిగ్రీల అందగాడు. ఆయన అందం చూసి అనిపించింది. హీ ఈజ్ ‘1’ అని. నిజంగా నేను లక్కీ. ఎలాగంటే... ఫ్యూచర్ సూపర్‌స్టార్‌ని పరిచయం చేసే అదృష్టం నాకు దక్కింది. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ గౌతమ్’’అని సుకుమార్ అన్నారు. చిత్రం యూనిట్ సభ్యులతో పాటు, సూపర్‌స్టార్ కృష్ణ, జి.ఆదిశేషగిరిరావు, నమ్రత, బోయపాటి శ్రీను, సుధీర్‌బాబు, లహరి మ్యూజిక్ మనోహర్‌నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.